భారతీయ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో ఒకేసారి నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. అవి ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్. కంపెనీ వీటి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి కేవలం 499 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025లో ప్రారంభమవుతాయి.
ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన స్కూటర్లు.. గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ కస్టమర్ల రోజువారీ వినియోగానికి, వాణిజ్యపరమైన వినియోగానికి అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ కలిగి ఉంటాయి.
ఓలా గిగ్: రూ. 39,999
ఓలా గిగ్ ప్లస్: రూ. 49,999
ఓలా ఎస్1 జెడ్: రూ. 59,999
ఓలా ఎస్1 జెడ్ ప్లస్: రూ. 64,999
ఓలా గిగ్
రోజువారీవినియోగానికి లేదా తక్కువ దూరాలు ప్రయాణించడానికి.. ఈ స్కూటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. పేలోడ్ కెపాసిటీ బాగేనా ఉంటుంది. ఇందులోని 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ 112 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం మాత్రమే. కంపెనీ దీనిని ప్రధానంగా గిగ్ వర్కర్ల కోసం లాంచ్ చేసినట్లు సమాచారం.
ఓలా గిగ్ ప్లస్
కొంత ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి ఓలా గిగ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పనికొస్తుంది. గంటకు 45 కిమీ వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్ రేంజ్ 81 కిమీ మాత్రమే. అయితే రెండు బ్యాటరీల ద్వారా 157 కిమీ రేంజ్ పొందవచ్చు. ఇందులో కూడా 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. గిగ్ వర్కర్లు వేగవంతమైన డెలివరీ కోసం ఈ స్కూటర్లు ఉపయోగపడతాయి. రోజువారీ వినియోగానికి, నగర ప్రయాణనికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.
ఓలా ఎస్1 జెడ్
ఓలా ఎస్1 జెడ్ అనేది వ్యక్తిగత వినియోగం కోసం ఉపయోగించే స్కూటర్. పరిమాణంలో ఇది కొంత చిన్నదిగా ఉండటం వల్ల దీనిని రద్దీగా ఉండే అర్బన్, సెమీ-అర్బన్ రోడ్లపై కూడా సాఫీగా రైడ్ చేయవచ్చు. ఈ స్కూటర్ ఒక బ్యాటరీ ప్యాక్‌తో 75 కిమీ రేంజ్.. రెండుతో 146 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఇది 1.8 సెకన్లలో 0 నుంచి 20 కిమీ/గం.. 4.8 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
ఓలా ఎస్1 జెడ్ ప్లస్
ఇక చివరగా.. ఓలా ఎస్1 జెడ్ ప్లస్ విషయానికి వస్తే, ఇది దృఢమైన నిర్మాణం, అధిక పేలోడ్ కెపాసిటీ పొందుతుంది. దీనిని కూడా వ్యక్తిగత వినియోగం కోసం లేదా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ స్కూటర్ ఒక బ్యాటరీ ప్యాక్‌తో 75 కిమీ రేంజ్.. రెండుతో 146 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కూడా 1.8 సెకన్లలో 0 నుంచి 20 కిమీ/గం.. 4.8 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
ఓలా పవర్‌పాడ్
ఓలా ఎలక్ట్రిక్ కేవలం కొత్త స్కూటర్లను లాంచ్ చేయడమే కాకుండా.. పవర్‌పాడ్ కూడా లాంచ్ చేసింది. ఇది పోర్టబుల్ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. గృహోపకరణాలు, లైట్లు, ఫ్యాన్లు, ఇతర ముఖ్యమైన ఎలక్ట్రిక్ పరికరాలకు శక్తినిచ్చే ఇన్వర్టర్‌గా ఉపయోగపడుతుంది. 500W అవుట్‌పుట్‌ను కలిగిన ఓలా పవర్‌పాడ్.. 1.5 కిలోవాట్ బ్యాటరీ, 5 ఎల్ఈడీ బల్బులు, 3 సీలింగ్ ఫ్యాన్‌లు, 1 టీవీ, 1 మొబైల్ ఛార్జింగ్, 1 Wi-Fi రూటర్ వంటి వాటికి మూడుగంటల పాటు శక్తినిస్తుంది. అంటే పనిచేసేలా చేస్తుంది. దీని ధర రూ. 9999 మాత్రమే.
ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..
ఓలా ఎలక్ట్రిక్.. కొత్త స్కూటర్లను లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి మూలకు ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓలా గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్‌ల లాంచ్ ఈవీ రంగం వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నామన్నారు. సరసమైన ధర వద్ద లభించే ఈ స్కూటర్లు తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని అన్నారు.
Say hello to Ola S1 Z & Gig range, starting at just ₹39K!
Affordable, accessible, and now with a portable battery pack that doubles up as home inverter using the Ola PowerPod
Reservations open, deliveries Apr’25!🛵⚡🔋
Ola S1 Z: https://t.co/jRj8k4oKvQ
Ola Gig:… pic.twitter.com/TcdfNhSIWy— Bhavish Aggarwal (@bhash) November 26, 2024
Comments
Please login to add a commentAdd a comment