Insta network
-
ఫాలోవర్లు పెరగాలంటే ఏం చేయాలో తెలుసా..
టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో అందరూ ఈజీగా ఫేమస్ కావాలనుకుంటున్నారు. దానికోసం ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకుంటున్నారు. అందులో ఇన్‌స్టాగ్రామ్‌కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. దాదాపు ప్రతిఒక్కరు ఈ యాప్‌ను వాడుతున్నారు. వ్యక్తిగత జీవితం నుంచి వ్యాపార, వృత్తి పరమైన అంశాలను పంచుకోవడానికి ఇదో వేదికగా మారింది. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండడం అనేది ఒక గొప్ప అంశంగా పరిగణిస్తున్నారు. కొంతమంది తమని తాము ఎక్కువ మందికి పరిచయం చేసుకోవడానికి ఫాలోవర్లను పెంచుకుంటే, కంపెనీలు, బ్రాండ్లు తమ వ్యాపారాన్ని ఎక్కువ మందికి చేరవేయడానికి, సెలెబ్రెటీలు తమ అభిమానులకు చేరువలో ఉండడానికి ఇలా ఎవరికి వారు ఇందులో ఫాలోవర్లను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవడానికి, అందులో ఫేమస్ అవ్వడానికి ఉన్న మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అకౌంట్ ఆప్టిమైజేషన్ అకౌంట్‌కు ఏదో ఒక పేరు పెట్టేసి, నాలుగు మాటలు రాసేసి, ఒక ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా అప్లోడ్ చేస్తే సరిపోదు. ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించాలి అనుకుంటే ఒక ప్రొఫెషనల్‌గా అకౌంట్‌ను క్రియేట్ చేయాలి. బయోలో మీ గురించి లేదా మీ బ్రాండ్ గురించి ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను రాయాలి. ఒకవేళ ఏదైనా బ్రాండ్ గురించి ప్రమోట్ చేయాలంటే అందుకు సంబందించిన లింక్‌ను బయో, హోమ్ పేజీలో ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్ల వాడకం మీ అకౌంట్‌ను రిప్రజెంట్ చేసేలా మంచి హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే అసాధారణమైన హ్యాష్ ట్యాగ్ మీకంటూ ఒక గుర్తింపుని తీసుకువస్తుంది. మీ ఆలోచనలను తెలియచెప్పడానికి హ్యాష్ ట్యాగ్‌లను ఉపయోగిస్తే, అవి మిమ్మల్ని మరింత పాపులర్ చేస్తాయి. ఎంత క్రియేటివిటీ ఉన్నా దాన్ని సరైన పద్ధతిలో వినియోగించకపోతే ఎక్కువ మంది ఫాలోవర్లు రారనే విషయాన్ని గమనించాలి. కచ్చితమైన సమయంలో.. రోజులో ఏ సమయానికి పోస్ట్‌లు అప్లోడ్ చేయాలి.. ఎలాంటి సందర్భంలో ఎలాంటి పోస్టులు పెట్టాలి అనే ఒక నిర్దేశిత క్యాలెండరు ఏర్పాటు చేసుకోవాలి. ఎన్ని పోస్టులు పెడుతున్నారనే దానికంటే ఏ టైమ్‌లో పెడుతున్నాం అనేదే ముఖ్యం. మీ ఫాలోవర్లు ఎలాంటి సమయాల్లో పోస్టులు ఎక్కువగా చూస్తారో, ఎలాంటి పోస్టులు ఇష్టపడతారో ఒక సర్వే చేయాలి. వాటి ఆధారంగా పోస్టులని క్రియేట్ చేయాలి. లైవ్ వీడియోస్ చాలా మంది ఫొటోలు పోస్ట్ చేస్తున్నాం కదా, వీడియోస్ ఎందుకులే అనే ధోరణిలో ఉంటారు. వీటితోనే ఫాలోవర్లను పెంచుకుందాం అనుకుంటారు. మారుతున్న ప్రపంచంలో ఎక్కువ శాతం యూజర్లు వీడియోస్‌కే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి వీడియోస్, లైవ్ వీడియోస్ , స్టోరీలను అప్లోడ్ చేయాలి. ఇదీ చదవండి: ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు..! కంటెంట్‌పై దృష్టి కొంతమంది తమ బ్రాండ్‌ను పాపులర్ చేయాలనే క్రమంలో ఫాలోవర్లు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోరు. అలాంటి సందర్భాల్లో కొత్త ఫాలోవర్లు రాకపోగా, ఉన్న ఫాలోవర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టవచ్చు. కాబట్టి, మీ ఫాలోవర్లు ఎలాంటి కంటెంట్‌ను ఎక్కువ ఇష్టపడుతున్నారో రీసెర్చ్ చేయాలి. దానికి అనుగుణంగా మీరు కంటెంట్‌పై దృష్టి సారించాలి. ట్రెండింగ్ విషయాల గురించి పోస్టులు పెట్టాలి. -
ఈకామ్ రుణాలు ఆపేయండి
ముంబై: ఈకామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డు సాధనాల కింద రుణాల మంజూరు, వితరణ నిలిపివేయాలంటూ బజాజ్ ఫైనాన్స్‌ను ఆర్బీఐ ఆదేశించింది. డిజిటల్ రుణాల మార్గదర్శకాలను పాటించకపోవడమే ఇందుకు కారణం. సదరు లోపాలను సంతృప్తికరమైన విధంగా బజాజ్ ఫైనాన్స్ సరిచేసుకున్నాక ఆంక్షలను పునఃసమీక్షిస్తామని పేర్కొంది. -
'టెంపర్' బ్యూటీ ఇన్‌స్టా అకౌంట్ మాయం.. అసలు సంగతి ఏంటంటే ?
Nora Fatehi Return To Instagram After Hacking Attempt: బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ తన క్రేజీ బాడీ మూమెంట్స్‌తో మెస్మరైజ్ చేస్తుంది. స్పెషల్ సాంగ్స్‌లో ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ప్రత్యేక గీతాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోస్, వీడియోస్‌తో అభిమానులను ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తుంది. అలాంటిది నోరా ఫతేహి ఇన్‌స్టా అకౌంట్ ఒక్కసారిగా మాయమైపోయింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సంఘటనతో నోరా ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. నోరానే తన ఇన్‌స్టా పేజీని డిలీట్ చేసిందని భావించారు. అయితే అదే రోజు రాత్రి అయ్యేసరికి అసలు విషయం తెలిసింది. తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని తెలిపింది నోరా. శుక్రవారం రాత్రి మళ్లీ తన పేజీ రీస్టోర్ అయిందని పేర్కొంది. 'అందరికీ సారీ. నా ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసేందుకు ఉదయం నుంచి ప్రయత్నించారు. కానీ ఈ సమస్యను త్వరగా పరిష్కరించారు. వారి టీమ్‌కు ధన్యవాదాలు.' అని రీస్టోర్ అయిన అకౌంట్లో పోస్ట్ షేర్ చేసింది ముద్దుగుమ్మ. నోరా ఫతేహీకి ఇన్‌స్టాలో 37 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల నోరా ఫతేహి పులి పిల్లలకు ఆహారం పెడుతున్న వీడియో పోస్ట్ చేశాక అకౌంట్ హ్యాక్ అయింది. 'బాహుబలి', 'టెంపర్' తదితర సినిమాల్లో నోరా ఐటమ్ సాంగ్స్‌లో అలరించిన సంగతి తెలిసిందే. -
తగ్గని సమంత దూకుడు.. అందులోనూ రికార్డు
Samantha Hits 20Million Followers On Instagram: టాలీవుడ్ స్టార్ నటి సమంత ఎక్కడా తగ్గట్లేదు. నాగచైతన్యతో విడాకుల తర్వాత మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా మారిన సామ్ వరుస ఆఫర్స్‌తో దూకుడు మీద ఉంది. ఇటీవలే లవ్ ఆఫ్ అరెంజ్మెంట్స్ అనే ఇంటర్నేషనల్ ఫిల్మ్‌కు ఓకే చెప్పిన జెస్సీ బాలీవుడ్‌లోను 3 సినిమాలకు డీల్ కుదుర్చుకుందని టాక్ వినిపిస్తోంది. అలాగే బన్నీ సరసన పుష్ప: ది రైజ్ సినిమాలో ఐటెం గర్ల్‌గా అదరగొట్టనుంది. దీనికి సంబంధించిన సామ్ ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట ఎంత వైరల్ అయ్యాయో చూశాం. ఇది చదవండి: 'తగ్గేదే లే' అంటున్న సమంత.. మరో 3 సినిమాలకు డీల్ ? అంతేకాదు సోషల్ మీడియాలో సమంత తెగ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తుంది సమంత. ఈ సోషల్ మీడియాలో కూడా తనదైన రీతిలో సత్తా చాటింది సామ్. తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో సమంత మరో మరో అరుదైన ఘనత సాధించింది. ఇన్‌స్టాలో ఆమెను ఫాలో చేస్తున్న వారి సంఖ్య 2 కోట్లు దాటింది. అంటే ఇప్పుడు ఇన్‌స్టాలో ఆమె ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు చేరింది. ఈ విషయాన్ని ఓ ఫొటో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. తనను అభిమానిస్తున్న వారందరికీ థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేసింది సామ్. ఇదిలా ఉంటే సౌత్ ఇండస్ట్రీలో ఆమె కంటే ముందుగా రష్మిక మంధనా (2.4 కోట్లు), కాజల్ అగర్వాల్ (2.2 కోట్లు)తో ముందు వరుసలో ఉన్నారు. అయితే త్వరలో సామ్ వీరిని కూడా దాటేసి ముందుకెళ్తుందేమో చూడాలి. ఇది చదవండి: సమంత సరికొత్త ఫొటోలు.. నెట్టింట్లో వైరల్ -
తుపాన్ ప్రభావిత జిల్లాల్లో వొడాఫోన్ ఉచిత టాక్‌టైమ్
హైదరాబాద్: తుపాన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్టణంలో ఇన్‌స్టా నెట్‌వర్క్‌ను నాలుగు ప్రాంతాల్లో (గాజువాక, కేజీహెచ్, జగదాంబ జంక్షన్, ఎంవీపీ కాలనీ)రికార్డ్ స్థాయిలో ఏర్పాటు చేశామని వొడాఫోన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. తక్షణం కనెక్టివిటీని అందించేదుకు ఈ ఇన్‌స్టా నెట్వర్క్ తోడ్పటుతుందని పేర్కొంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖలో ఇతర ప్రాంతాల్లోనూ కనెక్టివిటీని అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. తుపాన్ ప్రభావిత ఐదు జిల్లాల్లోని వొడాఫోన్ వినియోగదారులకు ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్ చేస్తున్నామని పేర్కొంది. వినియోగదారులు 144నంబర్‌కు క్రెడిట్ అని ఎస్ఎంఎస్ పంపించాలని సూచించింది. డాట్ ఆదేశాల ప్రకారం ఎలాంటి గుర్తింపు పత్రాలు తీసుకోకుండానే ప్రజలకు జారీ చేసేందుకు స్పెషల్ సిమ్‌లను తయారు చేశామని పేర్కొంది.