Bhavish Aggarwal Tweet: దేశీయ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) గురించి, ఆ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ గురించి పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే భారతీయ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు పొందుతున్న సంస్థగా పేరుపొందింది. అయితే ఇటీవల భవిష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలోని కొన్ని కంపెనీలు పరాయి దేశాలకు చెందిన సంస్థల వాహనాలను ఎందుకు తయారు చేస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని, మేము పూర్తిగా ఎలక్ట్రిక్ వాహన ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తామంటూ ట్వీట్ చేసాడు. ఇది హీరో మోటోకార్ప్ & బజాజ్ ఆటో కంపెనీలను దృష్టిలో పెట్టుకుని ట్వీట్ చేసినట్లు చాలామంది భావిస్తున్నారు.
(ఇదీ చదవండి: దెబ్బకు 10 కోట్ల పాన్ కార్డులు క్లోజ్ - కారణం ఇదే అంటున్న ఐటీ శాఖ!)
I can’t understand why some companies are falling head over heels to contract manufacture aging western ICE motorcycle brands in India.
— Bhavish Aggarwal (@bhash) July 11, 2023
We’ll build the future of motorcycling with EVs and #MakeInIndia for the whole world!🏍️🔋🇮🇳
ఇటీవల హీరో మోటోకార్ప్ కంపెనీ అమెరికన్ కంపెనీ హార్లే డేవిడ్‌సన్‌లో కలిసి ఎక్స్440 బైకుని రూ. 2.29 లక్షలకు లాంచ్ చేసింది. అదే సమయంలో బజాజ్ ఆటో ట్రైయంఫ్ కంపెనీతో కలిసి స్పీడ్ 400 మోటార్ సైకిల్ రూ. 2.33 లక్షలకు విడుదల చేసింది. ఈ కంపెనీలను దృష్టిలో ఉంచుకుని ట్వీట్ చేసినట్లు కొంతమంది భావిస్తున్నారు. దీని పైన సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment