Ola S1 Air Arrival Confirmed, CEO Bhavish Aggarwal Announces Special Offer - Sakshi
Sakshi News home page

ఓలా ఎస్‌1 ఎయిర్‌ లాంచింగ్‌ బంపర్‌ ఆఫర్‌: మూడు రోజులే!

Published Fri, Jul 21 2023 8:14 PM | Last Updated on Fri, Jul 21 2023 8:48 PM

Ola S1 Air teaser video ceo Bhavish Agarwal offer check details - Sakshi

Ola S1 Air introductory price: దేశీయ అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఓలా  లేటెస్ట్‌ ఓలా S1 ఎయిర్. దీనికి సంబంధించి  ఒక కీలకవిషయాన్ని ఓలా సీఈఓ భవిష్అగర్వాల్ ప్రకటించారు.  పరిచయ ఆఫర్‌గా  10వేల తగ్గింపును  ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు.ఎస్‌1  ఎయిర్‌ జూలై 28- 30 తేదీల  మధ్య కొనుగోలు చేసిన వారికి  ప్రారంభ ధర  రూ. 1,09,999కే లభిస్తుందని పేర్కొన్నారు. 

జూలై 31 తరువాత దీని ధర రూ. 1,19,999గా  ఉంటుదని, అందుకే ఇపుడే మీ  ఎలాఎస్‌1  ఎయిర్‌ను  తక్కువ ధరకే రిజర్వ్ చేసుకోమ్మని సూచించారు. అలాగే S1ఎయిర్ డెలివరీ ఆగస్టు ప్రారంభంలో ప్రారంభమవు తుందని  చెప్పారు. 500,000 కి.మీ వరకు పరీక్షించామని కూడా ఆయన వెల్లడించారు. గత రెండు నెలలుగా వ్యక్తిగతంగా ఎస్‌1 ఎయిర్‌ని చాలా ఎక్కువగా నడిపాను.. ఇది నిజంగా అద్భుతమైన స్కూటర్  అతి త్వరలో వస్తుందిన ట్వీట్‌ చేశారు.  

ఓలా నుంచి అత్యంత చవకైన మోడల్ ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ జూలై నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని గతంలో ప్రకటించారు.  999   రూపాయల  వద్ద ఈ స్కూటర్ కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రధానంగా FAME సబ్సిడీ  కేంద్ర ప్రభుత్వం సవరించిన నేపథ్యంలో రూ.1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.  3 kWh బ్యాటరీతో లాంచ్‌ అయిన ఎస్‌1  ఎయిర్‌  పూర్తి ఛార్జ్‌పై 125 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. అలాగే గరిష్ఠంగా గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement