ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ పరిధిలోని సైబర్ సిటీలో ఒక మహిళ హల్‌చల్ చేసింది. జ్యోతి అనే ఈ మహిళ మేదాంత హాస్పిటల్ సమీపంలో ఒక ఆటోను రాత్రి 10 గంటల సమయంలో బుక్ చేసుకుంది. మర్నాటి ఉదయం 11 గంటల వరకూ అదే ఆటోలో పలుచోట్ల తిరిగింది. ఈ సమయంలో ఆటోవాలా ఆమెను ఎక్కడకు వెళ్లాలో సరిగ్గా చెప్పండి.. లేదంటే డబ్బులిచ్చి, ఆటో దిగిపోండి అని అన్నాడు.
ఆటో డ్రైవర్ దీపక్ డబ్బులు అడగగానే ఆమె నానా హంగామా చేసింది. డబ్బులడిగితే తప్పుడు కేసులు పెడతానని బెదిరించింది. దీంతో ఈ విషయమై ఆటో డ్రైవర్ గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ ఆమె వాగ్వాదానికి దిగింది.
ఆటో డ్రైవర్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఒక యాప్ ద్వారా గత రాత్రి ఆమె ఆటో బుక్ చేసుకున్నదని, ఉదయం 11 గంటల వరకూ ఆటోలో ఇటునటు తిప్పాలని కోరిందన్నాడు. తరువాత ఆటో బిల్లు వెయ్యి రూపాయలు అయ్యిందని చెప్పగానే, ముందు పేటీఎం చేస్తానని చెప్పిందని, తరువాత గొడవకు దిగిందని తెలిపాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: పోలీసు నిర్లక్ష్యంతోనే జాహ్నవి మృతి?.. ఆలస్యంగా ఆధారాలు వెలుగులోకి..
Comments
Please login to add a commentAdd a comment