నవ్వు ఆపుకోలేకపోయిన ధోని.. | MS Dhoni laughs as Shreyas Iyer sends the coin flying at toss | Sakshi
Sakshi News home page

నవ్వు ఆపుకోలేకపోయిన ధోని..

Published Sat, May 19 2018 1:01 PM | Last Updated on Sat, May 19 2018 5:43 PM

MS Dhoni laughs as Shreyas Iyer sends the coin flying at toss - Sakshi

శ్రేయస్‌ అయ్యర్‌, ధోనీ

సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. మైదానంలో ఉన్న ధోని ఓ సందర్భంలో నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

మ్యాచ్‌ ఆరంభానికి ముందు రెండు జట్ల కెప్టెన్లు ధోని, శ్రేయస్‌ అయ్యర్‌లు మైదానంలోకి వచ్చారు. శ్రేయస్‌ అయ్యర్‌ టాస్ కోసం కాయిన్‌ను ఎగురవేశాడు. ఆ కాయిన్‌ ఆటగాళ్లకు చాలా దూరంలో పడింది. అంత దూరం కాయిన్‌ పడటం చూసిన ధోని నవ్వు ఆపుకోలేకపోయాడు. ధోనితో పాటు అక్కడ ఉన్నవారంతా కూడా నవ్వారు. అనంతరం టాస్‌ గెలిచిన ధోని.. ఢిల్లీని  బ్యాటింగ్‌ చేయాల్సిందిగా కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ నిర్వాహకులు ట్విటర్‌లో పోస్టు చేశారు. దాంతో ఈ వీడియోను అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. ధోనిని చూసిన ఫ్యాన్స్‌.. నువ్వు అందుకే మిస్టర్‌ కూల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

కాగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సొంత మైదానం ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ 163 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపును అందుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement