service centre
-
డిసెంబర్ నాటికి వెయ్యి సర్వీస్ సెంటర్లు: భవిష్ అగర్వాల్
బెంగళూరు: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ సర్వీస్ సెంటర్లను 30 శాతం మేర పెంచుకుంది. కొత్తగా 50 సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు 500 మంది టెక్నీషియన్లను నియమించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇది దోహదపడగలదని వివరించాయి. అలాగే, సర్వీస్ వ్యూహాలు, ప్రక్రియలను మెరుగుపర్చుకునేందుకు తగు సూచనలు ఇచ్చేందుకు ఎర్న్స్ట్ అండ్ యంగ్‌ను నియమించుకున్నట్లు పేర్కొంది.ఓలా వాహన సర్వీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అత్యుత్తమ ఆఫ్టర్–సేల్స్ అనుభూతిని అందించేందుకు 2024 డిసెంబర్ నాటికి తమ సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 సెంటర్లకు పెంచుకోనున్నట్లు ఓలా వ్యవస్థాపకుడు, సీఎండీ భవీష్ అగర్వాల్ సెప్టెంబర్‌లో ప్రకటించారు. -
సర్వీస్ సెంటర్లలో మారుతీ సుజుకీ రికార్డ్! ఏకంగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సర్వీస్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా 4,500ల కేంద్రాల మార్కును చేరుకుంది. హైదరాబాద్‌లోని రాంపల్లి సర్వీస్ సెంటర్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2022–23లో భారత్‌లో 310 సర్వీస్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేశామని సంస్థ సర్వీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మీడియాకు తెలిపారు. ‘పట్టణేతర ప్రాంతాల్లో అత్యధికంగా ఇవి ప్రారంభం అయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో సర్వీస్ కేంద్రాలను అందుబాటులోకి తేవడం సంస్థ చరిత్రలో తొలిసారి. 2023–24లో కొత్తగా 350 కేంద్రాలను నెలకొల్పుతాం. సర్వీసు కోసం నగరాల్లో 10–15 కిలోమీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 25 కిలోమీటర్లకు మించి కస్టమర్ ప్రయాణించకూడదు అన్నది మా లక్ష్యం. సర్వీస్ టచ్ పాయింట్స్ 2,271 నగరాలు, పట్టణాల్లో విస్తరించాయి. 335 సర్వీస్ ఆన్ వీల్స్ వర్క్‌షాప్స్ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 326 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 2.23 కోట్ల వాహనాలకు సర్వీసు అందించాం’ అని వివరించారు. ఇదీ చదవండి: Maruti Suzuki Jimny: మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే.. -
అకస్మాత్తుగా బైక్ చెడిపోయిందా...
సాక్షి, సిటీబ్యూరో: అకస్మాత్తుగా బైక్ చెడిపోయిందా...చాలా రోజులుగా సర్వీసింగ్‌కు ఇవ్వాలనుకొని ఇవ్వలేకపోతున్నారా..పని ఒత్తిడి కారణంగా తీరిక లేకుండా ఉందా.. మరేం ఫరవాలేదు. ఇప్పుడు మీరు ఎక్కడుంటే అక్కడి నుంచే బైక్ సర్వీసింగ్ సేవలు లభిస్తాయి. మీరు కోరుకున్న సమయంలో వాహనానికి కావలసిన మరమ్మతులు చేసి అందజేస్తారు. సర్వీసింగ్ స్టేషన్లకు పరుగెత్తవలసిన అవసరం లేదు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇంటి నుంచి వాహనాన్ని తీసుకెళ్లి సర్వీసింగ్ చేసి ఆ తరువాత తిరిగి ఇంటి దగ్గరే అప్పగిస్తారు. ఇందుకోసం చేయాల్సిందల్లా ఒక్కటే .. గాడీ–360 మొబైల్ అప్లికేషన్లో మీ బైక్ మరమ్మతు అవసరాన్ని నమోదు చేయడం. అంతే. ఆ తరువాత నిశ్చింతగా ఉండొచ్చు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ‘గాడీ –360 ’ స్టార్టప్ సంస్థ ఈ వినూత్నమైన సదుపాయాన్ని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చింది. సేవలు ప్రామాణికం సాధారణంగా చాలామంది వాహనదారులు పని ఒత్తిడి కారణంగా, నిర్లక్ష్యం వల్ల బైక్ సర్వీసింగ్‌ను వాయిదా వేస్తూంటారు. దీంతో బండి బాగా చెడిపోయి, విడిభాగాలు దెబ్బతింటాయి. అప్పుడు మరింత నష్టం వాటిల్లుతుంది. కానీ క్రమం తప్పకుండా వాహనాన్ని సర్వీసింగ్ చేయడం వల్ల ఎక్కువ కాలం వినియోగించుకొనే అవకాశం లభిస్తుంది. మరోవైపు బైక్‌ను సర్వీసింగ్‌కు ఇవ్వాలని భావించినప్పటికీ ప్రామాణికమైన, నమ్మకమైన మెకానిక్‌ను ఎంపిక చేసుకోవడంలో చాలా మంది విఫలమవుతారు. ఈ పరిస్థితుల్లో అలాంటి ఇబ్బందులేమీ లేకుండా నాణ్యమైన, నమ్మకమైన, ప్రామాణికమైన బైక్ సర్వీసింగ్ సదుపాయం కల్పించనున్నట్లు హామీ ఇస్తోంది గాడీ–360. ప్రస్తుతం మాదాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్, తదితర ప్రాంతాల్లో సేవలు కొనసాగుతున్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాలకు తమ సర్వీసులను విస్తరిస్తున్నట్లు చెప్పారు సంస్థ సీఈఓ అనిల్. వాహన వినియోగదారులు మొబైల్ ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని తమ బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్, అడ్రస్, తదితర వివరాలను నమోదు చేస్తే చాలు. ప్రతినిధులు నేరుగా వచ్చి బైక్‌ను పరిశీలించి లోపాలను గుర్తిస్తారు. మరమ్మతులకు అంగీకరిస్తే తమతో పాటు తీసుకెళ్తారు. మరమ్మతులు పూర్తయిన తరువాత ఫైనల్ బిల్లు మొబైల్ ఫోన్‌కు అందుతుంది. ఆ తరువాత ప్రతినిధులు తిరిగి వాహనాన్ని అప్పగిస్తారు. ఈ పిక్ అండ్ డ్రాప్ సేవలు పూర్తిగా ఉచితం. సర్వీసింగ్ చార్జీలు మాత్రం రూ.799 చెల్లిస్తే సరిపోతుందని అనిల్ వివరించారు. ఒకవేళ విడిభాగాలు ఏవైనా వినియోగిస్తే వాటికి సంబంధించిన ఇన్వాయిస్ ప్రకారం డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. పని చేసే ఆఫీస్ నుంచి లేదా ఇంటి దగ్గర నుంచి ఈ సర్వీసులను పొందవచ్చు. పారదర్శకమైన సేవలు మా సేవలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. ఎక్కడా ఎలాంటి దాపరికం ఉండదు. బ్రాండెడ్ విడిభాగాలను వినియోగిస్తాం. నాణ్యమైన సేవలను అందజేస్తాం. వాహనదారులు తమ బైక్ మోడల్, బ్రాండ్, రిజిస్ట్రేషన్ నెంబర్, బుకింగ్ డేట్ వంటి వివరాలను యాప్ ద్వారా నమోదు చేసి మాకు చేరవేస్తే చాలు. ఆ తరువాత అన్నీ మేమే చూసుకుంటాం. – అనిల్, సీఈవో -
కుళాయిల్లో అక్రమాల ధార
నెల్లూరు నగరం రోజురోజుకీ విస్తరిస్తోంది. ప్రజల తాగునీటి అవసరాలు కూడా పెరిగిపోతున్నాయి. నెల్లూరు నగర పాలక సంస్థ సరఫరా చేసే నీటి మీదే ప్రజలు ఆధారపడుతున్నారు. ప్రజల అవసరాలను కొంత మంది వాటర్ వర్క్స్ ఉద్యోగులు తమ ఆదాయ వనరుగా మార్చుకుని అక్రమాలకు తెరలేపారు. అక్రమ కుళాయి కనెక్షన్ల వ్యవహారంలో ఫిట్టర్లదే కీలకపాత్ర. వారే దళారుల పాత్ర ఎత్తి అక్రమంగా కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. వీరి నిర్వాకంతో కార్పొరేషన్ ఆదాయానికి ఏటా రూ.కోట్లలో గండి పడుతోంది. నెల్లూరు(అర్బన్), న్యూస్‌లైన్ : నగరంలో జనరల్ కనెక్షన్లు 24,538, బీపీఎల్ కనెక్షన్లు 9,759, కమర్షియల్ కనెక్షన్లు 637, ఓవైటీ కనెక్షన్లు 3,446 ఉన్నాయి. కుళాయి కనెక్షన్ తీసుకోవాలంటే ముందుగా నగర పాలక సంస్థలోని పౌర సేవ కేంద్రంలో చలానా కట్టాలి. బీపీఎల్ కనెక్షన్‌కు అయితే రూ.265 చెల్లించాలి. తొమ్మిది అంకణాల రేకుల ఇల్లు లేదా పూరిగుడిసె, లేదా మూడు అంకణాల శ్లాబు ఇల్లు కలిగిన వారు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారుగా గుర్తిస్తారు. వీరే బీపీఎల్ కనెక్షన్ తీసుకునేందుకు అర్హులు. వారికి ప్రభుత్వమే పైపులు కూడా అందజేస్తోంది. జనరల్ కనెక్షన్ అయితే రూ.6,065 డిపాజిట్ రూపంలో, రూ.2 వేలు ఎస్టిమేషన్ చార్జీలు, ఏడాది పన్ను చెల్లించాలి. కమర్షియల్ కనెక్షన్‌కు రూ.15,065 చలానా చెల్లించాలి. పౌరసేవ కేంద్రంలో చలానా చెల్లించిన తర్వాత వినియోగదారుడి దరఖాస్తు సంబంధిత విభాగం గుమస్తాకు చేరుతుంది. ఆ దరఖాస్తుకు నంబరు వేసిన తర్వాత ట్యాప్ ఇన్స్పెక్టర్ పరిశీలనకు పంపాలి. ట్యాప్ ఇన్స్పెక్టర్ కుళాయి వేయాల్సిన ఇంటిని పరిశీలించి నివేదికను ఏఈ, డీఈలకు పంపుతారు. నివేదికల పరిశీలన అనంతరం వర్క్ ఆర్డర్ ఇస్తారు. వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతే కుళాయి వేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారమంతా 15 రోజుల్లో పూర్తి చేయాలి. జరుగుతోందిలా..: ఫిట్టర్లు, అధికారులు కుమ్మక్కై ఇష్టానుసారం కుళాయి కనెక్షన్లు ఇస్తున్నారు. ఫిట్టర్లు నేరుగా వినియోగదారులను ఆశ్రయించి కుళాయిలు వేసేస్తున్నారు. ఫిట్టర్లు ఓ రకంగా అక్రమ కుళాయిల మాఫియాగా తయారయ్యారు. బీపీఎల్ కనెక్షన్‌కు వ్యక్తులను బట్టి రూ.4 వేలు నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. జనరల్ కనెక్షన్‌కు రూ.12 వేలు నుంచి రూ.18 వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఇక కమర్షియల్ కనెక్షన్ అంటే వీరికి పండగే.. నిబంధనల ప్రకారం చలానా చెల్లిస్తే 3/4 ఇంచ్ పైప్ వేయాలి. దీనికి రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. అయితే వీరు ఒక ఇంచ్ పైప్ వేస్తామని చెప్పి రూ.70 వేలు కూడా వసూలు చేస్తున్నారు. నగరంలో అధికారుల లెక్కలకు తేలకుండా సుమారు 20 వేలకు పైన కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఫిట్టర్ల నిర్వాకం కారణంగా ఏటా కార్పొరేషన్‌కు రూ. 2 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది. అక్రమాలివిగో.. వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డి కాలనీ, ఫత్తేఖాన్‌పేట, హరనాథపురం, జెండావీధి, ఖుద్దూస్‌నగర్, మన్సూర్ నగర్, వాకర్స్‌రోడ్డు, కోటమిట్ట తదితర ప్రాంతాల్లో అక్రమ కుళాయిల దందా యథేచ్ఛగా సాగుతోంది. కోటమిట్ట, ఖుద్దూస్‌నగర్, మన్సూర్‌నగర్, వాకర్స్‌రోడ్డు ప్రాంతంలో పంపింగ్ మైన్లైన్కు విచ్చలవిడిగా కనెక్షన్లు ఇచ్చారు. దీనివల్ల ఎక్కడైనా లీకేజీలు ఉన్నా మరమ్మతులు చేసేందుకు వీలుకాదు. దీంతో తాగునీరు వృథా అవుతూ ఉంటుంది. ఖుద్దూస్‌నగర్‌లో ఖాళీ స్థలాలకు కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చేశారు. ఒక్కో ఇంటికి రెండు, మూడు కనెక్షన్లు కూడా ఇచ్చి ఉండటం విశేషం. ఫత్తేఖాన్‌పేటలో ఓ మహిళ నుంచి అక్రమంగా రూ.10 వేల వసూలు చేసి కుళాయి కనెక్షన్ ఇచ్చినట్లు సమాచారం. కార్పొరేషన్లో చలానా చెల్లిస్తామని చెప్పి నమ్మబలికి ఆమె వద్ద నుంచి ఆ డబ్బును వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే నగర పాలక సంస్థ ఖజానాలో ఆ మొత్తం జమకాలేదు. చలానా రశీదు కోసం ఆమె ప్రతి రోజు ఆ ప్రాంతంలోని వాటర్‌వర్క్స్ సిబ్బందిని తరచూ నిలదీస్తున్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలోని వాటర్‌వర్క్స్ సిబ్బంది ఆమెకు కన్పించకుండా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉయ్యాలకాలువ కట్ట ప్రాంతంలో విచ్చలవిడిగా కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. వారంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారే. ఒక్కొక్కరి వద్ద రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసి కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిసింది. ఒక్కరికి కూడా ఇంత వరకు కుళా యి పన్ను రాకపోవడం విశేషం. -
కావూరి హామీలు
కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం రూ.37,500తో ఆరోగ్యబీమా పథకం. అందరికీ ఉచితం. మొత్తం డబ్బులు ప్రభుత్వమే భరిస్తుంది. కార్మికుల వివరాలు వెంటనే పంపించాలని సెంట్రల్ టెక్స్టైల్ కమిషనర్ జోషీకి ఆదేశం. ఇంతకుముందు బీమా పథకం రూ.7,500 ఉండేది. పనిలో నేర్పరితనం పెంపొందించేందుకు సిరిసిల్లలో రూ.8 కోట్లతో శిక్షణ కేంద్రం ఏర్పాటు. వీవింగ్, వార్పింగ్, సైజింగ్, డైయింగ్, ప్రాసెసింగ్ తదితర అంశాల్లో కార్మికులకు తర్ఫీదు. సిరిసిల్లలో మెగా పవర్‌లూం క్లస్టర్ ఏర్పాటు కోసం రానున్న బడ్జెట్లో నిధులు కేటాయింపునకు ఆర్థిక మంత్రికి సిఫారసు. ఒక్కొక్కరికి అధునాతన మగ్గాల కోసం రూ.50 లక్షల వరకు రుణం అందించేందుకు సంసిద్ధత. వ్యక్తిగత షెడ్లకు, సామూహిక(గ్రూప్) షెడ్లకు రుణాలు. వీటి మూలధనం రెట్టింపు. పత్తి నుంచి గార్మెంట్స్ తయారై మార్కెట్ చేసుకునే దాకా సిరిసిల్ల పరిశ్రమను ఆదుకుంటామని హామీ. పవర్‌లూం సర్వీస్ సెంటర్ సిరిసిల్లలో ఏర్పాటుకు కృషి. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు ఈ నెల 31 లోపు మాఫీ చేస్తున్నట్లు ప్రకటన.సిరిసిల్లలో యారన్ బ్యాంకు(నూలు డిపో) నెలరోజులలోపు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం.నిరాశ సిరిస్లిలను స్పెషల్ టెక్స్టైల్ జోన్‌గా ప్రకటించకపోవడం... అపెరల్ పార్క్ ఏర్పాటుపై ప్రకటన చేయకపోవడం కార్మికవర్గాలను నిరాశకు గురిచేసింది.