Kodali Nani Challenges TDP Chandrababu On Contest In Gudivada - Sakshi
Sakshi News home page

చంద్రబాబును మించిన సైకో మరోకరు లేరు: కొడాలి నాని ఫైర్‌

Published Mon, Nov 21 2022 3:03 PM | Last Updated on Mon, Nov 21 2022 4:19 PM

Kodali Nani Challenges TDP Chandrababu On Contest In Gudivada - Sakshi

సాక్షి, కృష్ణా: సినిమా షూటింగ్స్‌ మాదిరిగా చంద్రబాబు జిల్లాల పర్యటనలు జరగుతున్నాయి. చంద్రబాబుకే కాదు, టీడీపీకి కూడా ఇవే చివరి ఎన్నికలు. చంద్రబాబును మించిన సైకో మరోకరు లేరు అంటూ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 

కాగా, కొడాలి నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల పర్యటనల్లో టీడీపీ కార్యకర్తలను ప్రజలుగా భావిస్తూ చంద్రబాబు అభివాదాలు చేస్తున్నాడు. చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరు. కర్నూలులో హైకోర్టు గురించి న్యాయవాదులు ప్రశ్నిస్తే గుడ్డలూడదీసి కొడతా అని చంద్రబాబు అంటున్నాడు. 2024 ఎన్నికల తర్వాత ఇదేం కర్మరా అని చంద్రబాబు, లోకేష్ అనుకుంటారు. చంద్రబాబు పర్యటనలకు ముందుగానే పార్టీ కార్యకర్తలను జిల్లాలకు తరలిస్తున్నారు. 

చంద్రబాబు సీఎం కాకపోతే ప్రజలకు పోయేది ఏముంది. బ్రతికున్నంతకాలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారు. టీడీపీ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. గుడివాడలో ఎవరికీ భయపడేది లేదు. ఎంతమంది వచ్చినా గుడివాడను ప్రభావితం చేయలేరు. గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా నేను రెడీ. ఆఖరి రక్తపు బొట్టు వరకూ సీఎం వైఎస్ జగన్ వెంటే ఉంటాను అని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement