
ముంబై: ఈకామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డు సాధనాల కింద రుణాల మంజూరు, వితరణ నిలిపివేయాలంటూ బజాజ్ ఫైనాన్స్‌ను ఆర్‌బీఐ ఆదేశించింది. డిజిటల్ రుణాల మార్గదర్శకాలను పాటించకపోవడమే ఇందుకు కారణం.
సదరు లోపాలను సంతృప్తికరమైన విధంగా బజాజ్ ఫైనాన్స్ సరిచేసుకున్నాక ఆంక్షలను పునఃసమీక్షిస్తామని పేర్కొంది.