వైరల్‌ వీడియో: దీని నటనకు ఆస్కార్‌ ఇచ్చినా తక్కువే.. | Cute Dog Plays Dead To Avoid Taking a Bath In Viral Video | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: అయ్యయ్యో.. తెలిసిపోయిందా..

Published Tue, Apr 20 2021 8:42 AM | Last Updated on Tue, Apr 20 2021 3:06 PM

Cute Dog Plays Dead To Avoid Taking a Bath In Viral Video - Sakshi

జంతువులు మనుషుల జీవితాల్లో భాగమైపోయాయి. చాలామంది పెంపుడు జంతువులను ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటారు. వాటికి ఏ లోటు రాకుండా ప్రేమగా పెంచుకుంటారు.. అయితే సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు కుక్కలనే ఎక్కువగా పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. శునకాలు, మనుషుల మధ్య సంబంధం ప్రత్యేకంగా ఉంటుంది. దాని సపర్యలన్ని వాళ్లే దగ్గరుండి చూస్తారు. వాటికి స్నానం చేయించడం మొదలు తినిపించడం వరకు ఎంతో ఇష్టంగా చేస్తుంటారు. అయితే అతి చనువు కారణంగా యాజమానులపై పెంపుడు కుక్కలు కొన్ని సార్లు మారం చేస్తుంటాయి. శునకాలు ఎంత విశ్వాసంగా ఉంటాయో నటించడంలోనూ అంతే ఆరితేరి ఉంటాయి.

తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే..  ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ఓ కుక్క తన యాజమాని దగ్గర అద్భుత ప్లాన్‌ వేసింది. స్నానం నుంచి తప్పించుకునేందుకు తెలివిగా నటించింది. యాజమాని దాన్ని స్నానం చేయించడానికి ప్రయత్నించినప్పుడు కుక్క చనిపోయినట్లు పన్నాగం పన్నింది. దాన్ని లేపడానికి ఎంత ప్రయత్నించినా కుక్క ఉలుకు పలుకు లేకుండా నేలపై అలాగే పడుకొని ఉంది. ఇక చివరికి యజమాని.. కుక్క నోటి దగ్గర పట్టుకొని పైకి ఎత్తినప్పుడు దాని దొంగ తెలివి బయట పడింది. అయ్యో నా నాటకం తెలిసిపోయిందా అంటూ ఓర చూపుతో ఓ లుక్కిచ్చింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు కుక్క తెలివితేటలను ప్రశంసిస్తున్నారు. నటించడంలో డాక్టరేట్‌ తీసుకుందని, యాక్టింగ్‌కు ఆస్కార్‌ ఇవ్వచ్చు అంటూ  ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు. మరి దీన్ని మీరు చూడండి..

చదవండి: కుక్కకు ఉద్యోగం.. నెలకు 15 లక్షల జీతం!
ఇలాంటి లడ్డు నెవర్‌ బిఫోర్‌ .. ఎవర్‌ ఆఫ్టర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement