
Viral Photo: కొందరి క(వ్య)థలు.. ఇట్టే ఆకట్టుకుంటాయి. కదిలిస్తాయి. భావోద్వేగానికి గురి చేస్తాయి. ఆ కథలను చెప్పడానికి పెద్దగా వర్ణనలు అక్కర్లేదు. కేవలం అక్కడ కనిపించే పరిస్థితులు చాలూ.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య ఒక ఫొటో విపరీతంగా వైరల్ అవుతుండడం చాలామంది చూసే ఉంటారు. ఒక వృద్ధుడు ఒక పాత కిరాణ దుకాణంలో ఉండగా.. పైన కనిపించే రాతలు ఆకట్టుకునేలా.. అంతకు మించి ఆలోచింపజేసేలా ఉన్నాయి.
‘‘నమ్మండి.. నేను వ్యాపారంలో నష్టపోలే. బదలు ఇచ్చి.. మధ్యవర్తిగా ఉండి నష్టపోయాను. నా సాయం తీసుకున్నవారు పొలాలు కొన్నారు. నేను మాత్రం పొలం అమ్ముకున్నాను’’ అని ఆ చిన్న కిరాణంపైన రాసి ఉంది. ఇది ఏ కాలానికైనా వర్తించే కఠిన వాస్తవం ఇదని పలువురు కామెంట్లు పెడుతున్నారు.
కొంతమంది నెటిజన్స్.. ఈ దుకాణం తమకు తెలుసని, వరంగల్ పక్కన నెక్కొండ అనే చిన్న పల్లెటూరిలో ఈ తాత ఉన్నాడని, తన అనుభవమే ఆయన అలా రాతలుగా చూపించారని అంటున్నారు. ఇంతకీ ఈ తాత పేరు, ఆయన కథ ఏంటి?.. ఆయనకు జరిగిన నష్టం ఏంటో ఎవరికైనా తెలిస్తే చెప్పరు!
ఇదీ చదవండి: చావు అంచుల దాకా వెళ్తే.. రక్షించాడు
Comments
Please login to add a commentAdd a comment