
మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ ఎంత ఫిట్‌గా ఉంటాడో, అంతే ఫిట్‌గా ఉంటాడు ఈ శత వృద్ధుడు. పేరు విన్సెంట్ డ్రాన్స్‌ఫీల్ట్. అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటాడితను. చూడటానికి అరవై, డెభై ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ, నిజానికి ఇతని వయసు 109 సంవత్సరాలు. ఇప్పటికీ కారు నడుపుతాడు. కళ్లజోడు లేకుండానే న్యూస్ పేపర్ చదువుతాడు. చేతికర్ర లేకుండానే ట్రాఫిక్‌లో వెళ్లి ఇంటికి అవసరమైన వస్తువులు, సరుకులు తీసుకొస్తాడు. తన వ్యక్తిగత పనులన్నీ తానే స్వయంగా చేసుకుంటాడు. అప్పుడప్పుడు ఇంటి పనుల్లోనూ సహాయం చేస్తుంటాడు.
ఈ వయసులోనూ ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏమిటని అడగ్గా.. విన్స్ ఏడుగురు మనవరాళ్లలో ఒకరు ఇలా అన్నారు: ‘విన్స్ 21 ఏళ్ల వయసులో అగ్నిమాపక సహాయ కేంద్రంలో ఉద్యోగంలో చేరి, ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. దాదాపు 80 యేళ్ల పాటు అదే ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు. వారి దీవెనలే అతన్ని ఆరోగ్యంగా ఉంచాయి’. ఇదే విషయాన్ని అతని ఒక్కగానొక్క కూతురు, ముగ్గురు మనవళ్లు, ఏడుగురు మనవరాళ్లు కూడా న మ్ముతున్నారు. విన్స్ మాత్రం తన ఆరోగ్య రహస్యం రోజూ ఒక గ్లాసు పాలు తాగడం, శరీరాన్ని నిరంతరం కదిలించడమే అని అంటున్నాడు.
చదవండి: చెరువులో వింత జీవి.. వామ్మో ఇరవై నాలుగు కళ్లు..
Comments
Please login to add a commentAdd a comment