సాక్షి, కృష్ణా: ఎన్నికల సంగ్రామంలో తనపై చంద్రబాబు, బీజేపీ, దత్తపుత్రుడు దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన.. కురుక్షేత్రంలో కౌరవులు నెగ్గినట్లు కాదని అన్నారు. వైఎస్ జగన్‌పై ఒకరాయి వేసినంత మాత్రన.. మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈ స్థాయికి వారు దిగజారారు అంటే మనం(వైఎస్సార్‌సీపీ) విజయానికి అంత చేరువగా ఉన్నామని అర్థమన్నారు. వీళ్ల కుట్రలకు మీ బిడ్డ అదరడు, బెదరడని..ఇలాంటి దాడులతో తన సంకల్పం చెదరదని తెలిపారు.
వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మంగళవారం కృష్ణా జిల్లాలో సాగుతోంది. గుడివాడ సమీపంలో నాగవరప్పాడు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గుడివాడలో మహా సముద్రం కనిపిస్తుందన్నారు. మే 13న జరగబోతున్న ఎన్నికల మహా సంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజల సముద్రం ఇదని తెలిపారు.
ఇంటింటి అభివృద్ధి కోసం 130సార్లు బటన్ నొక్కామన్న సీఎం జగన్..2 లక్షల 70 వేల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాల్లో వేశామని తెలిపారు. పేదల భవిష్యతు కోసం, పథకాల కొనసాగింపు కోసం పెత్తందారులతో యుద్ధానికి మీరంతా సిద్దమా? అని ప్రశ్నించారు. ఒక్క జగన్‌పై ఎంతమంది దాడి చేస్తున్నారో మీరు చూస్తున్నారని అన్నారు. అబద్దాలు, కుట్రలు, మోసాలతో ప్రతిపక్ష నేతలంతా ఒక్కటయ్యారు.
సీఎం జగన్ కామెంట్స్
- నా నుదుటి మీద వారు చేసిన గాయం. నా సంకల్పాన్ని మరింత పెంచింది.
- ఆ దేవుడు నాస్క్రిప్ట్ పెద్దగా రాశారు.
- పేదలకు ఏ మంచీ చేయొద్దన్నది కూటమి నాయకుడు చంద్రబాబు ఫిలాసఫీ
- రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొదన్ని చంద్రబాబు అన్నారు
- కిలో బియ్యం 2 రూ ఇవ్వొద్దని ఎన్టీఆర్‌ను గద్దె దింపింది చంద్రబాబే.
- స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం వద్దంటూ ప్రభుత్వ బడులను పాడుబెట్టింది చంద్రబాబే
- ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది చంద్రబాబే.
- విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని అన్నది చంద్రబాబే .
- ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి. అతనిపై చెప్పులు వేయించింది చంద్రబాబే
ప్రతీగ్రామంలో జగన్ మార్క్ కనిపిస్తుంది.
- దోచుకోవడం, దోచుకున్నది దాడుకోవడం ఇదీ చంద్రబాబుకు తెలిసిన నీతి.
- చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే.
- దేశంలోనే ఎక్కడా లేని విధంగా అవ్వాతాతలకు 3 వేల పెన్షన్ ఇస్తున్నాం.
- ఇంటి వద్దకే రేషన్ , 600 రకాల సేవలు ఇస్తున్నాం.
- లంచాలు, వివక్ష లేకుండా అందిస్తున్నాం.
- విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.
- ప్రతీగ్రామంలో మనం ఏర్పాటు చేసిన 7 వ్యవస్థలు కనిపిస్తాయి.
- ప్రతీగ్రామంలో జగన్ మార్క్ కనిపిస్తుంది.
- చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలనుదోచుకున్నారు.
- చంద్రబాబు మార్కు అంటే పచ్చ పాముల కాటు
58 నెలల్లో అనేక రంగాల్లో విప్లవాలు తీసుకొచ్చాం
- నాడు-నేడు ద్వారా వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చాం.
- 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి.
- ఆరోగ్యశ్రీ కార్డుతో 25 లక్షల మేర ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తున్నాం.
- ఆపరేషన్ అయ్యాక విశ్రాంతి సమయంలోనూ ఆదుకుంటున్నాం.
- ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చాం.
- 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించాం.
- చంద్రబాబు పేరు చెబితే శిథిమైన బడులు గుర్తుకొస్తాయి.
- మనం చేసిన మార్పులతో పెత్తందార్ల కడుపు మండుతోంది.
- వసతిదీవెన, విద్యా దీవెన, టోఫెల్ శిక్షణ అందిస్తున్నాం.
- 54 వేల నియామకాలు చేపట్టాం.
- 58 నెలల కాలంలో చదువుల విప్లవం తీసుకొచ్చాం.
- జగనన్న చేదోడు, వాహనమిత్ర అంటే మీ జగన్.
- లా నేస్తం అంటే మీ జగన్.
- 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం.
- 80 శాతం ఉద్యోగాలు, బీసీ,ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు ఇచ్చాం.
- 13 జిల్లాలను 25 జిలాలుచేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేశాం.
- మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?
- ముగ్గురి ఫొటోలతో ఉన్న హీమీల పత్రాలను ఇంటింటికి పంపారు.
- ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?.
- పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తా అన్నాడు.. చేశాడా?అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు ఇచ్చాడా?
- రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా?
- ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?
- ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తా అన్నాడు.. ఇచ్చాడా?
- నా నుదుటిపై చేసిన గాయం 10 రోజుల్లో తగ్గిపోతుంది.
- పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు మానవు
- మోసం చేయడం బాబు నైజం.. మంచి చేయడం మీ బిడ్డ నైజం
Comments
Please login to add a commentAdd a comment