
'వీఐపీ టిక్కెట్లు విక్రయించినవారిపై కేసులు పెట్టండి'
వైకుంఠ ఏకదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారి భక్తులపై టీటీడీ కేసులు నమోదు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఖండించారు.
వైకుంఠ ఏకదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారి భక్తులపై టీటీడీ కేసులు నమోదు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఖండించారు. గురువారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... వీఐపీ టిక్కెట్లు విక్రయించిన వారిపైనే కేసులు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే భక్తులపై కేసుల నమోదుకు కారణమైన అధికారులపై చర్యలకు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. భక్తులపై కేసు నమోదు అంశంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలన్నారు.
వైకుంఠ ఏకదశి సందర్భంగా శనివారం తిరమలకు భక్తులు పోటెత్తారు. అయితే టీటీడీ మాత్రం వీవీఐపీల సేవలో తరించింది. దాంతో భక్తులకు శ్రీవారి దర్శనం మరింత ఆలస్యం అయింది. దాంతో ఆగ్రహించిన భక్తులు టీటీడీ ఛైర్మన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కాగా తిరుమలలో ఆందోళనలు నిషేధం. దాంతో టీటీడీ అధికారులు భక్తులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఆ క్రమంలో సీసీ కెమెరా ఫూటెజ్ లను తెప్పించుకుని పలువురు భక్తులపై కేసులు నమోదు చేశారు. దాంతో భక్తులపై కేసులా అంటు అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది.