ఒక్క చార్జింగ్ తో 579 కిలోమీటర్లు
ధర 74,999 నుంచి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ విభాగంలోకి ప్రవేశించింది. రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ప్రో వేరియంట్లను ప్రవేశపెట్టింది. 2.5–16 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో తయారయ్యాయి. ధర రూ.74,999 నుంచి మొదలై రూ.2,49,999 వరకు ఉంది. 2025 దీపావళి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి.
ఒకసారి చార్జింగ్‌తో వేరియంట్‌నుబట్టి 200 నుంచి 579 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. టాప్ స్పీడ్ గంటకు 124–194 కిలోమీటర్లు. కాగా, క్విక్ కామర్స్‌లోకి ఓలా ఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం ఓలా క్యాబ్స్ కాస్తా ఓలా కన్జూమర్ అయింది. అలాగే ఓలా పే పేరుతో యూపీఐ సేవలను సైతం కంపెనీ ఆవిష్కరించింది. అనుబంధ కంపెనీ కృత్రిమ్ ఏఐ 2026 నాటికి ఏఐ చిప్‌ను ప్రవేశపెట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment