![UP Man Conducts His Last Rites Constant Conflicts With His Family - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/18/Conflicts-With-His-Family.jpg.webp?itok=dx4Of7li)
బతికుండగానే ఓ వ్యక్తి తన అంత్యక్రియలు తానే నిర్వహించుకున్నాడు. తాను చనిపోయినప్పుడూ ఇక్కడే చివరి కార్యక్రమాలు చేయాలని అభ్యర్థించాడు. తద్దినం దగ్గర నుంచి దశదిన కర్మల వరకు అన్ని తానే నిర్వహించుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అతను ఎందుకిలా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే..
అసలేం జరిగందంటే..యూపీలోని కేవాన్ గ్రామానికి చెందిన జటా శంకర్‌కి తన కుటుంబంతో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. తాను చనిపోతే అంత్యక్రియలు చేస్తారో లేదో అన్న భయంతో అన్ని కార్యక్రమాలను తాను బతికుండగానే తానే చేసుకున్నాడు. అందుకోసం తన భార్యతో దెబ్బలాడి మరీ ఒప్పించాడు. జూన్15 తాను చనిపోయిన 13వ రోజుగా తీర్మానించి తనకు తానుగా పిండం పెట్టుకున్నాడు.
ఆ తర్వాత గ్రామస్తులకు గ్రాండ్‌గా విందు కూడా ఏర్పాటు చేశాడు. అంతేగాదు శంకర్ తన సమాధి కోసం ఓ కాంక్రీట్ ఫ్లాట్‌ఫాంని కూడా నిర్మించాడు. తన అంత్యక్రియలు అక్కడే జరగాలని శంకర్ తమతో చెబుతుండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. తరుచుగా తన కుటుంబంతో తగాదాలు జరగడంతో విరక్తి చెంది ఇంతటి దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు పలువురు చెబుతున్నారు. ఈ విషయం గ్రామంలో దావానంలా వ్యాపించడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment