కొంతమంది ఆరోగ్యానికి సంబంధించిన ఆహార డైట్‌ని తెగ ఫాలోవుతారు. అయినప్పటికి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. మరికొంతమంది ఎలాంటి ఆహార డైట్ ఉండదు. పైగా వాళ్లు పెద్దగా ఆరోగ్యం గురించి పట్టించుకోరు కూడా. అయినా వాళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటారు. కానీ అసలు ఎలాంటి శుభ్రత లేకుండా అత్యంత హేయంగా జీవించడమే కాకుండా కనీసం స్నానం కూడా చేయకుండా ఆరోగ్యంగా జీవిస్తున్న వ్యక్తి గురించి విన్నారా!. అయితే ఈ వృద్ధుడి జీవన శైలి చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
అసలు విషయంలోకెళ్తే...ఇరాన్‌కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు అమో జాజి 67 ఏళ్లుకు పైగా స్నానమే చేయలేదట. పైగా అతను పందికొక్కులు, కుందేళ్లను తినడం, నీటి కుంటల్లో నీరు తాగడం వంటివి అతని జీవశైలి. అయితే అతని ఆరోగ్యం చూసి శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు అతను ఒంటరిగానే గడుపుతాడు. చాలాకాలం అతను సోరంగంలోనే జీవించాడట. అయితే అతని విచిత్ర జీవన శైలిని చూసి ఆశ్యర్యపోయిన దేజ్‌గా గ్రామస్తులు ఆ వృద్ధుడు కోసం ఒక పూరి గుడిసెను నిర్మించి ఇచ్చారు.
ఈ మేరకు టెహ్రాన్‌లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కి సంబంధించిన పారాసిటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆ వృద్ధుడికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే అతను 67 ఏళ్లుగా స్నానం చేయకపోయినప్పటికి అతని శరీరంలో ఎలాంటి పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు లేవని అతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడని ధృవీకరించారు. అయితే ఆ వృద్ధుడు స్థానిక పరిపాలనాధికారుల సహాయాన్ని పొందాడు. పైగా స్థానిక గవర్నర్ అతన్ని ఇబ్బంది పెట్టవద్దని ప్రజలను కోరడం గమనార్హం.
(చదవండి: ఔను! ఆ పబ్‌లో దెయ్యాలు ఉన్నాయి ! డెవిల్ వైరల్ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment