
కాసేపట్లో పెళ్లితో కళకళలాడాల్సి వేదిక కాస్త ఒక్కసారిగా నిశబ్దమైపోయింది. పాపం వరుడు ఏదో సరదాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేద్దాం అనుకుంటే..అదే తనకు ఊహించని బాధని, అవమానాన్ని మిగిల్చింది. ఏ పాటకు కాలు కదిపితే బాగుంటుందో సంమయనంతో ఆలోచిస్తే బాగుండేది. లేదంటే ఇలాంటి దుస్థితి పట్టేది కాదేమో. కొన్ని విషయాల్లో కామెన్ సెన్స్‌తో వ్యవహరించాలి. లేదంటే ఆ వరుడిలా చేదు అనుభవాన్ని ఎదుర్కొనక తప్పేదేమో..!.
ఈ ఘటన న్యూఢిల్లీ(New Delhi)లో చోటు చేసుకుంది. వరుడు(Groom) ఊరేగింపుతో న్యూఢిల్లీలోని వివాహ మండపం వద్దకు చేరుకున్నాడు. అయితే అతడి స్నేహితులు నృత్యం చేయమని బలవంతం చేయడంతో ప్రసిద్ధ బాలీవుడ్ పాట(Bollywood Song) 'చోళీ కే పీఛే క్యా హై'కి డ్యాన్స్ చేశాడు. అందులోనూ సాక్షాత్తు వరుడు ఈ పాటకు డ్యాన్స్ చేయడంతో వధువు తండ్రికి చాలా అవమానంగా అనిపించింది.
కాబోయే అల్లుడు తీరు ఇలా ఉందేంటని వెంటనే పెళ్లి(Wedding)ని అర్థాంతరంగా ఆపేసి వివాహ తంతుని రద్దుచేసుకుంది వధువు కుటుంబం. వరుడు చర్యలు కుటుంబ విలువలను అవమానించేలా ఉన్నాయని చెబుతూ వధువు కుటుంబం అక్కడ నుంచి నిష్రమించినట్లు సమాచారం. ఈ ఘటనతో వధువు కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అయితే వరుడు ఇదంతా ఏదో ఫన్ కోసం అని వధువు తండ్రిని ఒప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం..వధువు తండ్రికి వరుడు చేసిన పని చాలా ఆగ్రహం తెప్పించిందని, ఆయన అందుకే తక్షణమే పెళ్లిని నిలిపేసినట్లు చెబుతున్నారు బంధువులు. అలాగే తన కుమార్తెతో ఆ వరుడు కుటుంబం ఎలాంటి సంబంధాలు నెరకూడదని వధువు తండ్రి గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు మాత్రం ఆ తండ్రి సరైన నిర్ణయం తీసుకున్నాడు.
లేదంటే ఈ డ్యాన్స్ రోజు చూడాల్సి వచ్చేదంటూ వధువు తండ్రికే మద్దతిస్తూ పోస్టులు పెట్టారు. ఈ కథ మన చుట్టు ఉన్నవాళ్లు, స్నేహితులు ఫన్ అంటూ ఏదేదో చేయమంటారు. కానీ అది సరైనదా కాదా అని ఆలోచించి అడుగు వేయపోతే నష్టపోయేది మనమే. ఆ ఫన్ సంతోషం తెప్పించకపోయినా పర్లేదు..మన చేత కన్నీళ్లు పెట్టించేదిగా ఉండకూడదు.
probably the funniest ad placement i’ve seen till date 😂 pic.twitter.com/a189IFuRPP
— Xavier Uncle (@xavierunclelite) January 30, 2025
(చదవండి: 'ది గ్రామఫోన్ గర్ల్': శాస్త్రీయ సంగీతాన్ని జస్ట్ మూడు నిమిషాల్లో..!)