
సాక్షి, కృష్ణా: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆర్టీసీ డ్రైవర్‌గా మారారు. గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో అయిదు అద్దె బస్సులను కొడాలి నాని ప్రారంభించారు. ఈ నూతన పల్లె వెలుగు బస్సు సర్వీసులు గుడివాడ నుంచి బంటుమిల్లి, కైకలూరు తిరగనున్నాయి.
అనంతరం గుడివాడ పట్టణ ప్రధాన రహదారుల్లో మాజీ మంత్రి కొడాలి నాని పల్లె వెలుగు బస్సును స్వయంగా నడిపారు. ఏదో ఫోటోలు.. వీడియోల కోసం ఫోజులు ఇవ్వడం కాకుండా.. స్టీరింగ్ పట్టి సుమారు 10 కిలోమీటర్ల దూరం బస్సును ట్రాఫిక్‌లో సునాయాసంగా నడిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుడివాడ బస్టాండ్‌లో నూతనంగా ప్రారంభించబడుతున్న బస్సులను పట్టణంలో ప్రధాన రహదారిపై నడిపిన ఎమ్మెల్యే కొడాలి నాని...👌👌👍@IamKodaliNani #FFF pic.twitter.com/Cz8I6Wyuym
— వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (@nenerajun) February 16, 2023
ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దళిత వర్గాల శ్రేయస్సుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. S.M E స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద వారికి బస్సులు మంజూరు కావడంతో సంతోషంగా ఉందన్నారు. దళిత సోదరులు ఏర్పాటు చేసుకున్న బస్సులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దళితులతో పాటూ అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.
చదవండి: ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి..
Comments
Please login to add a commentAdd a comment