సాక్షి, ముంబై: ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్‌కు ఓలా ఎలక్ట్రిక్ గుడ్ న్యూస్ చెప్పింది.డిసెంబర్ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ టు రిమెంబర్ అంటూ ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. అలాగే జీరో డౌన్ పేమెంట్‍తో పాటు మరిన్ని ఆఫర్లు ఉన్నాయి. అయితే బేస్ వేరియంట్‌పై ఈ ఆఫర్ వర్తించదు. అలాగే 10 ఈ స్కూటర్లను ఉచితంగా అందించనుంది.
గతంలో అక్టోబర్‌లోప్రకటించిన ఈ ఆఫర్‌ను తర్వాత నవంబర్ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆఫర్‌ను డిసెంబర్ 31 2022 వరకు పొడిగించింది.
ఓలా ఎస్1 ప్రోపై డిస్కౌంట్
ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.10వేల తగ్గింపును అందిస్తోంది. తద్వారా ఈ స్కూటర్‌ను రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్)కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.1,39,999.
జీరో డౌన్ పేమెంట్
జీరో డౌన్ పేమెంట్‍తో నెలకు కనిష్టంగా రూ.2,499 ఈఎంఐ ఆప్షన్‍తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. 8.99 శాతం వడ్డీరేటుతోపాటు, వెహికల్ ఫైనాన్స్‌పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది. ఉండదు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్ కూడా లభ్యం.
10 ఎస్1 ప్రో స్కూటర్లు ఉచితంగా
పది ఎస్1 ప్రో స్కూటర్లను కస్టమర్లకు ఉచితంగా అందించేందుకు కాంటెస్టును నిర్వహిస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ తెలిపారు. లక్ష యూనిట్ల విక్రయాలను అత్యంత వేగంగా సాధించిన సంస్థగా ఓలా అవతరించింది, అలాగే ఈ సెగ్మెంట్‌లో 50 శాతానికి పైగా ఆదాయ మార్కెట్ వాటాతో వరుసగా 3 నెలలో( నవంబరు) కూడా అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్‌గా కూడా అవతరించింది.
కాగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు నవంబర్ 2022లో 20,000 యూనిట్లను దాటేశాయని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే విస్తరణలో భాగంగా 11 నగరాల్లో 14 కొత్త ఎక్స్‌పీరియన్స్ కేంద్రాలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి. త్వరలోనే మరో 100 సెంటర్లను ప్రారంభించాలని ఓలా భావిస్తోంది.
From winning an Ola 🛵, to endless offers while buying it...if there weren’t enough reasons to switch to the Ola S1, here are some more. Own the #1 EV in India and make it a December to remember! 🎁🥳🎄 #EndICEage ⚡️ pic.twitter.com/8aZyqcy9pq
— Ola Electric (@OlaElectric) December 5, 2022
Comments
Please login to add a commentAdd a comment