thanked
-
జర్నలిస్టులకు సుప్రీంకోర్టు తీపికబురు.. మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు హైదరాబాద్‌లో ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ జర్నలిస్టు సంఘం దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరించినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వం పాత్రికేయ మిత్రులకు తమ వాగ్ధానాన్ని నెరవేర్చడంలో సహాయపడుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. చదవండి: జర్నలిస్టులకు గుడ్‌న్యూస్.. ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ తెలంగాణ జర్నలిస్టుల నివాసాల కోసం సుప్రీంకోర్టులో ఈ కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ లు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల కోసం.. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసును పరిష్కరించినందుకుగాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి ద్వారా అందిన తీపి కబురు అని అల్లం నారాయణ అన్నారు. అలాగే, జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో కృషి చేసి, చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. I would like to extend my gratitude to the Hon’ble Supreme Court & CJI Garu for clearing the long-standing demand of Telangana journalist society on house site allotments This will help Telangana Govt deliver on our promise to our Journalist friends 👍 — KTR (@KTRTRS) August 25, 2022 -
వారి తరపున సీఎం జగన్‌కు పాదాభివందనం: మంత్రి కొడాలి నాని
సాక్షి, గుడివాడ: పాదయాత్రలో ఇచ్చని హామీ ప్రకారం కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నాని పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇది హర్షించదగిన విషయం. ఎన్టీఆర్ అభిమానుల తరపున సీఎం జగన్‌కు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు. అయితే కొందరు టీడీపీ నేతలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నారు. దీనినిబట్టి ఎన్టీఆర్‌పై వారు ఎంత ద్వేషంతో ఉన్నారో ఇప్పుడే అర్థమవుతోంది. ప్రతిపక్షం ఎప్పుడూ కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. అయితే చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చదవండి: (రైల్వే శాఖ కొత్త నిబంధనలు.. రైళ్లలో గీత దాటితే జైలుపాలే..) -
ఏపీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ సిబ్బంది
-
ఓటర్లకు సోనియా కృతజ్ఞతలు
రాయ్‌బరేలీ: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ రాయ్‌బరేలీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఆమె రాయ్‌బరేలీ వెళ్లారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి తనను ఎన్నుకున్న ప్రజలకు సోనియా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రానున్న ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవద్దని కార్యకర్తలు సోనియాను కోరినట్లు కాంగ్రెస్ నేత సంజయ్ సిన్హ్ తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సొంత నియోజకవర్గంలో సోనియా పర్యటించడం ఇదే ప్రథమం. -
బుర్జ్ ఖలీఫాపై ఆమె చిత్రాన్ని ప్రదర్శించారు!
సాక్షి, వెల్లింగ్టన్: యూఏఈ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన తమ కట్టడం బుర్జ్ ఖలీఫాపై న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డర్న్ చిత్రాన్ని ప్రదర్శించింది. ఈ నెల 15న న్యూజిలాండ్‌లోని రెండు మసీదులపై శ్వేత జాతీయుడు కాల్పులు జరిపినప్పుడు తక్షణమే స్పందించి, అక్కడి ముస్లింలకు అండగా నిలబడినందుకు కృతజ్ఞతగా యూఏఈ ప్రభుత్వం ఆమె చిత్రాన్ని బుర్జ్పై ప్రదర్శించింది. న్యూజిలాండ్ జరిగిన ఆ కాల్పుల్లో ఐదుగురు భారతీయులు కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అలీ మక్తమ్ ముస్లింలకు బాసటగా నిలిచిన జసింగా ఆర్డర్న్‌కు ధన్యవాదాలు తెలుపుతూ బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించిన ఆమె ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. న్యూజిలాండ్‌లో జరిగిన దాడితో మొత్తం ముస్లిం సమాజం భయాందోళనలకు గురైందని.. సరైన సమయంలో బాధితులకు భరోసాగా నిలిచిన జసిండా 1.5 బిలియన్ల ముస్లింల మనసులను గెలుచుకున్నారనేది ఆయన ప్రశంసించారు. ఈ ట్వీట్‌కు జసిండా బదులిస్తూ.. ‘న్యూజిలాండ్‌లో పుట్టకపోయినా, ఈ ప్రాంతంలో జీవించడానికి నిర్ణయించుకొని వలస వచ్చిన వారికి రక్షణ కల్పించే బాధ్యత మా మీదే ఉంది. తమ సంస్కృతీ, సంప్రదాయాలను స్వేచ్ఛగా పాటించే హక్కు ఇక్కడ నివసిస్తున్న వలస ప్రజలకూ ఉంది. అలాంటి వారికి మేం అండగా ఉంటాం’ అని తెలిపారు. మార్చి 15న జరిగిన కాల్పుల నుంచి న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌తోపాటు, పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టు తృటిలో తప్పించుకున్నాయి. రెండు జట్ల మధ్య జరగాల్సిన మూడో టెస్ట్ రద్దు చేసి, బంగ్లా టీమ్‌ను వెంటనే స్వదేశానికి పంపే ఏర్పాట్లను చేసింది అక్కడి ప్రభుత్వం. కాల్పులకు తెగబడ్డ వ్యక్తి బ్రెండన్ టరెంట్ (28)ను ఆస్ట్రేలియన్‌గా భావిస్తున్నారు. ఏప్రిల్ 5న టరెంట్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. -
హర్తాళ్ విజయవంతంపై వైఎస్ జగన్ కృతజ్ఞతలు
హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దు చేయడం మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైనందకు గాను సోమవారం నిర్వహించిన హర్తాళ్ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హర్తాళ్‌ను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలు, సామాజిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, రాజకీయ పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.