ఎంఎస్ ధోని, హర్భజన్ సింగ్
సాక్షి, చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -11లో ఒక్కో జట్టుది ఒక్కో అనుభవం. అయితే విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు మాత్రం ఈ సీజన్ ప్రత్యేకమని చెప్పవచ్చు. అసలే రెండేళ్ల నిషేధం తర్వాత రీఎంట్రీ ఇచ్చినా.. తొలి యత్నంలోనే ఎంఎస్ ధోని సేన కప్పు ఎగరేసుకుపోయింది. తమ జట్టు కప్పు నెగ్గిన నేపథ్యంలో టీమిండియా సీనియర్ క్రికెటర్, చెన్నై ప్లేయర్ హర్భజన్ సింగ్ కొన్ని మధురస్మృతులను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.
‘అదే స్టేడియం (ముంబైలోని వాంఖేడె)లో మేము 2011లో జరిగిన వన్డే ప్రపంచ కప్ సాధించాం. కానీ ఐపీఎల్‌లో పదేళ్లపాటు ప్రత్యర్థులుగా ఉన్న మేము 11వ సీజన్‌లో ఒకే జట్టు తరఫున ఆడతామనుకోలేదు. ఈ విధంగా ప్రస్తుతం కప్పు నెగ్గుతామని ఊహించలేకపోయాం. వాంఖేడె మాకు కలిసొచ్చిందని’ ఎంఎస్ ధోని, చెన్నై ఐపీఎల్ అని ట్యాగ్ చేస్తూ భజ్జీ ట్వీట్ చేశాడు. భజ్జీ చేసిన ఈ ట్వీట్ విశేష స్పందన వస్తోంది. వేల సంఖ్యలో రీట్వీట్లు, లైక్స్‌తో హర్భజన్ ట్వీట్ వైరల్ అవుతోంది.
కాగా, చెన్నై జట్టు ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌కు ఇంతకాలం ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు, హర్భజన్‌లు ఐపీఎల్ 11లో చెన్నైకి ఆడారు. దీంతో నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టు సభ్యులుగా రాయుడు, భజ్జీలు నిలిచారు. గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన వీరు మూడు పర్యాయాలు ఐపీఎల్ నెగ్గిన జట్టులో సభ్యులు.
Same ground where we won the World Cup 2011 together and never imagine we would be playing together in ipl for the same team and winning it after 10 years playing against each other’s...Wankhede lucky venue for us ? @msdhoni @ChennaiIPL @IPL 🥇🏆🏏💪 pic.twitter.com/4Bkgt4Xnil
— Harbhajan Turbanator (@harbhajan_singh) 30 May 2018
Comments
Please login to add a commentAdd a comment