సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు హైదరాబాద్‌లో ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ జర్నలిస్టు సంఘం దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరించినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వం పాత్రికేయ మిత్రులకు తమ వాగ్ధానాన్ని నెరవేర్చడంలో సహాయపడుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
చదవండి: జర్నలిస్టులకు గుడ్‌న్యూస్.. ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్
తెలంగాణ జర్నలిస్టుల నివాసాల కోసం సుప్రీంకోర్టులో ఈ కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ లు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ జర్నలిస్టుల కోసం.. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసును పరిష్కరించినందుకుగాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి ద్వారా అందిన తీపి కబురు అని అల్లం నారాయణ అన్నారు. అలాగే, జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో కృషి చేసి, చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
I would like to extend my gratitude to the Hon’ble Supreme Court & CJI Garu for clearing the long-standing demand of Telangana journalist society on house site allotments
— KTR (@KTRTRS) August 25, 2022
This will help Telangana Govt deliver on our promise to our Journalist friends 👍
Comments
Please login to add a commentAdd a comment