This Udaipur samosa seller's message about hard work will inspire you - Sakshi
Sakshi News home page

ఆ సమోసాల అమ్మే వ్యక్తి..ఓ గొప్ప జీవిత పాఠాన్ని నేర్పాడు!

Published Fri, Jul 28 2023 5:18 PM | Last Updated on Fri, Jul 28 2023 5:29 PM

Elderly Man Selling Samosas In Udaipur Gives Inspiring Life Lessons - Sakshi

మనకు జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే.. మేధావులు, జీనియస్‌లు, పండుతుల వద్దకే వెళ్లాల్సిన అవసరం లేదు. మన చుట్టూ జరుగుతున్న వాటిని గమనించినా.. లేదా కష్టజీవులను చూసినా ఎంతో నేర్చుకోవచ్చు. మనం పడుతున్నదే కష్టం కాదు అంతకు మించి ఉందని అర్థం అవుతుంది. అందుకు ఉదహరణే ఈ ఉదయ్‌పూర్‌ వృద్ధుడు. 

ఆ వృద్ధుడు ఉదయ్‌పూర్‌లోని కోర్టు సర్కిల్‌ సమీపంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద రోడ్డుపక్కనే సమోసాలు అమ్ముతుంటాడు. సరిగ్గా ఆ సమయానికి అటుగా ఆర్యాన్ష్‌ అనే వ్యక్తి కారులో వస్తున్నాడు. కరక్ట్‌గా ఆ టైంలో మంచి జోరుగా వర్షం వస్తుంది. దీంతో ఆర్యాన్ష్‌ కారు పక్కకు పార్క్‌ చేసి నేరుగా అతని వద్దకు వచ్చాడు. గట్టిగా వర్షం కురుస్తుండటంతో ఏదైనా తిందామనిపించి చూడగా ఆ వృద్ధుడు అక్కడే సమోసాలు, పోహా అమ్మడం చూసి అతని దగ్గరకు వెళ్లాడు.

కొన్ని సమోసాలు ఆర్డర్‌ చేసి తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ వయసులో ఇంకా ఎందుకు కష్టపడుతున్నావు అని ఆర్యాన్ష్‌ ప్రశ్నిస్తాడు. దానికి ఆ వ్యక్తి బదులుగా..ఈ వయసులో డబ్బు సంపాదించేందుకు కష్టం పడటం లేదు బేటా!. నా మనసును సంతోషంగా ఉంచుకునేందుకు నాకు నచ్చిన పని చేస్తున్నాను. ఇలా నేను వండిన వంటకాల రుచిని ఆస్వాదించిన ముఖాలను చూస్తే నా మనసు సంతోషంతో నిండిపోతుంది. నేను ఒంటరిగా ఇంటి వద్ద కూర్చొవడం కంటే ఇదే మేలని చెబుతాడు ఆ వృద్ధుడు.

దానికి రియలైజ్‌ అయిన అర్యాన్ష్‌ ఇది జీవితానికి ఉపయోగపడే విలువైన పాఠం ఇది. వయసులో ఉన్న యువత సైతం ఒళ్లు వంచడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇంతటి పండు ముదుసలి వయసులో ఎంతో ఉషారుగా పనిచేస్తున్నాడు. పైగా పనిచేస్తేనే సంతోషంగా ఉంటుందని చెబుతున్నాడు. అతని దృక్పథాన్ని వింటే ఎందరో యువత తమ జీవన విధానాన్ని మార్చుకుంటారు కదా అని ట్విట్టర్‌ వేదికగా ఈ విషయన్ని నెటిజన్లతో పంచుకున్నాడు ఆర్యాన్ష్‌. దీంతో నెటిజన్లు సదరు వృద్ధుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్లు చేశారు. 

(చదవండి: 600 మిలియన్ల ఏళ్ల నాటి సముద్రం..భూమి పుట్టుకకు ముందు..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement