Ola Electric Discontinued Sales of the Ola S1 Variant - Sakshi
Sakshi News home page

షాకింగ్‌: ఓలా ఎస్‌1 స్కూటర్‌కు గుడ్‌ బై, కస్టమర్లు ఏం చేయాలి?

Published Sat, Jul 29 2023 3:11 PM | Last Updated on Sat, Jul 29 2023 4:25 PM

Ola Electric Discontinued Sales of Ola S1 Variant - Sakshi

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్  తన  అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. 2021లో విడుదల చేసిన తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ప్రకటించింది. కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్ నుండి ఎస్1 వేరియంట్‌ను తొలగించి ఎస్1 ప్రోపై,  ఎస్‌ 1 ఎయిర్ మోడల్స్‌  ఫోకస్‌ పెట్టనుంది.

ఓలా ఎస్‌ 1 ఎయిర్‌ లాంచింగ్‌ సందర్బంగా ఎస్1​ స్కూటర్‌ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్‌ ప్రకటించింది. ఈ నిర్ణయానికి కారణంపై స్పష్టతలేదు. అయితే  పరిమిత ఉత్పత్తి సామర్థ్యం ,ఇతర వేరియంట్‌లకు అధిక డిమాండ్ కారణంగా కావచ్చని అంచనా. దీని ప్రకారం  ఇకపై ఓలా పోర్ట్​ఫోలియోలో ఎస్​1 ఎయిర్​, ఎస్​1 ప్రో మోడల్స్​ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫీచర్ల పరంగా ఎస్‌ 1 ఎయిర్‌, ఎస్‌1 ప్రొ దాదాపు ఒకే రకంగా ఉన్న కారణంగా ఎస్‌ 1 వేరియంట్‌ అమ్మకాలను నిలిపి వేసిందే మోననేది అంచనా. అలాగే రెండింటీ మధ్య పేర్లలో భిన్నం తప్ప పెద్దగా తేడా ఏమీ లేదని భావిస్తున్నారు. (ఢిల్లీలో అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? నిర్మాత కూడా!)

ఎస్‌1 బుక్‌ చేసుకున్న వారు ఏంచేయాలి? 
ఎస్‌1 వేరియంట్‌ను బుక్ చేసిన కస్టమర్‌లు ప్లాన్‌లలో మార్పు గురించి తెలియజేస్తూ కంపెనీ ఇమెయిల్‌ను  పంపింది.  ఈక్రమంలో వారికి మూడు ఆప్షన్‌లు ఇచ్చింది.  S1 ప్రో వేరియంట్‌కి అప్‌గ్రేడ్  కావడం,  2022 చివరిలో ఎస్‌1 ప్రొడక్షన్ పునఃప్రారంభమయ్యే వరకు వేచి ఉండటం లేదా వారి బుకింగ్‌ను రద్దు చేసి మనీ రీఫండ్‌ పొందడం. ఎస్‌ 1 ప్రొ ధర రూ. 1,29,999, ఎక్స్-షోరూమ్ (FAME 2 సబ్సిడీతో సహా). ఓలా యాప్‌లో జనవరి 21న సాయంత్రం 6 గంటలకు తుది చెల్లింపు విండో తెరిచినప్పుడు అప్‌గ్రేడ్‌ని ఎంచుకున్న కస్టమర్‌లు రూ. 30,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు  రానున్న ఎలక్ట్రిక్​ స్కూటర్‌ ఓల్​ ఎస్​1 ఎయిర్​ ఇప్పటికే ఉన్న కస్లమర్లకోసం ముందస్తు బుకింగ్‌లను మొదలు పెట్టింది. విండోను తెరిచిన మొదలు పెట్టిన గంటలోపు  1,000 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించిందని  సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విటర్‌లో ప్రకటించారు.  సామాన్య ప్రజానీకం ప్రజల ఈ నెల 31నుంచి సేల్‌ షురూ అవుతుంది. ఎస్‌1 ఎయిర్ డెలివరీలు ఆగస్టు 2023లో ప్రారంభమవుతాయి. ఓలా ఎలక్ట్రిక్​ ఎస్​1 ఎయిర్‌ ధర రూ. 85,099-1.1లక్షల మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు.

ఫ్యూచర్‌ ప్లాన్స్‌ 
అలాగే  ఓలా  OS4పై పని చేస్తోందట. త్వరలో సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించనుందని మార్కెట్‌ వర్గాల అంచనా. అంతేకాదు .ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లపై కూడా పని చేస్తోంది. తమ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరింపజేయనున్నామని భవిష్ హింట్‌ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఓలా బైకులు కూడా   రంగంలోకి దిగనున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement