కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం రూ.37,500తో ఆరోగ్యబీమా పథకం. అందరికీ ఉచితం. మొత్తం డబ్బులు ప్రభుత్వమే భరిస్తుంది. కార్మికుల వివరాలు వెంటనే పంపించాలని సెంట్రల్ టెక్స్‌టైల్ కమిషనర్ జోషీకి ఆదేశం. ఇంతకుముందు బీమా పథకం రూ.7,500 ఉండేది.
పనిలో నేర్పరితనం పెంపొందించేందుకు సిరిసిల్లలో రూ.8 కోట్లతో శిక్షణ కేంద్రం ఏర్పాటు. వీవింగ్, వార్పింగ్, సైజింగ్, డైయింగ్, ప్రాసెసింగ్ తదితర అంశాల్లో కార్మికులకు తర్ఫీదు.
సిరిసిల్లలో మెగా పవర్‌లూం క్లస్టర్ ఏర్పాటు కోసం రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయింపునకు ఆర్థిక మంత్రికి సిఫారసు.
ఒక్కొక్కరికి అధునాతన మగ్గాల కోసం రూ.50 లక్షల వరకు రుణం అందించేందుకు సంసిద్ధత.
వ్యక్తిగత షెడ్లకు, సామూహిక(గ్రూప్) షెడ్లకు రుణాలు. వీటి మూలధనం రెట్టింపు.
పత్తి నుంచి గార్మెంట్స్ తయారై మార్కెట్ చేసుకునే దాకా సిరిసిల్ల పరిశ్రమను ఆదుకుంటామని హామీ. పవర్‌లూం సర్వీస్ సెంటర్ సిరిసిల్లలో ఏర్పాటుకు కృషి. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు ఈ నెల 31 లోపు మాఫీ చేస్తున్నట్లు ప్రకటన.సిరిసిల్లలో యారన్ బ్యాంకు(నూలు డిపో) నెలరోజులలోపు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం.నిరాశ సిరిస్లిలను స్పెషల్ టెక్స్‌టైల్ జోన్‌గా ప్రకటించకపోవడం... అపెరల్ పార్క్ ఏర్పాటుపై ప్రకటన చేయకపోవడం కార్మికవర్గాలను నిరాశకు గురిచేసింది.
కావూరి హామీలు
Published Wed, Dec 25 2013 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement