Samantha Shared A Instagram Story About Life Lesson: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సోషల్ మీడియాలో తాను ఏం పోస్ట్ చేసిన చర్చకు తావిస్తోంది. సామ్ కూడా తన మనసులోని భావాలను, అనుభూతులను తన ఇన్‌స్టా గ్రామ్ ద్వారా పంచుకుంటుంది. అప్పుడప్పుడు మోటివేషనల్ కోట్స్, జీవితపు సత్యాలు పెడుతూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. ఇటీవల ఆమెను ఇన్‌స్టాలో ఫాలో అయ్యేవారి సంఖ్య 20 మిలియన్లకు (2 కోట్లు) చేరుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సామ్ తన ఇన్‌స్టా వేదికగా 'తాను నేర్చుకున్న పాఠం'పై స్టోరీ షేర్ చేసింది.
ఏం రంగంలోనైన నిత్య విద్యార్థులుగా ఉండాలంటారు. ఎంత నేర్చుకున్నా.. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందంటారు. సామ్ కూడా అదే అంటోంది. హీరోయిన్‌గానే కాదు వ్యక్తిగతంగా కూడా తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్తోంది. 'జీవితం నాకు నేర్పిన గొప్ప పాఠం ఏంటంటే.. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.' అని సమంత తన ఇన్‌స్టా ఖాతాలో స్టోరీ షేర్ చేసింది. అలాగే అమెరికన్ రైటర్ చెరిల్ స్ట‍్రాయ్డ్ రచించిన ఒక కొటేషన్‌ను కూడా యాడ్ చేసింది.
ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత ఇంటర్నేషనల్ చిత్రంలో నటించనుంది. అలాగే ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ 'యశ్ రాజ్ ఫిలిమ్స్'లో మూడు ప్రాజెక్ట్స్‌కు సామ్ ఓకే చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: తగ్గని సమంత దూకుడు.. అందులోనూ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment