'ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దు' | Don't show live coverage of terror attack: Government to TV channels | Sakshi
Sakshi News home page

'ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దు'

Published Mon, Jul 27 2015 4:44 PM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

'ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దు' - Sakshi

'ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దు'

న్యూఢిల్లీ: పంజాబ్లోని గురుదాస్ పూర్ ఉగ్రవాదుల దాడి దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ మేరకు టీవీ చానెళ్లకు సూచించింది. కొన్ని చానెళ్లు నిబంధనలను ఉల్లంఘించి లైవ్ కవరేజీ అందించాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

గురుదాస్ పూర్ జిల్లాలోని దీనానగర్లో ఈ రోజు ఉదయం నుంచి ఉగ్రవాదులు, భద్రత దళాల మధ్య కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2015 కేబుల్ నెట్ వర్క్ నిబంధనల ప్రకారం.. భద్రత దళాలు చేపట్టే ఉగ్రవాద నిర్మూలన చర్యలను టీవీ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయరాదని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే గురుదాస్ పూర్ ఘటనకు సంబంధించి కొన్ని చానెళ్లు నిబంధనలు ఉల్లంఘించాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement