gurdaspur-terror attack
-
'ఉగ్రవాదదాడి పిరికిపందల చర్య'
అనంతపురం: పంజాబ్లో గురుదాస్ పూర్ ఉగ్రవాద దాడి ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. ఉగ్రవాదదాడి పిరికిపందల చర్యని వైఎస్ జగన్ పేర్కొన్నారు. దీనానగర్లో ఉగ్రవాదుల దాడిలో పోలీసులు, సాధారణ పౌరులు చనిపోవడం బాధాకరమని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో పాల్గొంటున్న వైఎస్ జగన్ ఉగ్రవాదదాడి ఘటనపై స్పందించారు. పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లా దీనానగర్ ప్రాంతంలో పోలీసు స్టేషన్లోకి చొరబడి.. పోలీసులతో పాటు పలువురు సామాన్య పౌరులను కూడా కాల్చి చంపిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎదురు కాల్పుల్లో హతమార్చాయి. ఈ దాడిలో ఎస్పీ బల్జీత్ సింగ్ సహా నలుగురు పోలీసులు మరణించారు. -
'ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దు'
న్యూఢిల్లీ: పంజాబ్లోని గురుదాస్ పూర్ ఉగ్రవాదుల దాడి దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ మేరకు టీవీ చానెళ్లకు సూచించింది. కొన్ని చానెళ్లు నిబంధనలను ఉల్లంఘించి లైవ్ కవరేజీ అందించాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుదాస్ పూర్ జిల్లాలోని దీనానగర్లో ఈ రోజు ఉదయం నుంచి ఉగ్రవాదులు, భద్రత దళాల మధ్య కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2015 కేబుల్ నెట్ వర్క్ నిబంధనల ప్రకారం.. భద్రత దళాలు చేపట్టే ఉగ్రవాద నిర్మూలన చర్యలను టీవీ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయరాదని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే గురుదాస్ పూర్ ఘటనకు సంబంధించి కొన్ని చానెళ్లు నిబంధనలు ఉల్లంఘించాయని పేర్కొంది.