
సాధారణంగా వివాహాలు చాలా మంది చేసుకుంటుంటారు. అయితే అందులో కొన్ని మాత్రమే వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. అందులో ఒకటి 45 వెడ్స్ 25 పెళ్లి స్టోరీ. అప్పట్లో సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టి వైరల్ కాగా తాజాగా ఆ వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో విషాదాంతమైంది. ఈ ఘటన కర్ణాటక తుమకూరు జిల్లాలోని అక్కిమరిద్య గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన శంకరప్పకు 45 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. ఎన్ని సంబంధాలు వచ్చినా అవి పెళ్లి పీటలు వరకు వెళ్లేవి కాదు. ఇంతలో అప్పటికే వివాహమై భర్త నుంచి విడిపోయిన 25 ఏళ్ల మేఘనను శంకరప్ప కలిశాడు. అనంతరం మేఘన శంకరప్పను ప్రేమించి 2021 అక్టోబర్‌లో పెళ్లి చేసుకుంది.
ఈ వివాహం అప్పట్లో వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేసింది. అయితే పెళ్లైన తర్వాత శంకరప్పకు చెందిన రూ.2.5 కోట్ల భూమిని అమ్మాలని మేఘన ఒత్తిడి తెచ్చింది. దీనికి శంకరప్ప అమ్మ ఒప్పుకోలేదు. దీంతో తరచూ వారి మధ్య గొడవలు జరుగుతుండడంతో చెట్టుకు ఉరేసుకుని శంకరప్ప ఆత్మహత్య చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment