Sam
-
'పూనమ్ మరణవార్త తెలిసినా ఫీలవ్వలేదు'.. భర్త షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ భామ, మోడల్ పూనమ్ పాండే ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. కొందరైతే ఇంకా ఆ షాక్ నుంచి తెరుకోలేదు కూడా. అయితే ఆమె చేసిన పనికి పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై ఆమె భర్త సామ్ బాంబే స్పందించారు. ఆమె మరణవార్త విన్నాక నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదని అన్నారు. ఇలాంటిది జరిగి ఉండదని నేను భావించానని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా తాము చట్టబద్ధంగానే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. తామిద్దరం ఇంకా విడాకులు తీసుకోలేదని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. సామ్ బాంబే మాట్లాడుతూ.. 'ఈ వార్త విన్నప్పుడు నా హృదయంలో ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. నాకైతే ఎలాంటి నష్టం అనిపించలేదు. నేను ఇది జరిగి ఉండదని భావించా. ఎందుకంటే ఎవరితోనైనా మీరు కనెక్ట్ అయి ఉంటే ప్రతి విషయంలో ఎక్కువగా ఫీలవుతారు. నేను ప్రతిరోజూ ఆమె గురించి ఆలోచిస్తా. అంతే కాదు ఆమె కోసం ప్రార్థిస్తాను కూడా. ఏదైనా తప్పు జరిగితే నాకు కచ్చితంగా తెలుస్తుంది. ఆమె ఇంకా బతికే ఉన్నందుకు సంతోషంగా ఉంది.'అని అన్నారు. అంతే కాకుండా ఆమె ధైర్యవంతురాలైన భారతీయ మహిళ అని సామ్ బాంబే ప్రశంసించారు. ఎవరైనా తమ కీర్తి, ప్రతిష్టను పూర్తిగా విస్మరించి ఒక సమస్యపై అవగాహన పెంచుకుంటే ప్రజలు గౌరవించాలని ఆయన సూచించారు. కాగా.. పూనమ్, సామ్ బాంబే 2020లో వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహబంధం ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయారు. హనీమూన్ తర్వాత భర్త భౌతికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సామ్ బాంబేను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ జంట విడివిడిగానే ఉంటున్నారు. -
అదిరే ఫోజులతో ఆహా అనిపిస్తున్న గ్లామర్ సమంత (ఫోటోలు)
-
Samantha: చీరకట్టులో మెరిసిపోతున్న సమంత ఫోటోలు
-
‘యశోద’ మూవీ పబ్లిక్ టాక్
-
బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్
సంగీతానికి హద్దులు లేవు. భాషలకు అతీతం. ఇంతకు ముందు బప్పిలహరి లాంటి పలువురు సంగీత దర్శకులు దక్షిణాదిలో పలు హిట్ చిత్రాలకు పని చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల దక్షిణాది సంగీత దర్శకులకు బాలీవుడ్లో క్రేజ్ పెరుగుతుందనే చెప్పవచ్చు. తాజాగా కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ పేరు బాలీవుడ్లో మారుమ్రోగుతోంది. ఒర్ ఇరవు చిత్రం ద్వారా కోలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా పరిచయమైన ఈయన విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన విక్రమ్ వేదా చిత్రంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంలోని థీమ్ సాంగ్ సంగీత ప్రియులకు విపరీతంగా ఆకట్టుకుంది. అలా మెలోడి పాటలు రూపొందించడంలోనూ దిట్ట అని నిరూపించుకున్నారు. ఖైదీ, అడంగామరు, సాని కాగితం వంటి పలు చిత్రాలకు సంగీతాన్ని అందించి పేరు తెచ్చుకున్నారు. కాగా విక్రమ్ వేదా చిత్రం తాజాగా హిందీలో రీమేక్ అవుతోంది. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ నే సంగీతాన్ని అందిస్తూ బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. త్వరలో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలవుతున్న హిందీ వెర్షన్ విక్రమ్ వేదా చిత్ర ట్రైలర్ ఇటీవల మొదలైంది. ఈ ట్రైలర్‌కు, చిత్ర పాటలకు బాలీవుడ్ వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళం, తెలుగు తదితర భాషల్లో చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నా ఇకపై బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకోబోతున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాల అవకాశాలు వస్తున్నట్లు శ్యామ్ తెలిపారు. -
తగ్గని సమంత దూకుడు.. అందులోనూ రికార్డు
Samantha Hits 20Million Followers On Instagram: టాలీవుడ్ స్టార్ నటి సమంత ఎక్కడా తగ్గట్లేదు. నాగచైతన్యతో విడాకుల తర్వాత మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా మారిన సామ్ వరుస ఆఫర్స్‌తో దూకుడు మీద ఉంది. ఇటీవలే లవ్ ఆఫ్ అరెంజ్మెంట్స్ అనే ఇంటర్నేషనల్ ఫిల్మ్‌కు ఓకే చెప్పిన జెస్సీ బాలీవుడ్‌లోను 3 సినిమాలకు డీల్ కుదుర్చుకుందని టాక్ వినిపిస్తోంది. అలాగే బన్నీ సరసన పుష్ప: ది రైజ్ సినిమాలో ఐటెం గర్ల్‌గా అదరగొట్టనుంది. దీనికి సంబంధించిన సామ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట ఎంత వైరల్ అయ్యాయో చూశాం. ఇది చదవండి: 'తగ్గేదే లే' అంటున్న సమంత.. మరో 3 సినిమాలకు డీల్ ? అంతేకాదు సోషల్ మీడియాలో సమంత తెగ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తుంది సమంత. ఈ సోషల్ మీడియాలో కూడా తనదైన రీతిలో సత్తా చాటింది సామ్. తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో సమంత మరో మరో అరుదైన ఘనత సాధించింది. ఇన్‌స్టాలో ఆమెను ఫాలో చేస్తున్న వారి సంఖ్య 2 కోట్లు దాటింది. అంటే ఇప్పుడు ఇన్‌స్టాలో ఆమె ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు చేరింది. ఈ విషయాన్ని ఓ ఫొటో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. తనను అభిమానిస్తున్న వారందరికీ థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేసింది సామ్. ఇదిలా ఉంటే సౌత్ ఇండస్ట్రీలో ఆమె కంటే ముందుగా రష్మిక మంధనా (2.4 కోట్లు), కాజల్ అగర్వాల్ (2.2 కోట్లు)తో ముందు వరుసలో ఉన్నారు. అయితే త్వరలో సామ్ వీరిని కూడా దాటేసి ముందుకెళ్తుందేమో చూడాలి. ఇది చదవండి: సమంత సరికొత్త ఫొటోలు.. నెట్టింట్లో వైరల్ -
సామ్ పెంపుడు కుక్కపై పోస్ట్.. ఒక్క రోజే వెళ్తాను..
హీరో నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత క్లోజ్ ఫ్రెండ్స్‌తో ప్రయాణాలు చేస్తూ విశ్రాంతిని ఆస్వాదిస్తూ బిజీగా ఉన్నారు. మళ్లీ తాను చేయబోయే ప్రాజెక్టులలో పనిచేయడం ప్రారంభించడానికి ముందే ఈ టూర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఇక సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చెన్నైకి వెళ్లినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి సామ్ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫోటోనే షేర్ చేసింది. సామ్‌కు తన పెట్ డాగ్స్ హాష్, సాషాలంటే ఎంతో ప్రేమ అన్నది తెలిసిందే. పెట్ గార్డియన్‌గా సామ్ ఎప్పుడు తన పెట్స్‌కు సంబంధించిన అప్డేట్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా 'నేను ఒక్క రోజు మాత్రమే వెళ్ళాను.. ఒక్క రోజే.. పాపం నా మొదటి బిడ్డ' అంటూ ఏడుస్తున్న ఎమోజీస్ పెట్టింది. ఇందులో సాషా..హాష్పై ఎక్కి దాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం సమంత తన రాబోయే సినిమాల ప్రిపరేషన్లో బిజీగా ఉంది. సామ్ చేతిలో రెండు ద్విభాషా చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి కొత్త దర్శకుడు శాంతరూబన్ జ్ఞానశేఖరన్ సినిమా కాగా మరోకటి మైథాలిజికల్ డ్రామా అయిన 'శాకుంతలం' పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదల తేదిని ఇంకా ప్రకటించలేదు. -
ప్రపంచంలోనే తొలి వర్చువల్ నేత
మెల్బోర్న్: ప్రపంచంలోనే కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేసే తొలి వర్చువల్ రాజకీయ నేత ‘శామ్’ను న్యూజిలాండ్‌కు చెందిన ఎంట్రప్రెన్యూర్ నిక్ గెర్రిట్‌సెన్(49) రూపొందించారు. ఫేస్బుక్ మెసెంజర్‌తో పాటు తన హోమ్‌పేజ్‌లో ఉన్న సర్వేల సాయంతో విషయాల్ని నేర్చుకునే శామ్.. ప్రపంచవ్యాప్తంగా విద్య, వలసలు, ఇళ్లు సహా పలు అంశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తుంది. శామ్ ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉందనీ దాని రూపకర్త నిక్ తెలిపారు. 2020లో న్యూజిలాండ్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓ అభ్యర్థిగా పోటీపడేలా శామ్‌ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. వాతావరణ మార్పు, సమానత్వం తదితర విషయాల్లో ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని నిక్ అభిప్రాయపడ్డారు. శామ్ చట్టప్రకారం నిబంధనలకు లోబడి పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కృత్రిమ మేధ ఉన్న రోబోలు ఎన్నికల్లో పోటీచేయడంపై నిషేధం ఉంది. -
శ్యామ్‌కు పతకం ఖాయం
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. బ్యాంకాక్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శ్యామ్‌తోపాటు రోహిత్ టోకస్ (64 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ మనోజ్ కుమార్ (69 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్ బౌట్స్‌లో సమక్ సెహాన్ (థాయ్‌లాండ్)పై శ్యామ్; కుతోవ్ కువాన్ (కజకిస్తాన్)పై రోహిత్ గెలుపొందారు. గియాసోవ్ షాక్రమ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో మనోజ్ ఓటమి పాలయ్యాడు. -
గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో కూలి హత్య
నిజామాబాద్ జిల్లా సిర్పూర్ గ్రామంలో వ్యవసాయకూలిగా పనిచేస్తున్న శామ్(45) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు సోమవారం మధ్యాహ్నం హతమార్చారు. భార్యా పిల్లలు పుట్టింటికి వెళ్లి ఉండగా శామ్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి జొరబడి శ్యామ్‌ను కత్తులతో నరికి చంపి పారిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
కెరీర్లోనే.. అతి క్లిష్టమైన పాత్ర
అందం... అభినయం... మంచితనం... ఈ మూడూ ఒకే వ్యక్తిలో ఉండడం అరుదు. అలాంటి అరుదైన నటి - సమంత. కావాల్సిన వాళ్ళంతా ‘శామ్’ అని ముద్దుగా పిలుచుకొనే ఆమె ఆ మధ్య ‘మనం’ చిత్రంతో, ఇటీవల ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు తన కెరీర్లోనే అత్యంత క్లిష్టమైన పాత్ర పోషిస్తున్నారు. ఆ మాట ఆమే స్వయంగా పేర్కొన్నారు. తమిళనాట హీరో విక్రమ్ సరసన నటిస్తున్న ‘పత్తు ఎణ్రదుకుళ్ళ’ (‘పది లెక్కపెట్టే లోపల’ అని అర్థం) చిత్రంలో సోగకళ్ళ శామ్ కథానాయిక. ఇటీవలే విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా తొలి ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఆంతరంగిక వర్గాల కథనం ప్రకారం ఈ చిత్రంలో సమంత ఒకటి కాదు... ఏకంగా రెండు పాత్రలు పోషిస్తున్నారు. సినిమాకు అత్యంత కీలకమైన ఈ ద్విపాత్రాభినయానికి తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఆ వివరాలేమీ సమంత స్వయంగా వెల్లడించకపోయినప్పటికీ, ‘ఇప్పటి దాకా నాకు వచ్చిన అత్యంత క్లిష్టమైన పాత్రల్లో ఇది ఒకటి’ అని స్వయంగా ప్రకటించారు. క్లిష్టమైన పరిస్థితులు, సవాళ్ళు ఎదురైనప్పుడే కదా... సమర్థుల ప్రతిభ మరింతగా బయటకొచ్చేది. ఆల్ ది బెస్ట్ శామ్! -
కిక్కిరిసిన ‘పరప్పన’
అమ్మ అభిమానులను అడ్డుకున్న పోలీసులు వాగ్వాదానికి దిగిన అన్నాడీఎంకే కార్యకర్తలు బెంగళూరు : జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కలుసుకునేందుకు వచ్చిన అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పరప్పన అగ్రహార కిక్కిరిసింది. సోమవారం ఉదయం చెన్నైతో పాటు కృష్ణగిరి, ధర్మపురి తదితర జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వందలాది మంది తరలి వచ్చారు. జైలులో అమ్మను కలవడానికి అనుమతించాలంటూ పోలీసులను అభ్యర్థించారు. అయితే ఇందుకు జైలు సిబ్బంది అంగీకరించకపోవడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. జైలు సిబ్బందితో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. జైలు ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనను విరమింపచేశారు. సొంద సోదరికి చిక్కని దర్శనం బెంగళూరు నివాసముంటున్న జయలలిత సోదరి శైలజ సోమవారం ఉదయం తన కుమార్తెను వెంటబెట్టుకుని పరప్పన అగ్రహార జైలును చేరుకున్నారు. జైలు సిబ్బందికి తనను తాను పరిచయం చేసుకుని తన సోదరితో భేటీ అయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఇదే విషయాన్ని జయలలితకు సిబ్బంది వివరించారు. అయితే తాను ఎవరిని కలవను అని జయలలిత చెప్పడంతో శైలజను లోపలికి అనుమతించేందుకు జైలుసిబ్బంది నిరాకరించారు. చాలా సేపు అక్కడే వేచి చూసిన శైలజకు చివరకు నిరాశే మిగిలింది. బెంగళూరు నుంచి తరలి వెళ్లిన తమిళ సోదరులు బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాలలో తమిళ సోదరులు నివాసం ఉంటున్నారు. వీరు అధిక సంఖ్యలో సోమవారం ఉదయం పరప్పన అగ్రహార జైలు దగ్గరకు చేరుకున్నారు. జయలలితను కలవాలని నినాదాలు చేశారు. అమ్మా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో పోలీసులు సమన్వయంతో వ్యవహరించి వారికి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించారు. ముందు జాగ్రత చర్యగా కారాగారం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను కొనసాగిస్తున్నారు. -
కొమ్ములు తిరిగిన కొట్లాట
రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి... కత్తులతో మనుషుల్ని మనుషులు చంపుకునే వికృత క్రీడ ఎప్పుడో కనుమరుగైంది. కానీ అనాదిగా స్పెయిన్‌లో బుల్‌ఫైట్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. చావే భయపడేలా అత్యంత క్రూరంగా చంపుతుంటే.. అది చూసి చప్పట్లు చరిచి, ఈలలు వేసే సంస్కృతి వందల ఏళ్లుగా వదలడం లేదు. క్రీడగా చెప్పుకునే బుల్ఫైట్పై ఈ వారం మైదానం ప్రత్యేకం. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు ఐదారు వందల కిలోల బరువున్న ఎద్దును ఎదుర్కోవడం ఒక మనిషికి సాధ్యం కాదు.. కానీ అదే ఎద్దును శారీరకంగా, మానసికంగా వేధించి.. రెండు రోజులు కడుపు మాడ్చి.. వీపుపై కత్తుల్లాంటి వాటితో పోట్లు పొడిచి.. రక్తం కారేలా చేసి.. ఇరవై నిమిషాల్లో చంపే వికృత క్రీడ బుల్ ఫైట్.. స్పెయిన్, మెక్సికో లాంటి కొన్ని దేశాల్లో ఈ బ్లడ్ ఫైట్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన సాగుతోంది. వందల ఏళ్లుగా... ఎద్దులతో కొట్లాట అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది స్పెయిన్ బుల్‌ఫైట్. అక్కడ బుల్ ఫైటింగ్ కొన్ని వందల ఏళ్లుగా సాగుతోంది. పురాతన రోమ్ కాలంలో బుల్ ఫైటింగ్‌కు ప్రజాదరణ చాలా ఎక్కువ. ఏళ్లుగా ఇది స్పెయిన్ సంస్కృతిలో భాగమైంది. అయితే స్పెయిన్‌లో ప్రస్తుత తరహాలో జరుగుతున్న బుల్ ఫైటింగ్ 300 ఏళ్లుగా సాగుతోంది. పోటీలకు ప్రత్యేక ఎద్దులు... స్పెయిన్‌లో బుల్ ఫైటింగ్‌కు ఉపయోగించే ఎద్దులు ప్రత్యేక బ్రీడ్‌కు చెందినవి. పశువుల్లో ఉపజాతి అయిన బాస్ టారస్ ఇబెరికస్ ఎద్దును బుల్ఫైటింగ్లో ఉపయోగిస్తారు. వీటిని టోరో బ్రావో, ఇబెరియన్ బుల్ అని పిలుస్తారు. వీటిని దక్షిణ స్పెయిన్‌తో పాటు పోర్చుగల్, లాటిన్ అమెరికా దేశాల్లో పెంచుతారు. ఇవి ఎక్కువగా నల్లగా, ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వీటిలో అసాధారణ స్థాయిలో జన్యువులు, డీఎన్ఏ ఉండటం వల్ల దూకుడుతనం, శక్తి, బలం, సత్తువ అధికంగా ఉంటుంది. వీటినే పోటీల్లో బరిలోకి దించుతారు. మూడు నుంచి నాలుగేళ్ల వయసున్న వీటి బరువు 500 నుంచి 700 కేజీల మధ్య ఉంటుంది. వీళ్లే బుల్ ఫైటర్లు... బుల్ ఫైటింగ్లో ప్రధాన పాత్ర పోషించేది ప్రధాన మెటడారే. ఇతనికి స్టార్ హోదా ఉంటుంది. స్టార్ మెటడార్ కోసమే కొందరు ప్రత్యేకంగా బుల్ ఫైటింగ్ చూస్తారు. బుల్ ఫైటింగ్లో మెటడార్కు మరో ఇద్దరు సహాయకులుగా వ్యవహరిస్తారు. ముగ్గురు బాండెరిల్లేరోస్, ఇద్దరు పికెడార్లు తమ వంతు సాయం చేస్తారు. ఇక ఎద్దును చంపే క్రమంలో వీరందరి పాత్ర ఉన్నా.. చివరికి హీరో మాత్రం ప్రధాన మెటడారే. అప్పుడప్పుడు మనుషుల ప్రాణాలూ... బుల్ ఫైటింగ్ ఉద్దేశం ఎద్దులను చంపడం. అయితే ఈ పోటీల్లో అప్పుడప్పుడు బుల్‌ఫైటర్లు చనిపోతారు. కుమ్మేయాలన్న కసితో ఉన్న ఎద్దును రెచ్చగొట్టే క్రమంలో కానీ.. లేదంటే వాటి వీపులో పికాను లేదంటే బ్యాండెరిల్లాస్ను పొడిచే క్రమంలో బుల్ఫైటర్లను ఎద్దులు కుమ్మేస్తాయి. ఎద్దుల కుమ్ముడికి బుల్‌ఫైటర్లు చనిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 1700వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 500లకు పైగా బుల్ ఫైటర్లు చనిపోయినట్లు విశ్లేషకుల అంచనా. ఫైటర్లు.. శిక్షణ.. బుల్ ఫైటింగ్లో ఎద్దును చంపడమంటే మాటలు కాదు.. కుమ్మేయాలన్న కసితో ఉన్న ఎద్దును రింగ్‌లో చంపాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. బుల్ ఫైటర్ల కోసం బుల్ ఫైటింగ్‌ను ప్రోత్సహించే దేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే స్కూళ్లు కూడా ఉంటాయి. చాలా మంది శిక్షణ పొందేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఐదేళ్ల వయసు నుంచి బుల్ఫైటింగ్లో ట్రైనింగ్ ఇస్తారు. ఇక స్పెయిన్‌లో బుల్ఫైటర్ రింగ్‌లోకి అడుగుపెట్టాలంటే ముందుగా ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో పాసవ్వాల్సి ఉంటుంది. జంతు ప్రేమికుల సమరం... బుల్‌ఫైట్ చూసే వారికి ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రతీయేటా ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీల కారణంగా 2.5 లక్షల ఎద్దులు చనిపోతున్నాయి. అయితే వీటిని అత్యంత పాశవికంగా చంపడాన్ని నిరసిస్తూ కొన్నేళ్లుగా జంతు ప్రేమికులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం బుల్ ఫైటింగ్ స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్, మెక్సికో, కొలంబియా, వెనిజులా, పెరు, ఈక్వెడార్‌లో జరుగుతున్నాయి. అయితే జంతు ప్రేమికుల పోరాటం కారణంగా అర్జెంటీనా, కెనడా, క్యూబా, డెన్మార్క్, ఇటలీ, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో బుల్ ఫైటింగ్‌పై నిషేధం విధించారు. క్రీడనా? కళనా? వందల ఏళ్లుగా జరుగుతున్న బుల్ ఫైటింగ్ క్రీడ అని కొందరు వాదిస్తుంటే.. కాదు కాదు.. ఇదో కళ అని మరికొందరు వాదిస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో జరుగుతుండటంతో బుల్ఫైటింగ్పై పెద్దగా దృష్టి సారించడం లేదు. అయితే క్రీడా విశ్లేషకులు మాత్రం ఎద్దులను చంపడమూ ఓ క్రీడేనా? అని సన్నాయి నొక్కులు నొక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. బుల్‌ఫైట్ సాగేదిలా... కేవలం 20 నిమిషాల్లో ముగిసే బుల్‌ఫైట్ మూడు దశల్లో సాగుతుంది. ఎద్దును భయపెట్టేలా శబ్దం చేయడంతో పోటీ ప్రారంభమవుతుంది. తొలి దశలో పికెడార్లు గుర్రంపై స్వారీ చేస్తూ ఎద్దును కవ్విస్తారు. అలిసిపోయేలా చేయడమే వారి పని. అదే క్రమంలో వాళ్లు తమ దగ్గరున్న 6 నుంచి 8 అంగళాల పొడవు, 2 అంగుళాల మందం ఉన్న ‘పికా’ అనే ఆయుధంతో వీపు భాగంలో పొడిచి మెడ నరాలు తెగేలా చేస్తారు. దీంతో ఎద్దు శరీరంలోంచి రక్తం కారడం మొదలవుతుంది. ఎద్దు మరణానికి ఇక్కడే కౌంట్‌డౌన్ మొదలవుతుంది. రెండో దశలో సహాయ మెటడార్లు(వీరిని బాండెరిల్లేరోస్ అని కూడా పిలుస్తారు) బ్యాండెరిల్లాస్(ఈటె లాంటి పదునైన కత్తి)తో రంగంలోకి దిగుతారు. ఐదు, ఆరు బ్యాండెరిల్లాస్లను ఎద్దు వీపుభాగంలో లోనికి గుచ్చుతారు. దీంతో అది అలిసిపోతుంది. మూడోది, అంతిమ దశలో ప్రధాన మెటడార్ రింగ్‌లోకి వచ్చి ఎద్దు ప్రాణాలను తీస్తాడు. ఎరుపు బట్టతో ఎద్దును ఆటూ ఇటూ ఆడిస్తూ అది పూర్తిగా కింద పడిపోయేలా చేస్తాడు. ఇదంతా ముగియడానికి 6 నిమిషాలు పడుతుంది. ఒకవేళ ప్రధాన మెటడార్ ప్రాణాలు తీయడంలో ఇబ్బంది పడితే అతనికి సహాయకుడిగా మరొకరు రింగ్‌లోకి వస్తారు. చివరికది రక్తం కక్కుకుని ప్రాణాలు విడుస్తుంది. పలు దేశాల్లో... బుల్ ఫైటింగ్లో ఎద్దును అత్యంత క్రూరంగా చంపడాన్ని చూశాం... అయితే కొన్ని దేశాల్లో బుల్ ఫైట్‌ను అటు ఎద్దుకు, ఇటు బుల్ ఫైటర్‌కు హాని జరగకుండా పోటీలు నిర్వహిస్తారు. మరికొన్ని దేశాల్లో రెండు ఎద్దుల మధ్య పోటీలను కూడా నిర్వహిస్తారు. పెర్షియన్ గల్ఫ్(ఒమన్, యూఏఈ)లో రెండు ఎద్దుల మధ్య బుల్ ఫైట్ పోటీలు జరుగుతాయి. అమెరికాలో బుల్ ఫైటర్ (రొడియో క్లౌన్) పేరుతో పోటీలు జరుపుతారు. టర్కీ, టాంజానియా, జపాన్లలో ఎద్దుల మధ్య పోటీలు నిర్వహిస్తారు. జల్లికట్టుపై సుప్రీం నిషేధం... భారత్‌లో అత్యంత వివాదాస్పదమైన క్రీడ ‘జల్లికట్టు’.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ ఏడాది మేలో నిషేధం విధించింది. ప్రతీయేటా తమిళనాడులో జరిగే ఈ జల్లికట్టు పోటీలు జరిగిన ప్రతీసారి వివాదాస్పదమే. స్పెయిన్ బుల్ఫైటింగ్లా ఎద్దును ఈ పోటీల్లో చంపరు. అయితే ఇందులో పాల్గొనే వాళ్లు ఎద్దును లొంగదీసుకుంటారు. ఈ ప్రయత్నంలో చాలామంది చనిపోయారు. గత రెండు దశాబ్దాల్లో రెండు వందల మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆ రెండు రోజులూ... బుల్ ఫైట్‌లో రింగ్‌లోకి వచ్చిన ఎద్దు రంకెలేస్తూ కనిపించిన వారిని కనిపించినట్లుగా కొమ్ములతో కుమ్మేయాలన్న కసితో అటూ, ఇటూ పరుగెత్తుతుంది. అయితే సాధారణంగా ఎద్దులు ఎవరికీ హాని చేయవు. కానీ రింగ్‌లోకి వచ్చిన తర్వాత అది పిచ్చెక్కినట్లుగా వ్యవహరిస్తుంది. అలా చేయడానికి కారణం ఉంది. బుల్‌ఫైట్‌కు సిద్ధం చేయడంలో భాగంగా రెండు రోజుల పాటు దానికి నరకం చూపిస్తారు. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తారు. నీళ్లలో తడిపిన న్యూస్ పేపర్లను దున్నపోతు రెండు చెవుల్లోకి దూరుస్తారు. దీంతో వాటికి ఏమీ వినిపించదు. దూదిని ముక్కు రంధ్రాల్లోకి దూర్చడం ద్వారా శ్వాసక్రియకు ఆటంకం కలిగేలా చేస్తారు. ఫలితంగా అది శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. వాజిలిన్‌ను రెండు కళ్లకు రుద్దుతారు. దీంతో వాటికి చూపు మందగిస్తుంది. కాళ్లు కాలిపోతున్నాయనిపించేలా గాఢత ఎక్కువగా ఉన్న ద్రావణాన్ని పూస్తారు. దీనివల్ల ఎద్దు పట్టుతప్పిపోతుంది. ఒకరకంగా అది కింద పడిపోయేలా చేస్తుంది. జననాంగాల్లోకి సూదిని గుచ్చుతారు. బలమైన లాక్సెటీవ్స్ అనే డ్రగ్స్‌ను ఆహారంతో కలిపి పెడతారు. అది తిన్న ఎద్దు విరేచనాలకు లోనవుతుంది. ఫలితంగా నీరసంగా తయారవుతుంది. ఎద్దు బలహీనంగా తయారయ్యేలా (కొన్నిసార్లు బలంగా తయారయ్యేలా) డ్రగ్స్ తినిపిస్తారు. రింగ్‌లోకి పంపే కంటే రెండు రోజుల ముందు ఎద్దును చీకటిగా ఉన్న బాక్స్‌లో ఉంచుతారు. దీంతో అది దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతుంది. రెండు రోజుల తర్వాత ఒక్కసారిగా రింగ్‌లోకి వదులుతారు. బాక్స్‌లోంచి బయటకు వచ్చిన ఎద్దు తనకు ఎట్టకేలకు విముక్తి కలిగిందన్న భావనతో రింగులో కలియ తిరుగుతుంది. అదే సమయంలో తనను చిత్రహింసలకు గురి చేసిన వారిని కొమ్ములతో చంపేయాలన్న కసి దానిలో కనిపిస్తుంది. అందుకే రింగ్‌లో కనిపించిన వారిని కనిపించినట్లుగా కుమ్మేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుంది. -
బ్యాటరీ-ఫ్రీ పరికరాలు.. రేడియో తరంగాలతో పనిచేస్తాయి..
టెక్నాలజీ మాయ వల్ల ఇంట్లోని అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలనూ ఇంటర్నెట్కు అనుసంధానం చేసుకునేందుకు ఇప్పుడు వీలు అవుతోంది. కానీ వీటన్నింటినీ ఇంటర్నెట్కు అనుసంధానం చేసేందుకు అమర్చే పరికరాలకూ బ్యాటరీలను ఉపయోగించాల్సి రావడం ప్రస్తుతం ఓ పెద్ద ప్రతిబంధకం. అందుకే అసలు బ్యాటరీ అవసరమే లేకుండా.. రేడియో తరంగాలనే విద్యుత్‌గా వాడుకుంటూ.. వాటి ద్వారానే వై-ఫై పరికరానికి, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లకు అనుసంధానమై పనిచేసే వినూత్న ‘బ్యాటరీ-ఫ్రీ డివైస్’లను భారత సంతతి ఇంజనీర్ శ్యామ్ గొల్లకోట నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన శ్యామ్ ఆవిష్కరించిన ‘వై-ఫై బ్యాక్‌స్కాటర్’ అనే ఈ టెక్నాలజీ ప్రస్తుతం వై-ఫై పరికరాలకు రెండు మీటర్ల దూరంలోపు మాత్రమే, సెకనుకు ఒక కిలోబిట్ వేగంతో పనిచేస్తుంది. దీనిని 20 మీటర్లకు పెంచేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి టెక్నాలజీ రావడం ఇదే తొలిసారని చెబుతున్నారు. వీరి పరిశోధన వివరాలను షికాగోలో ఈ నెలలోనే జరిగే ‘అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీస్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ కమ్యూనికేషన్స్’ సదస్సులో సమర్పించనున్నారు. -
కౌలుకు రాంరాం!
వర్షాభావం నేపథ్యంలో ముందుకురాని కౌలు రైతులు రేటు తగ్గించి, వడ్డీలేని రుణం ఇస్తామన్నా ససేమిరా సాగు ఆలస్యం నేపథ్యంలో తపానులతో నష్టమని భయం ఆందోళన చెందుతున్న భూయజమానులు గుడివాడ : జిల్లా వ్యాప్తంగా వరిసాగయ్యే భూములు 6.34 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఈ భూములను యజమానులతోపాటు, కౌలు రైతులు సాగుచేస్తుంటారు. జిల్లాలో 3.40 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఒకప్పుడు పొలాలను కౌలు తీసుకోవడానికి గుడివాడ, చల్లపల్లి, ఉయ్యూరు, కంకిపాడు తదితర డెల్టా ప్రాంతాల్లో కౌలు రైతులు పోటీపడేవారు. కొన్ని చోట్ల కౌలు మొత్తం ముందుగానే చెల్లించే వారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో వ్యవసాయం చేసేందుకు కౌలు రైతులు ముందుకు రావడంలేదు. గుడివాడ నియోజకవర్గంలోనే దాదాపు 35వేల మంది కౌలు రైతులు ఉన్నారని అధికారుల అంచనా. కౌలు రైతులకు ప్రభుత్వం రుణార్హత కార్డులు ఇచ్చినా బ్యాంకర్లు మాత్రం అప్పు ఇవ్వడంలేదు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, కాలువలకు నీళ్లు వస్తాయో రావో తేలియని పరిస్థితి కౌలు రైతులను ప్రశ్నార్థకంగా మార్చింది. దీంతో కౌలుకు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. గుడివాడ ప్రాంతంలో ఎకరానికి గతేడాది 17 నుంచి 20 బస్తాలు కౌలు ఉండగా ఈ ఏడాది ఎకరానికి రెండు బస్తాలు కౌలు తగ్గిస్తామని యజమానులు చెబుతున్నారు. దీనికి తోడు ఎటువంటి వడ్డీ లేకుండా ఎకరానికి రూ.5వేల చొప్పున రుణం ఇస్తామని ఆశపెడుతున్నా కౌలుదారులు ముందుకు రావటం లేదు. ఏడాది మొదట్లో చేసుకున్న ఒప్పందాలను సైతం రైతులు ఇప్పుడు రద్దుచేసుకుంటున్నారు. ఒకొక్కరిది ఒక్కో కథ గుడివాడకు చెందిన శ్యామ్ పాలవ్యాపారం చేస్తుంటాడు. వ్యవసాయంపై ప్రేమ, లాభాలు వస్తాయన్న ఆశతో ఏటా 20 ఎకరాలు కౌలు చేస్తున్నాడు. ఎకరానికి రూ.20 వేల చొప్పున పెట్టుబడులకు వెచ్చిస్తున్నాడు. రెండేళ్లుగా వరుస తుపానుల కారణంగా పెట్టుబడులు సం గతి దేవుడెరుగు అప్పులు తెచ్చి కౌలు చెల్లించాల్సి వచ్చింది. ఈ ఏడాది ఎకరం కూడా కౌలు చేయకూడదని ఒట్టుపెట్టుకున్నాడు. మోహన్రావుదీ అదే పరిస్థితి తన కుటుంబం మొత్తం ఒకరి వద్ద కూలికి వెళ్లే కంటే తన పొలంలోనే పనిచేసుకుంటే హుందాగా ఉంటుందని ఏళ్లతరబడి కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. తుపానుల కారణంగా మూడేళ్లుగా ఒక్క గింజ మిగల్లేదు. వ్యవసాయంపై ప్రేమ చావక ఈ ఏడాది రెండు ఎకరాలే కౌలు చేయాలని నిర్ణయించాడు. గుడివాడ రూరల్ మండలానికి చెందిన నరసింహారావుదీ అదే పరిస్థితి. గతేడాది కంటే ఈఏడాది ఎకరానికి రెండు బస్తాల కౌలు తగ్గించి ఇవ్వాలని భూయజమాని చెప్పినా తనవల్ల కాదని కాడిపడేశాడు. రెండు ఎకరాలే ఒప్పుకున్నా ఏటా ఏడెకరాలు కౌలు చేస్తున్నా. ఎప్పటికప్పుడు నష్టాలే మిగులుతున్నాయి. ఈ ఏడాది కౌలు చేయకూడదని నిర్ణయించుకున్నా. మమకారం చావక రెండు బస్తాలు కౌలు తగ్గిస్తానని రైతు చెబితే ఈ ఏడాది కేవలం రెండు ఎకరాలు మాత్రమే కౌలు చేస్తున్నా. ఈ ఏడాదీ వర్షాలు లేకపోవడంతో పంట దిగుబడిపై అనుమానంతో ఎవరూ ముందుకు రావడం లేదు. - గూడపాటి మోహన్, గుడివాడ ఈ ఏడాది సాగు చేయడం లేదు ఏటా కౌలు చేయడం వల్ల నష్టాలు బారిన పడుతూనే ఉన్నాం. కౌలు చెల్లించలేక అప్పులపాలు అవుతున్నాం. ప్రభుత్వ రుణామాఫీ ఇంకా అమలు చేయలేదు. దీంతో ఈ బాధలు ఇక పడలేమని ఈ ఏడది కౌలు చేయడం మానేశాను. ప్రభుత్వం ఇప్పటికైన కళ్ళు తెరవకపోతే కౌలు వ్యవస్థ పూర్తిగా కనుమరుగవుతుంది. - నిమ్మగడ్డ నాగశాస్త్రి, బిళ్లపాడు, గుడివాడ రూరల్ మండలం. సాగు నీరు ఆలస్యమైంది సాగు నీటి విడు దల ఆలస్యంగా వల్ల సార్వా సాగు చేయడం కష్టంగా మారింది. కాల యాపన కావడం వల్ల దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా ప్రభుత్వం సాగునీటిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ సమయంలో వ్యవసాయం చేసినా నష్టాలు తప్ప మిగిలేది ఏమీ లేదు. అందువల్ల ఏడాది వ్యవసాయం మానేశా. - కొండపల్లి రేణుకారెడ్డి, జనార్దనపురం, నందివాడ మండలం -
పతకాలు సరే... ‘పసితనం’ సంగతేంటి?
అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో చైనాను మించిన దేశం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆ దేశం, ఇప్పుడు ఒక్కో అగ్ర రాజ్యాన్ని వెనక్కి నెట్టేస్తోంది. అన్నింటా తానే ముందుండాలని లక్ష్యం పెట్టుకున్న చైనా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయాలనే దిశగా సాగుతోంది. ఒలింపిక్స్‌లో కాకలు తీరిన దేశాలకు చెక్ పెట్టి పతకాల పట్టికలో స్థిరంగా ఆధిపత్యాన్ని చాటాలన్నదే దానికి ఏకైక లక్ష్యం. దాన్ని చేరుకునేందుకు ఎంతో శ్రమిస్తోంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ దిశగా దూసుకెళుతోంది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి పతకాలు కొల్లగొట్టే దేశాలను వెనక్కి నెట్టేస్తోంది. అన్ని రంగాల్లోలాగే క్రీడల్లోనూ ఎప్పటికీ సూపర్ పవర్ అని నిరూపించుకోవాలనుకుంటోంది. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు ప్రపంచ క్రీడల్లో చైనా తిరుగులేని ఆధిపత్యం సాధనకు చేరువైంది. ఒలింపిక్స్‌లో అమెరికాను సవాల్ చేస్తోంది. దీనికోసం చిన్నప్పటి నుంచే పిల్లలకు కఠినమైన శిక్షణను ఇస్తున్నారు. అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపే. రెండో వైపు చూస్తే... ఐదారేళ్ల పిల్లాడిని శారీరకంగా హింసిస్తున్నారు. అసలు ఆ ఆట ఎందుకు ఆడాలో తెలియని పిల్లల్ని కూడా బలవంతంగా క్రీడల్లోకి దించుతున్నారు. అసలు చైనాలో ఏం జరుగుతోంది..? 50వ దశకంలోనే... లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులువు కాదు. అందుకు తగ్గ సాధన ఉండాలి. అప్పుడే అంతర్జాతీయంగా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ విషయాన్ని చైనా 50వ దశకంలోనే గ్రహించింది. ఓ వైపు దేశం ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా పెద్ద లక్ష్యాన్ని ఎంచుకుంది. అనుకున్నదే తడవుగా దేశంలో క్రీడా పాఠశాలలను స్థాపించింది. ఆ క్రీడా బీజాలు ఇప్పుడు ఇంతింతై అన్నట్లు అద్భుతమైన క్రీడాకారులను దేశానికి అందిస్తున్నాయి. చైనాలో మూడు వేలకు పైగా స్పోర్ట్స్ స్కూళ్లు ఉన్నాయి. ప్రతీ జిల్లాలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉందంటే టాలెంట్‌ను చైనా ఏ రకంగా ఒడిసిపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్, వాలీబాల్, అథ్లెటిక్స్, ఫెన్సింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ లాంటి క్రీడాంశాల్లో పిల్లలకు శిక్షణ ఇస్తారు. ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన వారిని ప్రొఫెషనల్ స్కూల్స్‌కు పంపిస్తారు. పతకాలు సాధిస్తారని అంచనాకు వచ్చిన తర్వాతే క్రీడాకారులను జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారు. ఆ మెరికల్లాంటి క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై ఎలా రాణిస్తారో చూస్తూనే ఉన్నాం. కష్టమే విస్తుపోయేలా... మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేయడంలో చైనా తీరే వేరు. నాలుగు నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలకు చైనా స్పోర్ట్స్ స్కూళ్లలో శిక్షణ ఇస్తారు. ఉదయం 6.30కు మొదలయ్యే శిక్షణ పలు దఫాలుగా కొనసాగుతూ రాత్రి 9.30 గంటలకు ముగుస్తుంది. మధ్యలో పిల్లలకు విద్యాబుద్ధులు కూడా నేర్పుతారు. అయితే స్పోర్ట్స్ స్కూళ్లలో విద్యకు అంతగా ప్రాధాన్యత ఉండదు. కంటితుడుపు మాత్రమే. కోచ్‌ల దృష్టంతా శిక్షణపైనే. వారిచ్చే శిక్షణ కఠినాతి కఠినంగా ఉంటుంది. చిన్నారులను స్ప్రింగుల్ని వంచినట్లుగా వంచేస్తారు. పిల్లల భుజాలపైకి కోచ్‌లు ఎక్కేస్తారు. పిల్లల కాళ్లను తొక్కేస్తారు. ఏడ్చినా పట్టించుకోరు. ఒకానొక సమయంలో వారికిచ్చేది ‘శిక్ష’ణేనా అనిపిస్తుంది. వారిని దారిలోకి తెచ్చేందుకు తిడతారు. అవసరమైతే భయపెడతారు. ఇదంతా శిక్షణలో భాగమే. ఇక పిల్లలు ఆరంభంలో శిక్షణ తీసుకోవడంలో నానాకష్టాలు పడ్డా కొద్ది రోజుల్లోనే వారు అలవాటు పడిపోతారు. ఇదేం ‘శిక్ష’ణ? స్పోర్ట్స్ స్కూళ్లతో చైనా మంచి ఫలితాలు సాధిస్తున్నా.. అక్కడ ఇచ్చే శిక్షణపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పిల్లలకు సాధన ఇచ్చే తీరును చాలా దేశాలు తప్పు పడుతున్నాయి. శిక్షణ పద్ధతులను మార్చుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. పిల్లలకు ఇచ్చేది శిక్షణా లేక శిక్షా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. కొందరైతే పిల్లల్ని పశువుల్లా చూస్తున్నారంటూ మండిపడుతున్నారు. అయితే చైనాలో మాత్రం ఈ తరహా శిక్షణపై తల్లిదండ్రుల నుంచి ఎటువంటి వ్యతిరేకత రావడం లేదు. దేశానికి తమ ఇంటి నుంచి క్రీడాకారుడిని అందించినట్లుగానే భావిస్తారట. పతకాలు సాధించని వారి సంగతేంటి...? చైనా స్పోర్ట్స్ స్కూళ్లలో కొన్ని వేల మందికి శిక్షణనిస్తారు. అయితే వారిలో పతకాలు సాధించే వరకు వెళ్లేవారు వందల సంఖ్యలోనే ఉంటారు. దేశానికి పతకాలు సాధించే వారికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. స్పాన్సర్లు వారి వెంట పడతారు. మరి పతకాలు సాధించలేని వారికి, స్పోర్ట్స్ స్కూళ్ల నుంచి మధ్యలోనే తిరిగొచ్చిన వారి పరిస్థితి ఏంటి ? ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదు. ఎందుకంటే స్పోర్ట్స్ స్కూళ్ల నుంచి బయకొచ్చిన వారికి క్రీడల గురించి తప్ప మరే ప్రావీణ్యం ఉండదు. ఇక పతకాలు సాధించలేని వారికి స్థానిక స్పోర్ట్స్ కమిషన్లు కొన్ని సార్లు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఒకవేళ ఉద్యోగం దొరక్కపోతే ఫ్యాక్టరీల్లో శ్రామికులుగా స్థిరపడిపోతున్నారు. ఇలా 80 శాతం మంది చైనాలో క్రీడాకారులు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. పేదరికంలో మగ్గిపోతున్నారు. అపరిమితమైన సాధన కారణంగా చాలా మంది ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. పతకం దక్కాలంటే తప్పదు మరి..! ఓ వైపు చైనా శిక్షణపై విమర్శలు వస్తున్నా... క్రీడాకారులు మాత్రం పతకం సాధించడానికి ఇదే సరైన విధానమంటున్నారు. ‘ఈ స్థాయిలో శిక్షణ తీసుకుంటేనే అంతర్జాతీయంగా విజయం సాధిస్తాం. నేను కూడా స్పోర్ట్స్ స్కూల్లో కఠినమైన శిక్షణనే తీసుకున్నా. బంగారు పతకం సాధించడానికి ఈ శిక్షణే కారణమైంది’ అని లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, స్విమ్మర్ యె షివెన్ చెప్పింది.