
చిరుతపులి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరుత వేటాడి దాడి చేస్తే ఇక ప్రాణాలు వదులుకోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే క్రూర జంతువు చిరుతపులి. చెట్లను ఎక్కడం, పాకడం, నీటిలో ఈదడంలోనూ ఇది ఆరితేరిన జంతువు. అలాంటి చిరుతకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైకు చెందిన అమిత్ మెహ్రా అనే యూజర్ తన ట్విటర్‌లో చిరుతపులికి చెందిన ఫోటోను పోస్టు చేశారు.
చదవండి: తెలుసా..! ‘పేరు’తో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించొచ్చు!
There is a leopard in this picture. Try to spot it. No pun intended 🥴 pic.twitter.com/xeT87wV1cy
— Amit Mehra (@amitmehra) December 27, 2021
ఈ చిత్రంలో చిరుత ఎక్కడుందో గుర్తించాలంటూ నెటిజన్లకు సవాల్ విసిరారు. ఈ ఫోటో అడవి మధ్యలో చెట్ల దగ్గర తీసినట్లు కనిపిస్తుంది. అయితే ఇందులో చిరుత ఎక్కుడుందో కనుక్కోవడమే అసలైన టాస్క్. సాధారణంగా కొన్ని చూడగానే టక్కున కనిపిస్తాయి. మరికొన్ని కొంచెం నిశితంగా పరిశీలిస్తేనే కనిపించే అవకాశం ఉంటుంది.
దీనిని చూసిన కొంతమంది నెటిజన్లు. ఫోటోలో చిరుత ఉందా అనే సందేహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు గుర్తు పట్టడం చాలా కష్టమండోయ్ అంటున్నారు. మరి ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో కనిపెట్టండి. కనిపించకుంటే కింద ఉన్న ఫోటోను చూడండి మీకే తెలుస్తుంది.
చదవండి: రైల్వే ట్రాక్‌పై తలపెట్టి ఆత్మహత్యాయత్నం.. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో..