ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసిన కస్టమర్లతో అసంతృప్తి పెరిగిపోతున్న తరుణంలో.. కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఓ శుభవార్త చెప్పారు. వాహనాల సర్వీసుల్లో జాప్యం కలగకుండా చూడటానికి దేశ వ్యాప్తంగా మరో 3,200 సర్వీస్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
డిసెంబర్ 20 నాటికి 3,200 కొత్త స్టోర్స్ ప్రారంభించనున్నట్లు భవిష్ అగర్వాల్ వెల్లడించారు. ఆ తరువాత కంపెనీ మొత్తం నెట్‌వర్క్ 4,000 అవుట్‌లెట్‌లకు చేరుకుంటుంది.
ప్రస్తుతం దేశంలో ఓలా స్టోర్లు కేవలం 800 మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య త్వరలోనే 4,000లకు చేరుకుంటుంది. వినియోగదారులకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా సీఈఓ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ప్రారంభం కానున్న స్టోర్లలో సర్వీస్ కూడా లభిస్తుంది. కాబట్టి కస్టమర్లు నిశ్చింతగా.. తమ వాహనంలో ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఓలా ఎస్1 ఎక్స్, ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్ వంటి స్కూటర్లను విక్రయిస్తోంది. ఇవి కాకుండా మరో మూడు (ఓలా ఎస్1 జెడ్, ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్) స్కూటర్లను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. ఇవి త్వరలోనే అమ్మకానికి రానున్నాయి. కాగా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి కూడా అడుగు పెట్టడానికి యోచిస్తోంది. ఇది బహుశా వచ్చే ఏడాది మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Taking the Electric revolution to the next level this month.
Going from 800 stores right now to 4000 stores this month itself. Goal to be as close to our customers as possible.
All stores opening together on 20th Dec across India. Probably the biggest single day store opening…— Bhavish Aggarwal (@bhash) December 2, 2024
Comments
Please login to add a commentAdd a comment