బెంగళూరు: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ సర్వీస్ సెంటర్లను 30 శాతం మేర పెంచుకుంది. కొత్తగా 50 సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు 500 మంది టెక్నీషియన్లను నియమించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇది దోహదపడగలదని వివరించాయి. అలాగే, సర్వీస్ వ్యూహాలు, ప్రక్రియలను మెరుగుపర్చుకునేందుకు తగు సూచనలు ఇచ్చేందుకు ఎర్న్‌స్ట్ అండ్ యంగ్‌ను నియమించుకున్నట్లు పేర్కొంది.
ఓలా వాహన సర్వీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అత్యుత్తమ ఆఫ్టర్–సేల్స్ అనుభూతిని అందించేందుకు 2024 డిసెంబర్ నాటికి తమ సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 సెంటర్లకు పెంచుకోనున్నట్లు ఓలా వ్యవస్థాపకుడు, సీఎండీ భవీష్ అగర్వాల్ సెప్టెంబర్‌లో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment