Samantha New Record In Instagram: 20 Million Followers, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

Samantha: తగ్గని సమంత దూకుడు.. అందులోనూ రికార్డు

Dec 3 2021 10:17 AM | Updated on Dec 3 2021 10:52 AM

Actress Samantha Another Record In Instagram - Sakshi

Samantha Hits 20Million Followers On Instagram: టాలీవుడ్ స్టార్ నటి సమంత ఎక్కడా తగ్గట‍్లేదు. నాగచైతన్యతో విడాకుల తర్వాత మోస్ట్‌ పాపులర్ సెలబ్రిటీగా మారిన సామ్‌ వరుస ఆఫర్స్‌తో దూకుడు మీద ఉంది. ఇటీవలే లవ్‌ ఆఫ్‌ అరెంజ్‌మెంట్స్‌ అనే ఇంటర్నేషనల్ ఫిల్మ్‌కు ఓకే చెప్పిన జెస్సీ బాలీవుడ్‌లోను 3 సినిమాలకు డీల్‌ కుదుర్చుకుందని టాక్‌ వినిపిస్తోంది. అలాగే బన్నీ సరసన పుష్ప: ది రైజ్‌ సినిమాలో ఐటెం గర్ల్‌గా అదరగొట్టనుంది. దీనికి సంబంధించిన సామ్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లు నెట‍్టింట ఎంత వైరల్‌ అయ‍్యాయో చూశాం. 

ఇది చదవండి: 'తగ్గేదే లే' అంటున్న సమంత.. మరో 3 సినిమాలకు డీల్‌ ?

అంతేకాదు సోషల్‌ మీడియాలో సమంత తెగ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్‌ ఇస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తుంది సమంత. ఈ సోషల్‌ మీడియాలో కూడా తనదైన రీతిలో సత్తా చాటింది సామ్‌. తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో సమంత మరో మరో అరుదైన ఘనత సాధించింది. ఇన్‌స్టాలో ఆమెను ఫాలో చేస్తున్న వారి సంఖ్య 2 కోట్లు దాటింది. అంటే ఇప్పుడు ఇన్‌స్టాలో ఆమె ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు చేరింది. ఈ విషయాన్ని ఓ ఫొటో షేర్‌ చేస్తూ తన  ఆనందాన్ని పంచుకుంది. తనను అభిమానిస్తున్న వారందరికీ థ‍్యాంక్స్‌ అంటూ పోస్ట్‌ చేసింది సామ్‌. 

ఇదిలా ఉంటే సౌత్‌ ఇండస్ట్రీలో ఆమె కంటే ముందుగా రష్మిక మంధనా (2.4 కోట్లు), కాజల్‌ అగర్వాల్‌ (2.2 కోట్లు)తో ముందు వరుసలో ఉన్నారు. అయితే త‍్వరలో సామ్‌ వీరిని కూడా దాటేసి ముందుకెళ్తుందేమో చూడాలి.

ఇది చదవండి: సమంత సరికొత్త ఫొటోలు.. నెట్టింట్లో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement