‘ప్రజల ప్రతీ అవసరాన్ని తీరుస్తున్న ప్రభుత్వం ఇది’ | Kodali Nani Speech At Gudivada Siddham Sabha | Sakshi
Sakshi News home page

‘ప్రజల ప్రతీ అవసరాన్ని తీరుస్తున్న ప్రభుత్వం ఇది’

Published Mon, Apr 15 2024 7:23 PM | Last Updated on Mon, Apr 15 2024 8:21 PM

Kodali Nani Speech At Gudivada Siddham Sabha - Sakshi

గుడివాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పరిపాలనలో స్కూల్‌కు వెళ్లేటువంటి పిల్లల దగ్గర్నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వా తాతల వరకూ వారికి కావాల్సిన ప్రతీ అవసరాన్ని తీరుస్తూ వచ్చారని, అందుకే సీఎం జగన్‌ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. 

ఈ రోజు(సోమవారం) గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడిన కొడాలి నాని.. మనందరి నమ్మకం మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రశంసించారు. ముందుగా గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం జగన్‌కు స్వాగతం అంటూ కొడాలి నాని ప్రసంగం కొనసాగించారు. 

  • ఈ సిద్ధం సభ నిన్న జరగాల్సినటువంటి సభ ఒకరోజు వాయిదా పడింది 
  • అయినా కూడా ఇంత ఘనంగా సీఎం జగన్‌ దీవించడానికి, ఆశీర్వదించడానికి మీరందరూ రావడం ఆనందంగా ఉంది 
  • ఐదేళ్లపాటు స్కూల్‌ వెళ్లేటువంటి పిల్లల నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వాతాతల వరకూ వారికి కావాల్సిన ప్రతీ అవసరాన్ని తీర్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం.
  • జగనన్న ప్రభుత్వం. గ్రామగ్రామన, వార్డువార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందించాల్సిన ప్రతి సౌకర్యాన్ని నేరుగా మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా ప్రజల ముందుకే పాలన తీసుకొచ్చినటువంటి, గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి.
  • అదేవిధంగా స్కూల్ పిల్లలకు వాళ్లకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య, బట్టలు, పుస్తకాలు, తిండి అన్నీ కూడా ఒక తండ్రి స్థానంలో చూసినటువంటి వ్యక్తి సీఎం జగన్‌.
  •  అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమంది నిరుపేదల ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఆయన చూపించినటువంటి దారి కన్నా నాలుగు అడుగులు ముందుకు వేసిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌
  •  ఈరోజు గన్నవరం నుంచి గుడివాడ వస్తుంటే అనేకమంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్కసారి ఆయనకు కనుక చూపించినట్లైతే దానికి ఎంత ఖర్చయినా ఆయన పరిష్కారం చూపిస్తారని చెప్పి కొండంత ఆశతో ట్రీట్ మెంట్ జరుగుతున్నటువంటి పిల్లలను కూడా తీసుకువచ్చి రోడ్డు మీద ఆయనకు చూపించాలనే ఉద్దేశ్యంతో, అంత నమ్మకం పెట్టుకుని చూపిస్తున్నారంటే ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్న నమ్మకం. 
  • అదేవిధంగా సీఎం జగన్‌ను ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు ఒక కూటమి కట్టాడు మాయా కూటమి. ఆయన వదిన పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిని చేశాడు, 
  • అదేవిధంగా ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌ని పక్కన  పెట్టుకున్నాడు, ఒక ఉత్త పుత్రుడ్ని ఓ పక్కన పెట్టుకున్నాడు. 
  • వీళ్లందర్నీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక,
  • జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేక చవటల్లాగా, దద్దమ్మల్లాగా వెనుక నుంచి జగన్ మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడ నుంచి తొలగించాలనే ఉద్దేశ్యంతో మొన్న అర్థరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. 
  •  అన్నా మీరు నమ్మే ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి 
  • కాబట్టే మీకు ఒక అంగుళం పక్కకు జరగలేదు, ఒక అంగుళం కిందకు జరగలేదు. మీకు బలమైనటువంటి నుదటిమీద తగిలినా ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. 
  • ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు కాదు కదా వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ వెంట్రుక ముక్క కూడా పీకలేడు. 
  • మీ దమ్ము, మీ ధైర్యం మీకు ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులం. మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు. మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది. ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక్క చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి 
  • 5 సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూశాం. 
  • ఒక్క చిన్న అబద్ధం చెప్పండన్నా అని బ్రతిమాలినా కూడా ఆయనతో అబద్ధం చెప్పించలేం. 
  • ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం, క్యారెక్టర్ కోసం రాజశేఖర్‌రెడ్డి గారు  చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా ముఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వ్యక్తి వైఎస్‌ జగన్‌.
  • జగనన్నకు ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి పట్టం కట్టాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు మీ రెండు ఓటులను ఫ్యాన్ గుర్తు మీద వేసి విజయాన్ని అందించాలని చెప్పి ఈ దుర్మార్గుడైనటువంటి, దొంగైనటువంటి, 420 అయినటువంటి, ఛీటర్‌ అయినటువంటి  వెన్నుపోటుదారుడైనటువంటి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి. 
  • చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్నా.. జగన్‌మోహన్‌రెడ్డి నీ కథ తేలుస్తానని అంటున్నాడు
  • చంద్రబాబు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు.
  • జగన్‌ అంతు తేల్చాలంటే నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి. 
  • దేవుడు, ప్రజల ఆశీస్సులు ఉన్నటువంటి సీఎం జగన్‌ను అందరూ దీవించాలని, మీ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్‌ గుర్తుపై వేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంట్‌ సభ్యుడ్ని, శాసన సభ్యుడ్ని గెలిపించి.. జగనన్నకు మేమంతా ఉన్నాం.. మీ వెనుకే ఉన్నాం అనే మెసెజ్‌ ఇవ్వాలని ప్రజల్ని కోరుతున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement