drives
-
13 గంటలు ఆటోలో ఊరంతా తిరిగి.. డ్రైవర్ డబ్బులు అడిగేసరికి..
ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ పరిధిలోని సైబర్ సిటీలో ఒక మహిళ హల్చల్ చేసింది. జ్యోతి అనే ఈ మహిళ మేదాంత హాస్పిటల్ సమీపంలో ఒక ఆటోను రాత్రి 10 గంటల సమయంలో బుక్ చేసుకుంది. మర్నాటి ఉదయం 11 గంటల వరకూ అదే ఆటోలో పలుచోట్ల తిరిగింది. ఈ సమయంలో ఆటోవాలా ఆమెను ఎక్కడకు వెళ్లాలో సరిగ్గా చెప్పండి.. లేదంటే డబ్బులిచ్చి, ఆటో దిగిపోండి అని అన్నాడు. ఆటో డ్రైవర్ దీపక్ డబ్బులు అడగగానే ఆమె నానా హంగామా చేసింది. డబ్బులడిగితే తప్పుడు కేసులు పెడతానని బెదిరించింది. దీంతో ఈ విషయమై ఆటో డ్రైవర్ గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ ఆమె వాగ్వాదానికి దిగింది. ఆటో డ్రైవర్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఒక యాప్ ద్వారా గత రాత్రి ఆమె ఆటో బుక్ చేసుకున్నదని, ఉదయం 11 గంటల వరకూ ఆటోలో ఇటునటు తిప్పాలని కోరిందన్నాడు. తరువాత ఆటో బిల్లు వెయ్యి రూపాయలు అయ్యిందని చెప్పగానే, ముందు పేటీఎం చేస్తానని చెప్పిందని, తరువాత గొడవకు దిగిందని తెలిపాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి.. -
తప్పతాగి.. రైల్వే ట్రాక్‌పై కారు నడిపి..
తిరువనంతపురం: పీకలదాక తాగి రైల్వే ట్రాక్‌పై కారును నడిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితున్ని జయప్రకాశ్‌గా గుర్తించారు. కేరళ, కన్నూర్ సమీపంలోని అంచరకండిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా చొవ్వ రైల్వే క్రాస్ దగ్గర ట్రాక్‌పై ఉన్న నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. జయప్రకాశ్ మద్యం మత్తులో ఇంటికి వెళుతున్నారు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్‌పైకి కారును పోనిచ్చాడు. మత్తులో ఉన్న కారణంగా ట్రాక్‌ను నిందితుడు రోడ్డుగా భ్రమపడినట్లు తెలుస్తోంది. దాదాపు 15 మీటర్ల దూరం పోగానే ట్రాక్‌పై కారు ఇరుక్కుని నిల్చిపోయింది. ఈ విషయాన్ని గమనించిన గేట్ కీపర్ పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో కారును ట్రాక్‌పై నుంచి బయటకు తీశారు. జయప్రకాశ్‌ను అరెస్టు చేశారు. ఆ సయమంలో ఎలాంటి రైలు రానుందున ముప్పు తప్పిందని తెలిపారు. ఇదీ చదవండి: Where Snakes Given As Dowry: వామ్మో..! అల్లుళ్లకు కట్నంగా 21 పాములు.. -
మానవత్వం మరచిన అంబులెన్స్ డైవర్లు!
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో బీహార్‌లోని మోతిహర జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు. జిల్లాకు చెందిన పలువురు గాయాలపాలయ్యారు. కాగా మృతుడు చికనీ గ్రామానికి చెందిన భూలన్ పటేల్ పెద్ద కుమారుడు రాజా కుమార్ అని చెబుతున్నారు. మృతుడు పెయింటింగ్ పనులు చేస్తుంటాడని, ఈ పనుల కోసమే వేరే ప్రాంతం వెళ్లాడని సమాచారం. ఇదే గ్రామానికి చెందిన 9మంది రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరు స్వయంగా ఫోను చేసి, కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. కాగా రాజా కుమార్ మరణవార్త తెలియగానే గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుని తల్లి, భార్యల రోదనలు మిన్నంటాయి. రాజా కుమార్‌కు రెండు సంవత్సరాల క్రితమే వివాహమయ్యింది. ఆ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే రాజా కుమార్ మృతదేహం ఇంకా గ్రామానికి చేరుకోలేదు. మృతదేహాన్ని గ్రామం వరకూ తీసుకురావాలంటే అంబులెన్స్ డ్రైవర్ రూ. 45 వేలు అడుగుతున్నాడని మృతుని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజా కుమార్ తల్లి మాట్లాడుతూ తమ కుటుంబ బాధ్యత రాజానే చూసుకుంటున్నాడని తెలిపారు. కేరళలో పని చేస్తూ తమ కుటుంబాన్ని పోషిస్తున్నాడన్నారు. రూ. 45 వేలు చెల్లించి కుమారుని మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చేంతటి స్థోమత తమకు లేదని ఆమె వాపోయింది. మృతుని తండ్రి భవన్ పటేల్ మాట్లాడుతూ తమ కుమారుని మృతదేహన్ని ఇక్కడికి తీసుకువచ్చేందుకు గ్రామస్తులు చందాలు సేకరిస్తున్నారన్నారు. ఒడిశాలో జరిగిన ఈ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య తాజాగా 288కి చేరింది. 900 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయని సమాచారం. స్థానికంగా ఉన్న పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనావేస్తున్నారు. కాగా ఎన్డీఆర్ఎఫ్, రైల్వే, ఇతర శాఖల సిబ్బంది క్రేన్లు, బుల్డోజర్లు, గ్యాస్ కట్టర్ల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి గురైన రెండు రైళ్ల ఇంజిన్ డ్రైవర్లు, గార్డులకు తీవ్ర గాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నట్టు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ ఘటనలో గూడ్స్ రైలు డ్రైవర్, గార్డుకు ఎటువంటి గాయాలు కాకపోవడం విశేషం. -
109 ఏళ్లలోనూ మిస్టర్ పర్ఫెక్ట్..‘వావ్ తాత, ఏం ఆ ఎనర్జీ’
మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ ఎంత ఫిట్‌గా ఉంటాడో, అంతే ఫిట్‌గా ఉంటాడు ఈ శత వృద్ధుడు. పేరు విన్సెంట్ డ్రాన్స్ఫీల్ట్. అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటాడితను. చూడటానికి అరవై, డెభై ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ, నిజానికి ఇతని వయసు 109 సంవత్సరాలు. ఇప్పటికీ కారు నడుపుతాడు. కళ్లజోడు లేకుండానే న్యూస్ పేపర్ చదువుతాడు. చేతికర్ర లేకుండానే ట్రాఫిక్‌లో వెళ్లి ఇంటికి అవసరమైన వస్తువులు, సరుకులు తీసుకొస్తాడు. తన వ్యక్తిగత పనులన్నీ తానే స్వయంగా చేసుకుంటాడు. అప్పుడప్పుడు ఇంటి పనుల్లోనూ సహాయం చేస్తుంటాడు. ఈ వయసులోనూ ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏమిటని అడగ్గా.. విన్స్ ఏడుగురు మనవరాళ్లలో ఒకరు ఇలా అన్నారు: ‘విన్స్ 21 ఏళ్ల వయసులో అగ్నిమాపక సహాయ కేంద్రంలో ఉద్యోగంలో చేరి, ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. దాదాపు 80 యేళ్ల పాటు అదే ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు. వారి దీవెనలే అతన్ని ఆరోగ్యంగా ఉంచాయి’. ఇదే విషయాన్ని అతని ఒక్కగానొక్క కూతురు, ముగ్గురు మనవళ్లు, ఏడుగురు మనవరాళ్లు కూడా న మ్ముతున్నారు. విన్స్ మాత్రం తన ఆరోగ్య రహస్యం రోజూ ఒక గ్లాసు పాలు తాగడం, శరీరాన్ని నిరంతరం కదిలించడమే అని అంటున్నాడు. చదవండి: చెరువులో వింత జీవి.. వామ్మో ఇరవై నాలుగు కళ్లు.. -
ఆర్టీసీ బస్సు నడిపిన మాజీ మంత్రి కొడాలి నాని.. వీడియో వైరల్
సాక్షి, కృష్ణా: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆర్టీసీ డ్రైవర్‌గా మారారు. గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో అయిదు అద్దె బస్సులను కొడాలి నాని ప్రారంభించారు. ఈ నూతన పల్లె వెలుగు బస్సు సర్వీసులు గుడివాడ నుంచి బంటుమిల్లి, కైకలూరు తిరగనున్నాయి. అనంతరం గుడివాడ పట్టణ ప్రధాన రహదారుల్లో మాజీ మంత్రి కొడాలి నాని పల్లె వెలుగు బస్సును స్వయంగా నడిపారు. ఏదో ఫోటోలు.. వీడియోల కోసం ఫోజులు ఇవ్వడం కాకుండా.. స్టీరింగ్ పట్టి సుమారు 10 కిలోమీటర్ల దూరం బస్సును ట్రాఫిక్‌లో సునాయాసంగా నడిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుడివాడ బస్టాండ్‌లో నూతనంగా ప్రారంభించబడుతున్న బస్సులను పట్టణంలో ప్రధాన రహదారిపై నడిపిన ఎమ్మెల్యే కొడాలి నాని...👌👌👍@IamKodaliNani #FFF pic.twitter.com/Cz8I6Wyuym — వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (@nenerajun) February 16, 2023 ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దళిత వర్గాల శ్రేయస్సుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. S.M E స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద వారికి బస్సులు మంజూరు కావడంతో సంతోషంగా ఉందన్నారు. దళిత సోదరులు ఏర్పాటు చేసుకున్న బస్సులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దళితులతో పాటూ అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. చదవండి: ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి.. -
ట్రెండ్ సెట్ చేసిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్
కోల్‌కతా : పెళ్లి తర్వాత అమ్మాయిని అత్తారింటికి పంపే అప్పగింతల కార్యక్రమం ఎంతో ఉద్వేగభరితమైంది. పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్లే ఘట్టం ప్రతీ అమ్మాయి జీవితంలో ఎంతో మరుపురానిది. అయితే ఈ సాంప్రదాయాన్ని మరింత స్పెషల్‌గా మార్చాలనుకుంది ఓ వధువు. కోల్‌కతాకు చెందిన స్నేహ సింఘీ(28) అనే యంగ్ బిజినెస్ ఉమెన్...ఇటీవలె సౌగత్ ఉపాధ్యాయ అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే అందరి అమ్మాయిల్లానే అప్పగింతల కార్యక్రమంలో తల్లిదండ్రులను విడిచి వెళ్లేటప్పుడు ఎంతో భావోధ్వేగానికి లోనైంది. వారికి బై..బై చెబుతూ అక్కడి నుంచి కదిలింది. వరుడిని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని తానే స్వయంగా కారు నడుపుతూ అత్తారింటికి బయల్దేరింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, కొద్ది గంటల్లోనే ఇది వైరల్‌గా మారింది. పెళ్లి దుస్తుల్లోనే స్టీరింగ్ పట్టుకున్న వధువు స్నేహను పలువురు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పెళ్లికూతురు ట్రెండ్ సెట్ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ కొత్త సాంప్రదాయానికి తెరతీయడంపై వధువు స్నేహ సింఘీ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత నేనే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ అత్తారింటికి వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. పెళ్లికి నెల కిందట సౌగత్‌ను అడగితే,అతను ఈ ఐడియా చాలా బావుందని చెప్పాడు. అంతేకాకుండా సౌగత్ తల్లి కూడా ఇందుకు వెంటనే అంగీకరించింది. దీంతో నా కల నెలవేరింది. అని స్నేహ సంతోషం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Sneha Singhi Upadhaya (@snehasinghi1) చదవండి : తొలి రాత్రే షాకిచ్చిన వధువు: రాడ్‌తో భర్తను కొట్టి.. ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. భారీ పార్శిల్ -
క్లీనర్ నడపడంవల్లే...
-
క్లీనర్ నడపడంవల్లే...
ప్రమాదసమయంలో తాను లారీలో లేనంటున్న డ్రైవర్ అయినా యజమాని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు లారీ యజమాని టీడీపీ నేతకు స్వయానా సోదరుడు పెనుకొండ: పెనుకొండ రైలుప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూసింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ బాషా తప్పించుకున్నారని, నిద్రపోతున్న క్లీనర్ నాగరాజు చనిపోయారని పోలీసులు సోమవారం ఉదయం తెలిపారు. కానీ రాత్రికి కొత్త కోణం వెలుగు చూసింది. ప్రమాద ఘటనలో తాను లేనని, అయినా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని డ్రైవర్ బాషా వెల్లడించారు. ఆయన అడ్వకేట్ సహాయంతో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) ముందు లొంగిపోయేందుకు వచ్చారు. అయితే కే సు తమ పరిధిలోకి రాదని డీఎల్ఎస్ఏ చెప్పడంతో తిరిగి రైల్వే ఎస్పీని కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా బాషా కోర్టు ఆవరణలో మీడియా సిబ్బందికి ప్రమాదం జరిగిన తీరును వివరించారు. కాఫీ తాగేందుకు లారీని ఓ చోట ఆపామని, అప్పుడు క్లీనర్ నాగరాజు లారీని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడని చెప్పారు. తాను వెనకే వస్తున్న మరో లారీ ఎక్కి 20 నిమిషాల తర్వాత బయలుదేరానని తెలిపారు. తాము రైల్వేక్రాసింగ్ వద్దకు వచ్చేసరికి ప్రమాదం జరిగిందని, వెంటనే ఈ విషయాన్ని లారీ యజమాని వెంకటసుబ్బయ్యకు ఫోన్‌చేసి చెప్పామని తెలిపారు. అక్కడి నుండి వచ్చేయాలని యజమాని సూచించారని చెప్పారు. ప్రమాదానికి గురైన లారీని డ్రైవ్ చేస్తున్న నాగరాజుకు లెసైన్సు లేకపోవడంతో, డ్రైవ్ చేసినట్లు ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. అయితే బాషా మాటలను రైల్వే డీఎస్పీ మధు కొట్టిపడేశారు. ‘‘లారీలో ఖచ్చితంగా డ్రైవర్ బాషా ఉన్నారు. ప్రమాదంలో చనిపోయిన క్లీనర్ నాగరాజుపైకి నెడితే అతను చనిపోయాడు కాబట్టి కేసు ఉండదు. అందువల్లే తాను లేనని బాషా చెబుతున్నారు. వాస్తవంగా అతనే డ్రైవింగ్ చేశారు’’అని ‘సాక్షి’తో చెప్పారు. అయితే వేగంగా వస్తున్న లారీలో నుంచి దూకితే డ్రైవర్ బాషాకు దెబ్బలు తగలాలి. అతను మామూలుగా ఉండటం గమనార్హం. మరోవైపు ప్రమాదానికి గురైన లారీ, బాషా ప్రయాణించిన మరోలారీ రెండూ తాడిపత్రికి చెందిన అతికారి వెంకటసుబ్బయ్యకు చెందినవే. ఆయన వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం టీడీపీ నేత అతికారి వెంకటయ్య (ఇతని భార్య జెడ్పీటీసీ సభ్యురాలు)కు స్వయాన సోదరుడు. ప్రమాదానికి గురైన లారీ టాటా 2003 మోడల్ అనీ, ట్యాక్స్, ఎఫ్‌సీ, ఐసీ, పర్మిట్లు సక్రమంగానే ఉన్నాయని డీటీసీ సుందర్ వెల్లడించారు. ఈ లారీలో 17టన్నుల బరువు రవాణా చేసేందుకు అనుమతి ఉండగా... గ్రానైట్ రాయి బరువు 25టన్నులదాకా ఉంటుందని గ్రానైట్ వ్యాపారులు చెబుతున్నారు. అధిక బరువు లోడ్ చేసినందుకూ, లెసైన్స్ లేని వ్యక్తిని డ్రైవరుగా పెట్టుకున్నందుకు లారీ యజమానిపై కేసు నమోదుచేయాల్సి ఉంది. అయితే లారీ యజమాని టీడీపీ నేత అయినందువల్ల డ్రైవర్ బాషాపై కేసు నమోదుచేసి, లారీ యజమానిని కేసునుంచి తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. భయానక దృశ్యం చూడలేకపోయాం పెనుకొండ: బెంగళూరు నుంచి రాయచూరు వెళుతున్నా. 2-20 గంటల ప్రాంతంలో మా ముందు బోగీలో పెద్దశబ్దం వినిపించింది. తేరుకునేలోపే రైలు అటుఇటు కుదుపులకు గురయి నిలచిపోయింది. దిగి చూస్తే పక్క బోగీ ధ్వంసమైన దృశ్యం కనిపించింది. భయానకం దృశ్యం చూడలేకపోయా. - మౌనేష్‌నాయక్, దేవదుర్గ లారీ వేగంతో వచ్చి రైలును ఢీకొంది బెంగళూరు నుంచి నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు 2.20 గంటల ప్రాంతంలో వస్తోండగా గేటు వేసి పచ్చజెండా చేతిలో పట్టుకుని రూం ముందే నిల్చోని ఉన్నాను. ఆ సమయంలో మడకశిర నుంచి లారీ వేగంగా రావడం చూసి గట్టిగా కేకలు వేశా. అంతలోనే రైలు వేగంగా రావడం, లారీ గేటును, రైలును ఢీకొనడం క్షణాల్లో జరిగిపోయాయి. - తిమ్మయ్య, రైల్వే గేట్మెన్, షీఫారం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశాం రైలులో పెద్ద శబ్దం వచ్చి ఆగిపోయింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశాం. పోలీసులు రైలు వద్దకు వచ్చాక ప్రమాదం గురించి తెలుసుకున్నాను. - గంగప్ప, దేవదుర్గ -
పేలిన టపాసులు