
అనుశ్రీ– ఈరన్న పెళ్లి ఫోటో
సాక్షి, బెంగళూరు: ఆయన వయసు 75 ఏళ్లు.. ఆమె వయసు 35.. ఇద్దరూ సంప్రదాయబద్ధంగా వివాహ బంధంతో ఒక్కటైన ఘటన కర్ణాటకలో చిక్కబళ్లాపురం జిల్లా అప్పేగౌడనహళ్లిలోజరిగింది. వివరాల్లోకి వెళితే... అప్పేగౌడనహళ్లికి చెందిన ఈరన్న అనే మోతుబరి రైతు భార్య గతంలోనే మరణించింది. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఒంటరితనంతో బాధపడుతున్నాడు.
అనుశ్రీ అనే మహిళ భర్త నుంచి విడిపోయి వేరుగా జీవిస్తోంది. ఆమెకు పిల్లలు ఉన్నారు. ఈరన్న ఆమెతో పెళ్లి ప్రస్తావన తేగా అంగీకరించింది. దీంతో స్వగ్రామంలో నిరాడంబరంగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోషూట్ జరుపుకున్నారు. మనవళ్లతో కాలక్షేపం చేస్తూ కృష్ణా రామా అనుకునే వయస్సులో తాతయ్య రెండో పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చదవండి: 4 కళ్ల నల్లని చారల చేప... చూసేందుకు జనం పరుగులు!