యశవంతపుర( బెంగళూరు): వధువు ఎడమ చేతితో అన్నం తినడాన్ని జీర్ణించుకోలేక వరుడు ఆమెను వదిలేసి వెళ్లగా పోలీసులు సర్ది చెప్పి తీసుకొచ్చారు. ఈఘటన కార్వార జిల్లా దాండేళి కొళగి ఈశ్వర దేవస్థానంలో శుక్రవారం జరిగింది. జోయిడాకు చెందిన కబీర్ కాతు నాయక్ అనే యువకుడికి యల్లాపురకు చెందిన అమ్మాయితో శుక్రవారం ఉదయం కొళగి ఈశ్వర దేవస్థానంలో వివాహం జరిగింది. ( చదవండి: వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తెచ్చి.. )
అనంతరం వధూవరులు భోజనానికి కూర్చున్నారు. వధువు ఎడమ చేతితో అన్నం తినడాన్ని గమనించిన వరుడు.. తనకు ఈ అమ్మాయి వద్దని చెబుతూ పెళ్లిబట్టలతోనే బయటకు వెళ్లిపోయాడు. కంగుతిన్న అమ్మాయి కుటుంబ సభ్యులు 112 పోలీస్ సహాయవాణికి సమాచారం ఇచ్చారు. వారు చేరుకొని వరుడిని తీసుకొచ్చి సర్దిచెప్పి వివాదం సద్దుమణిగేలా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment