![Minister Kodali Nani Thanked CM YS Jagan for Naming New District as NTR - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/29/Nani.jpg.webp?itok=gCOmtKHP)
సాక్షి, గుడివాడ: పాదయాత్రలో ఇచ్చని హామీ ప్రకారం కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నాని పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇది హర్షించదగిన విషయం. ఎన్టీఆర్ అభిమానుల తరపున సీఎం జగన్‌కు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు.
అయితే కొందరు టీడీపీ నేతలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నారు. దీనినిబట్టి ఎన్టీఆర్‌పై వారు ఎంత ద్వేషంతో ఉన్నారో ఇప్పుడే అర్థమవుతోంది. ప్రతిపక్షం ఎప్పుడూ కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. అయితే చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.
చదవండి: (రైల్వే శాఖ కొత్త నిబంధనలు.. రైళ్లలో గీత దాటితే జైలుపాలే..)
Comments
Please login to add a commentAdd a comment