live coverage
-
కోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం!
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసే విషయమై తాము సానుకూలంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. ఓపెన్ కోర్టు తరహా విధానంతో కోర్టులో ప్రజలు గుమిగూడటాన్ని తగ్గించవచ్చంది. కోర్టుల విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై మార్గదర్శకాల రూపకల్పన కోసం కేంద్రం తరఫున అటార్నీ జనరల్(ఏజీ) వేణుగోపాల్ సూచనలను సుప్రీంకు సమర్పించారు. తర్వాత ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ విషయమై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ‘ప్రత్యక్ష ప్రసారంతో ఇబ్బందులు ఉంటాయని మేం అనుకోవట్లేదు. ఈ విధానాన్ని మేమే తొలిసారి పరీక్షిస్తాం. అన్నిచోట్ల మొదటిసారిగా ప్రత్యక్ష ప్రసారాన్ని అమలుచేయడం సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించింది. దేశంలోని అన్ని కోర్టుల్లో జరిగే విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు వాటిని రికార్డు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్)పై సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది. రాజ్యాంగ అంశాలకే పరిమితం చేయండి: కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణు గోపాల్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ ప్రాధాన్యం ఉన్న కేసుల విచారణకే ప్రత్యక్ష ప్రసారాన్ని అనుమతించాలని కోరారు. దేశ భద్రత, భార్యాభర్తల గొడవలు, బాల నేరస్తులకు సంబంధించిన కేసులను దీని నుంచి మినహాయించాలని సూచించారు. కోర్టులో విచారణ సందర్భంగా లాయర్ తప్పుగా ప్రవర్తిస్తే.. 70 సెకన్ల పాటు ప్రసారాన్ని ఆపేసే ఏర్పాటు ఉండాలన్నారు. ఈసమయంలో ఆ లాయర్ మాటల్ని వినిపించకుండా శబ్దాన్ని ఆపేయాలన్నారు. విచారణ సందర్భంగా రద్దీ పెరిగిపోతున్నందున పిటిషనర్లు, జర్నలిస్టులు, లాయర్లు, సందర్శకులు, తదితరుల కోసం ‘మీడియా రూమ్’ను ఏర్పాటు చేయాలని వేణు గోపాల్ సుప్రీంకోర్టుకు సూచించారు. ప్రత్యక్ష ప్రసారాన్ని తాత్కాలికంగా నిలిపివేసే, పూర్తిగా ఆపేసే అధికారం జడ్జీలకు ఉండాలన్నారు న్యాయవాది వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్.. కేసులను విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై సుప్రీంకోర్టులో శుక్రవారం వాడీవేడి వాదనలు కొనసాగాయి. ఓవైపు ప్రత్యక్ష ప్రసారాన్ని రాజ్యాంగ ధర్మాసనాలు విచారించే అంశాలకే పరిమితం చేయాలని ఏజీ వేణు గోపాల్ చెప్పగా, పిటిషనర్ల తరఫు న్యాయవాది మాథ్యుస్ జె.నెడుంపర దీనికి అభ్యంతరం తెలిపారు. లైవ్ స్ట్రీమింగ్‌ను కేవలం రాజ్యాంగ అంశాలకే కాకుండా అన్ని కేసులకు వర్తింపజేయాలని కోరారు. అప్పుడే సుప్రీంకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కేవలం 30 సెకన్లలోనే కొట్టివేస్తున్న విషయం ప్రజలకు తెలుస్తుందన్నారు. దీంతో మాథ్యుస్ వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ‘ప్రజలు మా ఇళ్లకు వచ్చి ఓసారి చూడాలి. కోర్టుకు బయలుదేరేముందు ప్రతిరోజూ అరగంట పాటు ఈ పిల్ పిటిషన్లను మేం పరిశీలిస్తుంటాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. -
మహిళా రిపోర్టర్‌తో.. బిత్తిరి చర్య
మాస్కో : ఫిఫా ప్రపంచ కప్‌లో మహిళా న్యూస్ రిపోర్టర్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. కొలంబియాకు చెందిన జూలియట్ గోంజాలెజ్ థెరాన్ ఓ జర్మన్ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారు. రష్యాలో జరుగుతున్న ప్రపంచకప్ కవరేజ్ కోసం వెళ్లిన థెరాన్ సరన్స్ ప్రాంతంలో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఓ అపరిచిత వ్యక్తి వచ్చి ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించి, ముద్దు పెట్టాడు. లైవ్ కవరేజ్ కావడంతో థెరాన్ రియాక్ట్ కాలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఆ మహిళా రిపోర్టర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. న్యూస్ టీం, తాను లైవ్ కవరేజ్ కోసం రెండు గంటల నుంచి ఆ ప్రాంతంలో కష్టపడుతున్నామని, లైవ్ రిపోర్టింగ్ మొదలు పెట్టాక రియాక్ట్ అయ్యే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఆ వ్యక్తి వేచి చూసి, ఈ సిగ్గుమాలిన పని చేశాడని థెరాన్ పేర్కొన్నారు. లైవ్ రిపోర్టింగ్ అనంతరం ఆ వ్యక్తి కోసం వెతికినా దొరకలేదని తెలిపారు. ‘నేను ఇలాంటి ఘటన ఎదుర్కొంటానని కలలో కూడా ఊహించలేదు. మేము ఫుట్‌బాల్ గురించి ఎంతో కొంత సాకర్ అభిమానులకు తెలియజేయాలని అనుకున్నాం. కానీ అభిమానం ప్రేమగా స్వీకరించేలా ఉండాలి కాని వేదింపుగా ఉండకూడదు’అంటూ థెరాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ యువకుడి చర్యపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. -
న్యూస్ రిపోర్టర్‌కు ఊహించని సంఘటన!
-
టీవీ చానళ్లకు ప్రధాని వార్నింగ్
ఢాకా: ఉగ్రవాదుల దాడి సందర్భంగా బంగ్లాదేశ్ టీవీ చానళ్లు ప్రదర్శించిన అత్యుత్సాహంపై ప్రధాని షేక్ హసినా మండిపడ్డారు. టీవీ చానళ్ల లైసెన్సులు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పలువురిని బందీలుగా పట్టుకున్న ఐసిఎస్ ముష్కరులను మట్టుబెట్టెందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను టీవీ చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. 'ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించేందుకు మేము చేపట్టిన ఏర్పాట్లను వార్తా చానళ్లు లైవ్ ప్రసారం చేశాయి. ఈ ప్రసారాలు ఉగ్రవాదులు చూస్తారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. తమను అంతం చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుందో తెలిస్తే ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశముంటుంది. ఇలాంటి వ్యవహారాల్లో సంయమనం పాటించాలని వార్తా చానళ్ల యజమానులను కోరుతున్నా'నని హసినా అన్నారు. శనివారం సైనిక చర్య ముగిసిన కొద్దిసేపటికే ప్రధాని షేక్ హసీనా టెలివిజన్ ప్రసారంలో ప్రసంగించారు. సైనిక చర్య సందర్భంగా టీవీ చానళ్లు వ్యవహరించిన తీరును ఆమె విమర్శించారు. 'అమెరికాలో ఇలాంటి దాడులు జరిగినప్పుడు సీఎన్ఎన్ లేదా బీబీసీ ప్రభుత్వ చర్యలను పక్షపాతంతో చూపిస్తాయా? కానీ మన దేశంలో టీవీ చానళ్ల మధ్య ఎక్కువ ఉండడంతో అత్యుత్సాహం ప్రదర్శించాయి. ఇదేమి చిన్న పిల్లల ఆట కాదు. మా ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చింది. వాటిని రద్దు చేసే అధికారం కూడా మాకుంది. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరముంద'ని హసినా పేర్కొన్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీ రెస్టారెంట్లో విదేశీయులను బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు ఒక భారతీయ యువతి సహా 20 మందిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు. భద్రతాబలగాలు 10 గంటల పాటు సైనిక చర్య జరిపి ఆరుగురు ఉగ్రవాదులను తుదముట్టించాయి. -
ఆరుగంటలు లైవ్‌లో స్పేస్ వాక్!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన నాసా సంస్థ ఓ మహత్తర కార్యక్రమానికి తెరతీసింది. రష్యాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు ఆరు గంటలపాటు అంతరిక్షంలో నడుస్తుండగా దానిని లైవ్‌లో అందించనుంది. అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉన్న ఇద్దరు రష్యా వ్యోమగాములు గెన్నడీ పడాల్కా, ప్లైట్ ఇంజినీర్ మికెయిల్ కోర్నెన్కో స్పేస్ వాక్ చేయనున్నారు. ప్రత్యేక దుస్తులు ధరించి శూన్యంలోకి సోమవారం రాత్రి 19.44గంటల ప్రాంతంలో అడుగుపెట్టనున్నారు. అంతరిక్షంలో నడిచే సమయంలో వారు చుట్టూ ఉన్న ప్రదేశాలను చాలా స్పష్టంగా ఫొటోలు చిత్రీకరించనున్నారు. దీంతోపాటు వారు గ్యాప్ స్పానర్స్ అనే పరికరాలను, కమ్యూనికేషన్ యాంటెన్నాలను అంతరిక్ష కేంద్రం పై భాగంలో అమర్చనున్నారు. -
'ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దు'
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని గురుదాస్ పూర్ ఉగ్రవాదుల దాడి దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ మేరకు టీవీ చానెళ్లకు సూచించింది. కొన్ని చానెళ్లు నిబంధనలను ఉల్లంఘించి లైవ్ కవరేజీ అందించాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుదాస్ పూర్ జిల్లాలోని దీనానగర్‌లో ఈ రోజు ఉదయం నుంచి ఉగ్రవాదులు, భద్రత దళాల మధ్య కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2015 కేబుల్ నెట్ వర్క్ నిబంధనల ప్రకారం.. భద్రత దళాలు చేపట్టే ఉగ్రవాద నిర్మూలన చర్యలను టీవీ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయరాదని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే గురుదాస్ పూర్ ఘటనకు సంబంధించి కొన్ని చానెళ్లు నిబంధనలు ఉల్లంఘించాయని పేర్కొంది.