Under Ground
-
అక్కడే ఆరంభం.. రేపు మరో అద్భుతం ఆవిష్కృతం!
ఢిల్లీ: దేశంలోనే తొలిసారి నీటి అడుగున మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ చారిత్రక ఘట్టానికి కోల్‌కతా(పశ్చిమ బెంగాల్) మెట్రో వేదిక కానుంది. బుధవారం పశ్చిమబెంగాల్లోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గం మెట్రో సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మరి దీని ప్రత్యేకలు ఓసారి చూద్దాం.. ఈస్ట్‌వెస్ట్ మెట్రో కారిడార్‌లో.. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ స్టేషన్ల మధ్య ఈ రివర్ అండర్ గ్రౌండ్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మూడు స్టేషన్లు ఉన్నాయి. హౌరా మైదాన్, హౌరా స్టేషన్ కాంప్లెక్స్, బీబీడీ బాగ్ (మహాకరణ్). హూగ్లీ నదీ కింద భాగంలో కోల్‌కతా నుంచి నదీకి అవతలివైపు హౌరా మధ్య సుమారు 4.8 కిలోమీటర్ల దూరంతో ఈ అండర్‌గ్రౌండ్ ప్రయాణం సాగనుంది. నీటి ఉపరితలం నుంచి 32 మీటర్ల లోతున మెట్రో టన్నెల్ ఏర్పాటు చేయగా.. ప్రయాణానికి 45 సెకన్ల టైం పట్టనుంది. ఈ ఫీట్‌ను మోడ్రన్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా కోల్‌కతా మెట్రో అధికారులు అభివర్ణిస్తున్నారు. ఏడు నెలలపాటు ట్రయల్ రన్స్ జరిపారు. ఇప్పుడు రెగ్యులర్ ప్రయాణాలకు అనుమతికి రెడీ చేశారు. ఈస్ట్‌వెస్ట్ మెట్రో కారిడార్‌కు ఫిబ్రవరి 2009లో పునాది పడింది. అండర్ వాటర్ మార్గం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తుల్ని సైతం తట్టుకునేలా ఈ కారిడార్‌ను బ్రిటన్‌కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మించారు. తాజా అండర్ గ్రౌండ్ ప్రాజెక్టుతో.. రోజూ ఈ మార్గంలో ఏడు లక్షల మంది ప్రయాణిస్తారని కోల్‌కతా మెట్రో రైల్ సీపీఆర్వో అంచనా వేస్తున్నారు ప్రధాని మోదీ మార్చి 6న మెట్రో సర్వీసులను ప్రారంభించగా.. మరుసటి రోజునుంచి ప్రయాణికులను అనుమతిస్తారు ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లకు పైనే పట్టింది. టన్నెల్ నిర్మాణాల వల్ల సమీప ప్రాంతాల్లోని నివాసాలు దెబ్బ తినగా.. అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి. చివరకు.. స్థానికులను ఒప్పించి, పరిహారం చెల్లించి నిర్మాణం పూర్తి చేసింది మెట్రో రైల్ కోల్‌కతా. హౌరా మెట్రో స్టేషన్.. నీటి ఉపరితలానికి 16 మీటర్ల దిగువన మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. తద్వారా భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్‌గా రికార్డుల్లోకి ఎక్కనుంది. దేశంలో తొలిసారి 1984 అక్టోబర్ 24వ తేదీన కోల్‌కతాలోనే మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. సుమారు 3.4 కిలోమీటర్ల దూరంలో ఐదు స్టేషన్లతో తొలి మెట్రో పరుగులు తీసింది నాడు. అదే నగరంలో ఇప్పుడు అద్భుతం ఆవిష్కృతం కానుంది. కోల్‌కతా ఈస్ట్‌వెస్ట్ మెట్రో మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా.. దీంట్లో 10.8 కి.మీ.లు భూగర్భంలో ఉంటుంది. ఇందులో కొంతభాగం హుగ్లీ నది కింద సొరంగంలో ఉండగా.. మిగిలినదంతా భూ ఉపరితలంపైనే. సొరంగం లోపల అడ్డుకొలత 5.55 మీటర్లు కాగా, బాహ్య అడ్డుకొలత 6.1 మీటర్లు. లండన్ప్యారిస్ కారిడార్‌లోని యూరోస్టార్ సర్వీసు మాదిరిగా రూపొందించిన సొరంగమార్గం ఇది. ఈ తరహా మెట్రో రూట్ ద్వారా.. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించినట్లు అవుతుందని మెట్రో అధికారులు అంటున్నారు. India's first underwater metro rail service - Howrah Maidan to Esplanade Metro Station will be inaugurated by PM Modi in Kolkata tomorrow. This will be the Deepest Metro Station and Metro line in India. pic.twitter.com/jRooRVvLMg — Rishi Bagree (@rishibagree) March 5, 2024 -
ఒకప్పుడు అది ఉప్పుగని!
రుమేనియా క్లజ్ కౌంటీలోని టుర్డా నగరంలో ఉన్న భూగర్భ థీమ్‌పార్కు ఒకప్పుడు ఉప్పుగని. పురాతన రోమన్ సామ్రాజ్యంలో సహజమైన ఉప్పు నిక్షేపాలు ఉన్న ఈ చోట 1217లో ఉప్పును వెలికి తీసేందుకు గని తవ్వకాలు మొదలుపెట్టారు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఉప్పు గనుల్లో ఇదొకటి. శతాబ్దాల తరబడి ఇక్కడి నుంచి ఉప్పు సేకరించేవారు. ఇందులోని ఉప్పు నిల్వలు అంతరించిపోయాక చాలాకాలం ఖాళీగా మిగిలింది. పాడుబడిన దశలో ఉన్న ఈ గనిలో 120 మీటర్ల లోతున 2010లో ఒక థీమ్‌పార్కును ఏర్పాటు చేశారు. జెయింట్ వీల్, ఫెర్రీవీల్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్ వంటి క్రీడా వినోదాల కోసం ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి ఈ భూగర్భ థీమ్‌పార్కు పర్యాటక ఆకర్షణగా మారింది. రుమేనియా స్థానికులతో పాటు ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ప్రపంచంలో భూగర్భంలో ఏర్పాటు చేసిన తొలి థీమ్‌పార్కు ఇదే కావడం విశేషం. (చదవండి: తవ్వకాల్లో అరుదైన సమాధి..లోపల దృశ్యం చూసి కంగుతిన్న శాస్త్రవేత్తలు!) -
ఆ ఊళ్లో అడుగుపెట్టాలంటే భయపడాల్సిందే..కనీసం నేలపై నడవాలంటే..
ఆస్ట్రేలియాలోని ఆ ఊళ్లోకి అడుగుపెడితే, పాతాళలోకంలోకి ప్రవేశించినట్లే ఉంటుంది. అక్కడి కట్టడాలన్నీ నేలకు దిగువన నిర్మించుకున్నవే! ఇళ్లు, హోటళ్లు, పబ్బులు, ప్రార్థన మందిరాలు– అన్నీ నేలకు దిగువనే ఉంటాయి. బయటి నుంచి చూస్తే, వాటి పైకప్పులన్నీ చిన్న చిన్న గుట్టల్లా కనిపిస్తాయి. అక్కడ నేల మీద నడవాలంటే, ఆచి తూచి అడుగులేయాలి. ఎందుకంటే అడుగడుగునా గోతులు ఉంటాయి. ఆ గోతులకు రక్షణగా ఎలాంటి కంచెలు ఉండవు. కాకుంటే, అక్కడక్కడా ఆచి తూచి నడవాలనే హెచ్చిరిక బోర్డులు కనిపిస్తాయి. ఈ విచిత్రమైన ఊరు దక్షిణ ఆస్ట్రేలియాలో అడిలాయిడ్ నగరానికి వాయవ్యాన 846 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరి పేరు కూబర్ పెడీ. పాతాళ గృహాలు మాత్రమే కాదు, ఈ ఊరికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది ‘ఓపల్ కేపిటల్ ఆఫ్ ద వరల్డ్’గా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ అత్యంత విలువైన ‘ఓపల్’ రత్నాలు దొరుకుతాయి. ఈ ఊరి పరిధిలో దాదాపు డెబ్భైకి పైగా ఓపల్ గనులు ఉన్నాయి. ఊరి జనాభాలో ఎక్కువ మంది ఈ గనుల్లో పనిచేసే వారే! గని కార్మికులు, ఇంజినీర్లు, వారి అవసరాల కోసం ఏర్పడిన దుకాణాలు, హోటళ్లు, పబ్బులు, చర్చిలు ఈ ఊళ్లో కనిపిస్తాయి. ఇక్కడి గనుల్లో అత్యంత నాణ్యమైన ఓపల్ రత్నాలు దొరుకుతాయి. వీటికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. గనులు ఉన్న ఊళ్లు ప్రపంచంలో ఎన్నో ఉన్నా, ఇక్కడ ఉన్నట్లుగా మరెక్కడా పాతాళగృహాలు ఉండవు. మరి ఇక్కడి జనాలు ఎందుకలా నేల అడుగున ఇళ్లు కట్టుకున్నారనే అనుమానం ఎవరికైనా రావచ్చు. కూబర్ పెడీ ఎడారి ప్రాంతంలో వెలసిన ఊరు. వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రతలు మరీ దుర్భరంగా ఉంటాయి. సాధారణంగా 48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుంటాయి. ఒక్కోసారి 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఎండల ధాటిని తట్టుకుని, బతికి బట్టకట్టడానికే ఇక్కడి జనాలు ఇలా నేల అడుగున కట్టడాలను నిర్మించుకున్నారు. ఈ ఊరి ఉపరితలం కంటే, నేల అడుగునే చల్లగా ఉంటుంది. దాదాపు శతాబ్దకాలంగా ఇక్కడ ఓపల్ గనుల తవ్వకాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఊరి జనాభా రెండున్నర వేలకు పైగా ఉంది. వీరిలో ఎనభై శాతం మంది గనులకు సంబంధించిన వారే! ఆస్ట్రేలియాలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే, ఇక్కడి ఇళ్ల ధరలు కారుచౌక. ఈ ఊళ్లో మూడు పడక గదుల పాతాళగృహం ధర 41 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.21.83 లక్షలు) మాత్రమే! అయితే, ఇక్కడి వాతావరణం కారణంగా ఈ ఊళ్లో ఆస్తులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడానికి ఎవరూ ఇష్టపడరు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత కారు చౌక ఈ ఇల్లు! ఎందుకో తెలుసా!) -
భారత్‌లో ఫస్ట్ టైం.. నది కింద నుంచి మెట్రో పరుగులు
ఢిల్లీ: రైల్వే ప్రయాణంలో కోల్‌కతా(పశ్చిమ బెంగాల్) మెట్రో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. నది కింద భాగం నుంచి మెట్రో రైలు పరుగులు తీయడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ. తద్వారా మన దేశంలోనే తొలిసారిగా ఇలాంటి అనుభూతిని ప్రయాణికులకు అందించబోతోంది. హూగ్లీ నదీ కింద భాగంలో కోల్‌కతా నుంచి నదీకి అవతలివైపు హౌరా మధ్య సుమారు 4.8 కిలోమీటర్ల దూరంతో ఈ అండర్‌గ్రౌండ్ ప్రయాణం సాగనుంది. ఈస్ట్‌వెస్ట్ మెట్రో కారిడార్‌లో.. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ స్టేషన్ల మధ్య ఈ రివర్ అండర్ గ్రౌండ్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. నీటి ఉపరితలం నుంచి 32 మీటర్ల లోతున మెట్రో టన్నెల్ ఏర్పాటు చేయగా.. ప్రయాణానికి 45 సెకన్ల టైం పట్టనుంది. బుధవారం టెస్ట్ రన్ విజయవంతంగా పూర్తైంది. ఈ ఫీట్‌ను మోడ్రన్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా కోల్‌కతా మెట్రో అధికారులు అభివర్ణిస్తున్నారు. అయితే ట్రయల్ రన్స్ మొదలుపెట్టి ఏడునెలలపాటు కొనసాగిస్తామని.. ఆ తర్వాతే పూర్తిస్థాయిలో రెగ్యులర్ ప్రయాణాలకు అనుమతిస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లకు పైనే పట్టింది. టన్నెల్ నిర్మాణాల వల్ల సమీప ప్రాంతాల్లోని నివాసాలు దెబ్బ తినగా.. అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి. చివరకు.. స్థానికులను ఒప్పించి, పరిహారం చెల్లించి నిర్మాణం పూర్తి చేసింది మెట్రో రైల్ కోల్‌కతా. Kolkata Metro creates History!For the first time in India,a Metro rake ran under any river today!Regular trial runs from #HowrahMaidan to #Esplanade will start very soon. Shri P Uday Kumar Reddy,General Manager has described this run as a historic moment for the city of #Kolkata. pic.twitter.com/sA4Kqdvf0v — Metro Rail Kolkata (@metrorailwaykol) April 12, 2023 -
షాకింగ్: సామాన్య పౌరుడిగా.. లండన్ మెట్రోలో దుబాయ్ యువరాజు
ఓ దేశానికి, రాజ్యానికి రాజు అంటే ఎన్ని రాజభోగాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్యాలెస్‌లో సకల సౌకర్యాలు ఉంటాయి. అడుగు బయటపెట్టినా భద్రత దృష్ట్యా వారు ప్రత్యేకంగా కార్లు, విమానాలు, హెలిక్యాప్టర్లలో తిరుగుతుంటారు. అయితే వీటికి భిన్నంగా దుబాయి క్రౌన్ ప్రిన్స్ మెట్రోలో ప్రయాణించారు. అంతేగాక తోటి ప్రయాణికులు అతన్ని యువరాజుగా గుర్తు పట్టకపోవడం మరో పెద్ద విశేషం. దుబాయి యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ తన కుటుంబం, స్నేహితులతో కలిసి లండన్ వెకేషన్లో ఉన్నారు. హాలిడే ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను 14 మిలియన్ల ఫాలోవర్స్ కలిగిన తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో యువరాజు లండన్‌లోని అండర్ గ్రౌండ్ మెట్రోలో సామాన్యుడిలా ప్రయాణించారు. షేక్ హమ్దాన్ తన స్నేహితుడు బద్ర్ అతీజ్‌తో కలిసి నిత్యం రద్దీగా ఉండే లండన్ మెట్రో కంపార్ట్మెంట్ మధ్యలో నిల్చొని సెల్ఫీ దిగారు. ‘మేము చాలా దూరం వెళ్ళవలసి ఉంది. బద్ర్(సౌదీ అరేబియాలోని ఓ ప్రాంతం) ఇప్పటికే విసుగొచ్చింది’ అని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ దాదాపు వారం క్రితం షేర్ చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఫోటోలను నిశితంగా పరిశీలిస్తే రైలులోని మిగతా ప్రయాణికులు వీరిద్దరినీ గుర్తించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. కాగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ విలాసవంత ప్రయాణాన్ని వదిలేసి ఇలా మెట్రోలో సామాన్య పౌరుడిగా ప్రయాణించడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చదవండి: అక్కడ లాక్డౌన్ అంటే చాలు జనాలు జంప్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by Fazza (@faz3) -
పునాది కోసం తవ్వుతుండగా.. బయటపడ్డ భూగర్భ కట్టడం.. ఏముంది అందులో!
దొడ్డబళ్లాపురం: రామనగర పట్టణ పరిధిలోని రైల్వేస్టేషన్ రోడ్డులో పునాది కోసం తవ్వుతుండగా పురాతన కట్టడం వెలుగు చూసింది.న వాజ్ అహ్మద్ అనే వ్యక్తి తన స్థలంలో దుకాణం నిర్మించడానికి పునాది కోసం పాయ తీయిస్తుండగా కట్టడం బయటపడింది. నాణ్యతతో నిర్మించబడిన ఆ కట్టడం వందల ఏళ్ల నాటిదని తెలుస్తోంది. క్రమంగా మట్టిలో మూసుకుపోవడంతో భూగర్భంలో కలిసిపోయి ఎవరి కంటా పడలేదు. ఇది టిప్పుసుల్తాన్ కాలంలో నిర్మించబడిందని స్థానిక చరిత్రకారులు చెప్పారు. కట్టడం రూపురేఖలు చూస్తుంటే ఆయుధాగారం మాదిరిగా ఉందని, శ్రీరంగపట్టణంలోనూ ఇలాంటి కట్టడాలే ఉన్నాయని తెలిపారు. నేలమాళిగ నిర్మించి ఇందులో ఆయుధాల తయారీ, నిల్వ చేసేవారని పేర్కొన్నారు. -
తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదుల్లో ఏముందంటే...
లక్నో: భారత పురావస్తు శాఖ తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదులకు సంబంధించి కొన్ని ఫోటోలను విడుదల చేసింది. ఈ మేరకు తాజ్‌మహల్‌ని పరిరక్షిస్తున్న ఆర్కియాలజీ సర్వే ఆప్ ఇండియా (ఏఎస్ఐ) మూతపడ్డ గదులకు సంబంధించిన మరమత్తుల ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతేగాదు ఇటీవలే తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదులు తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పిటిషన్ పెద్ద హాట్ టాపిక్‌గా వార్తల్లో నిలిచింది. అయితే అలహాద్ హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారించడానికి ముందే న్యూస్ లెటర్ జనవరి 2022 పేరుతో ఆర్కియాలజీ సర్కే ఆప్ ఇండియా(ఏఎస్ఐ) తాజ్‌మహల్‌లో మరమత్తుల పనులు చేపట్టినట్లు పేర్కొనడం గమనార్హం. అంతేగాదు మే9 వ తేదీన తాజ్‌మహల్‌లో అండర్ గ్రౌండ్ వర్క్స్ అనే పేరుతో మూతపడ్డ 22 గదుల చిత్రాలను వారి అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేయగా, వీటిని తాజాగా ఏఎస్ఐ విడుదల చేసింది. అంతేగాదు తాజ్‌మహల్ పునరుద్ధరణకు ముందు తర్వాత ఫోటోలను గురించి వివరించింది. గోడలు మెట్లు, పాడైన సున్నపు ప్లాస్టర్ రీప్లాస్టర్‌గా స్క్రాప్ చేయడం వంటి పనులు చేపట్టినట్లు ఏఎస్ఐ వెల్లడించింది. అలాగే తాజ్‌మహల్ బయటి వైపున, యమునానది ఒడ్డున కూడా మరమత్తుల పనులు చేపట్టినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా మరమత్తులకు సంబంధించిన ఫోటోలతోపాటు "స్మారక కట్టడం పునరుద్ధరణ పనులు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. Click on the link to download/view the January issue of @ASIGoI's Newsletter.https://t.co/tIJmE46UR4 pic.twitter.com/UKWsTA2nPZ — Archaeological Survey of India (@ASIGoI) May 9, 2022 (చదవండి: ‘తాజ్ మహల్ కాదు.. తేజో మహాలయా పిటిషన్’.. కోర్టు ఏమందంటే..) -
ఆ వ్యక్తి 67 ఏళ్లుగా స్నానమే చేయలేదట!..అతని ఆహారం ఏమిటో తెలుసా?
కొంతమంది ఆరోగ్యానికి సంబంధించిన ఆహార డైట్‌ని తెగ ఫాలోవుతారు. అయినప్పటికి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. మరికొంతమంది ఎలాంటి ఆహార డైట్ ఉండదు. పైగా వాళ్లు పెద్దగా ఆరోగ్యం గురించి పట్టించుకోరు కూడా. అయినా వాళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటారు. కానీ అసలు ఎలాంటి శుభ్రత లేకుండా అత్యంత హేయంగా జీవించడమే కాకుండా కనీసం స్నానం కూడా చేయకుండా ఆరోగ్యంగా జీవిస్తున్న వ్యక్తి గురించి విన్నారా!. అయితే ఈ వృద్ధుడి జీవన శైలి చూసి కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు విషయంలోకెళ్తే...ఇరాన్‌కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడు అమో జాజి 67 ఏళ్లుకు పైగా స్నానమే చేయలేదట. పైగా అతను పందికొక్కులు, కుందేళ్లను తినడం, నీటి కుంటల్లో నీరు తాగడం వంటివి అతని జీవశైలి. అయితే అతని ఆరోగ్యం చూసి శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆశ్చర్యపోయారు. అంతేకాదు అతను ఒంటరిగానే గడుపుతాడు. చాలాకాలం అతను సోరంగంలోనే జీవించాడట. అయితే అతని విచిత్ర జీవన శైలిని చూసి ఆశ్యర్యపోయిన దేజ్గా గ్రామస్తులు ఆ వృద్ధుడు కోసం ఒక పూరి గుడిసెను నిర్మించి ఇచ్చారు. ఈ మేరకు టెహ్రాన్‌లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కి సంబంధించిన పారాసిటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆ వృద్ధుడికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే అతను 67 ఏళ్లుగా స్నానం చేయకపోయినప్పటికి అతని శరీరంలో ఎలాంటి పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు లేవని అతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడని ధృవీకరించారు. అయితే ఆ వృద్ధుడు స్థానిక పరిపాలనాధికారుల సహాయాన్ని పొందాడు. పైగా స్థానిక గవర్నర్ అతన్ని ఇబ్బంది పెట్టవద్దని ప్రజలను కోరడం గమనార్హం. (చదవండి: ఔను! ఆ పబ్‌లో దెయ్యాలు ఉన్నాయి ! డెవిల్ వైరల్ వీడియో) -
టీవీలన్నింటిల్లో ఇది స్పెషల్ టీవీ.. కింద నుంచి పైకి
ఇప్పటివరకూ చాలా టీవీలను చూసుంటారు.. మరి ఇలాంటిది.. అబ్బే చాన్సే లేదు.. ఫొటోలు చూస్తున్నారుగా.. అలా బటన్ నొక్కగానే.. అండర్‌గ్రౌండ్‌లో నుంచి స్తంభంలాంటిది పైకి వస్తుంది.. నెమ్మదిగా అది ఐదు 4కే మైక్రో ఎల్ఈడీ ప్యానళ్లుగా విడిపోతుంది. చివరికి 165 అంగుళాల భారీ టీవీ మీ హాల్లో ఠీవిగా ప్రత్యక్షమవుతుంది. ఆస్ట్రియాకు చెందిన సీ సీడ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ తయారుచేసిన ఈ టీవీ పేరు ఎం1. ఇది ప్రపంచంలోనే తొలి 165 అంగుళాల ఫోల్డబుల్ టీవీ. హాల్లో అలా ఫ్లోర్‌లోంచి టీవీ పైకి రావడం వంటివి చూసి.. మీ ఇంటికి వచ్చినోళ్లు నోరెళ్లబెట్టడం ఖాయమని ‘సీ సీడ్’ కంపెనీ చెబుతోంది. పైగా.. ప్రస్తుత ఓఎల్‌ఈడీలతో పోలిస్తే.. ఈ మైక్రో ఎల్ఈడీల్లో క్లారిటీ అదిరిపోవడం ఖాయమంటోంది. ఇంతకీ రేటెంతో చెప్పలేదు.. రూ.2.91 కోట్లే!!.. టీవీ కొనకముందే.. నోరెళ్లబెట్టేశారా.. ఇది జస్ట్ టీవీ రేటే.. ఆ అండర్‌గ్రౌండ్ సెట్టింగ్.. వాటన్నిటికీ అయ్యే ఇన్స్టలేషన్ చార్జీలు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివర్లో డెలివరీలు మొదలుపెడతామని కంపెనీ చెబుతోంది.. ఓసారి ట్రై చేస్తారా ఏమిటి?? -
లాడ్జి అండర్‌గ్రౌండ్‌లో పేకాట శిబిరంపై దాడి
గుంటూరు ఈస్ట్ : అండర్‌గ్రౌండ్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరాన్ని అరండల్‌పేట పోలీసులు ఛేదించారు. అమరావతి మెయిన్‌రోడ్డులోని ఓ లాడ్జిలో రెండో అంతస్థులోని బాత్రూము పక్కన గోడకు రధ్రం పెట్టి సెల్లార్లోకి మెట్లు ఏర్పాటు చేసుకుని బయటి వ్యక్తులు ఎవరు లోపలికి వచ్చినా కనిపెట్టలేని విధంగా జూద గృహం నిర్వహిస్తుండడాన్ని పోలీసులు చాకచక్యంగా గుర్తించారు. పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం..అమరావతి రోడ్డు మెయిన్‌రోడ్డులోని డీలక్స్ లాడ్జిలో అండర్‌గ్రౌండ్‌లో రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కస్టమర్లు ఎవరూ లేకపోయినా పలువురు లాడ్జిలోకి వెళ్లి రావడం చుట్టుపక్కల వారికి అనుమానం కలిగించింది. స్థానికులు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సీరియస్‌గా తీసుకుని పలువురు సీఐలను బృందగా ఏర్పాటు చేసి బుధవారం దాడి చేయించారు. లోపలకు వెళ్లిన పోలీసులకు పేకాట ఎక్కడ ఆడుతుంది తెలియలేదు. ఉన్నతాధికారులకు పేకాట నిర్వహణ సమాచారం పక్కాగా ఉండడంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు లాడ్జిలోని వ్యక్తులను తమదైన శైలిలో విచారించారు. దీంతో సిబ్బంది అండర్‌గ్రౌండ్‌కు ఏర్పాటు చేసిన రహస్య ద్వారం చూపించారు. రెండో ఫ్లోర్లో బాత్రూము పక్కన చిన్న సందు పెట్టి అండర్‌గ్రౌండ్‌లో కింద హాలు ఏర్పాటు చేశారు. అండర్‌గ్రౌండ్‌లో 16 మంది పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. కొందరు పారిపోయే ప్రయత్నం చేశారు. ముఖ్య నిర్వాహకుడు ముదనం పేరయ్య ముందుగానే పరారయ్యాడు. మిగిలిన 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరిలో లాడ్జి యజమాని ఉండటం గమనార్హం. వారి వద్ద నుంచి పోలీసులు రూ.1.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
పాతాళంలో జలం..అయినా పంటలు పుష్కలం..!
సాక్షి, అమరావతి బ్యూరో: భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతే ఆ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడుతుంది. కానీ.. అందుకు భిన్నంగా కృష్ణా జిల్లా ముసునూరు మండలం మాత్రం పచ్చని పంటలతో కళకళలాడుతోంది. అలాగని ఆ మండలంలో సాగునీటి ప్రాజెక్టులు లేవు. కేవలం వర్షాలు బోరు బావులు మాత్రమే అక్కడి రైతులకు ఆధారం. ఆ మండలంలో 1990 వరకు భూగర్భ జలాలు అందుబాటులోనే ఉండేవి. ఆ తర్వాత బోర్లు వేయడంతో నీటి వినియోగం బాగా పెరిగింది.. 1999లో 21.67 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు 2019 నాటికి 110 మీటర్లు, కొన్నిచోట్ల 150 మీటర్ల లోతుకు కూడా వెళ్లిపోయాయి. భూగర్భ జలాల రాష్ట్ర సగటు 12.82 మీటర్లు కాగా.. రాష్ట్ర సగటు కంటే 8 నుంచి 12 రెట్లు దిగువకు వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ మండలంలో 5,352 బోర్లున్నాయి. వీటిలో చాలా బోర్లు వెయ్యి అడుగుల లోతుకు తవ్వారు. ఒకప్పుడు గరిష్టంగా 5 హార్స్పవర్ (హెచ్‌పీ) మోటార్లను వాడేవారు. ఇప్పుడుగా 15, 20 హెచ్‌పీ మోటార్లను వాడుతున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ముసునూరు మండలంలోని 16 గ్రామాల్లో ఒక్క కొర్లకుంట మినహా మిగిలిన అన్ని గ్రామాల్లోనూ వాల్టా చట్టం అమలు చేస్తూ అధికారులు కొత్త బోర్ల ఏర్పాటుపై నియంత్రణ విధించారు. ప్రస్తుతం ఉన్న బోర్లు మరింత లోతుకు తవ్వకుండా ఆంక్షలు పెట్టారు. ఈ మండలాన్ని డార్క్ ఏరియాగా ప్రకటించారు. అక్కడ ఇసుక తవ్వకాలపై కూడా నిషేధం అమలు చేస్తున్నారు. 60 రకాల పంటలతో.. ఈ మండలంలో 13,351 హెక్టార్లలో 60 రకాల పంటలు సాగవుతున్నాయి. బోర్లు వేయకముందు ఇక్కడ పది రకాల పంటలే పండించేవారు. ఏటా రెండు, మూడు పంటలు వేసి గణనీయమైన, నాణ్యమైన దిగుబడులనూ సాధిస్తున్నారు. వీటిలో మొక్కజొన్న, ఆయిల్‌పామ్, వరి, మామిడి, అరటి, పొగాకు, మిర్చి, కొబ్బరి, పత్తి, నిమ్మ, జామ, కూరగాయలు, చెరకు, వేరుశనగ, బొప్పాయి, మినుములు, పెసలు, జీడిమామిడి, బీర, ఉలవలు, టమాటా, కేప్సికం, సుబాబుల్, జొన్న, కంది, బీన్స్, పసుపు, మల్లె, చామంతి, రేగు, ములక్కాడ, పొద్దు తిరుగుడు, కాకర వంటివి ఉన్నాయి. వీటిలో ఏడాది పొడవునా నీరు అధికంగా అవసరమయ్యే ఆయిల్‌పామ్ 2,345 హెక్టార్లలోను, వరి 2,200 హెక్టార్లలోను సాగవుతున్నాయి. నేల గొప్పదనమే ఇది ముసునూరులో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నా నీటి లభ్యతతో పాటు పంటలు పండడానికి అక్కడ ఎర్ర ఇసుక నేలలే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేల కింద ఇసుక రాతి పొరలున్నాయి. ఇవి ఎక్కువ సేపు నీటిని నిల్వ ఉంచే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల భూమిలో లోతుకు వెళ్లినా సమృద్ధిగా నీళ్లు లభిస్తున్నాయి. జలశక్తి అభియాన్‌లో ఎంపిక.. కేంద్ర జలశక్తి అభియాన్ పథకంలో ముసునూరు మండలాన్ని ఎంపిక చేశారు. అక్కడ భూగర్భ జలాలను పైకి తీసుకురావడానికి దోహదపడే నీటి పొదుపు చర్యలు పాటించడం, పొలంలో ఫారం పాండ్స్ ఏర్పాటు, నీటి వినియోగం తక్కువయ్యే ప్రత్యామ్నాయ పంటలు వేయడం వంటివి సిఫార్సు చేస్తూ అధికారులు రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. రైతులు క్రమంగా డ్రిప్ ఇరిగేషన్‌పై ఆసక్తి చూపుతుండటంతో సుమారు 7వేల హెక్టార్లలో నీటిని పొదుపు చేస్తున్నారు. మండలంలోని ముసునూరు, సూర్యపల్లి, వేల్పుచర్లల్లో పిజియో మీటర్లను ఏర్పాటు చేసి భూగర్భ జలాల స్థాయిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతలే శరణ్యం.. చింతలపూడి పథకం ద్వారా గోదావరి జలాలను సాగర్ ఎడమ కాలువలోకి మళ్లించి.. తమ్మిలేరు వాగు పరీవాహక ప్రాంతంలోని లోపూడి, గుళ్లపూడి, గుడిపాడు, వలసపల్లి, ఎల్లాపురం గ్రామాలకు కలిపితే చెరువులు నిండి భూగర్భ జలాల వృద్ధికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ ఏడాది సీఎం వైఎస్ జగన్ పుణ్యం కట్టుకోవడం వల్ల చెరువులు నిండి భూగర్భ జలాలు పెరిగాయి. – రేగుల గోపాలకృష్ణ, అధ్యక్షుడు, ముసునూరు పీఏసీఎస్ రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం భూగర్భ జలాల పెంపుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్ ఆవశ్యకతను వివరిస్తున్నాం. రెండు వేల మంది రైతులకు శాస్త్రవేత్తలతో కలిసి కిసాన్ మేళా నిర్వహించాం. ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలు వస్తున్నాయి. – బి.శివశంకర్, మండల వ్యవసాయాధికారి, ముసునూరు 30 ఏళ్ల క్రితం 25 అడుగుల్లోనే నీరు 30 ఏళ్ల క్రితం మా ప్రాంతంలో 25 అడుగుల్లోనే నీరుండేది. అప్పట్లో బోర్లు వేయడానికి 100 అడుగులు తవ్వితే సరిపోయేది. ఇప్పుడు 600 అడుగుల తోతుకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల 15–20 హెచ్‌పీ మోటార్లు బిగించి నీరు తోడుతున్నారు. చెరువుల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలి. – ఎం.సుబ్బారావు, రైతు, గుడిపాడు, ముసునూరు మండలం -
కనిపించని అభ్యర్థికి ప్రచారం!
ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి లోక్‌సభ నియోజకవర్గంలో మే 19వ తేదీన పోలింగ్ జరగనుండటంతో ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి అతుల్ రాయ్ తరఫున బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌లు స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా అతుల్ కోసం విస్తృతంగా ప్రచారం చేయాల్సిందిగా వారు పార్టీ శ్రేణులకు ఆదేశిస్తున్నారు. ఇందులో విశేషమేముంది...అనుకుంటున్నారా...వారు ఎవరికోసమైతే ప్రచారం చేస్తున్నారో ఆ అభ్యర్థి అతుల్ రాయ్ పదిహేను రోజుల నుంచి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియడం లేదు. అంటే ‘కనిపించని’ అభ్యర్థి కోసం భారీ ఎత్తున ప్రచారం జరుగుతోందన్నమాట. ఇంతకీ అతుల్ అదృశ్యానికి కారణం, ఆయనపై అత్యాచారం కేసు నమోదు కావడం. అతుల్ రాయ్ తనపై అత్యాచారం చేశారని ఒక విద్యార్థిని వారణాసి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు మే 1న అతుల్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని కొందరు, మలేసియా పారిపోయారని ఇంకొందరు చెబుతున్నారు.ఆయన లేకపోయినా ఆయన తరఫున ప్రచారం మాత్రం సాగిపోతోంది. బీజేపీ వాళ్లు కుట్రతో తమ అభ్యర్థిపై బూటకపు కేసు పెట్టించారని మాయావతి, అఖిలేశ్‌లు చెబుతున్నారు. అతుల్ రాయ్‌ని తప్పనిసరిగా గెలిపించి బీజేపీ కుట్రను భగ్నం చేయాలని కూడా వారు ఓటర్లను కోరుతున్నారు. మరోవైపు మే 23 వరకు అతుల్‌ను అరెస్టు చేయకుండా చూడాలని ఆయన లాయరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై ఈ రోజు విచారణ జరగనుంది. -
భార్యకు ప్రేమతో...
యెరెవాన్ : భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం షాజహాన్ తాజ్‌మహల్ నిర్మించారు. ఆయనంటే మహారాజు.. కాబట్టి ఏమైనా చేయగలరు. మనం సామాన్యులం, అవన్నీ మన వల్ల అయ్యే పనులు కావనుకుంటాం మనలో చాలా మంది. కానీ అర్మెనియా(గతంలో సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేది) దేశానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం భార్య కోసం రెండు దశాబ్దాలకు పైగా, ఒంటరిగా శ్రమించి అద్భుతమైన భూగృహాన్ని నిర్మించాడు. ఇప్పుడది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వివరాల ప్రకారం..అర్మెనియా దేశంలోని అరెంజీ గ్రామానికి చెందిన లెవాన్ అరాక్లేయన్, తొస్యా గరిభ్యాన్ దంపతులు. ఒక రోజు తొస్యా ఆలుగడ్డలు నిల్వ చేసుకునేందుకు తన కోసం ఒక బేస్మెంట్ / భూగృహాన్ని నిర్మించాల్సిందిగా తన భర్తను కోరింది. భార్య కోరిక మేరకు చిన్న బేస్మెంట్ నిర్మాణాన్ని ప్రారంభించిన లెవాన్ అంతటితో ఆగక ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ భూగృహాన్ని నిర్మించాడు. దీని లోపలంతా ఒంపులు తిరిగిన నిర్మాణాలు, గుహలు, సొరంగాలతో నిర్మితమై ఉంది. ఈ అపురూప కట్టడం గురించి తొస్యా ‘నేను సరదాగా కోరిన కోరికను ఆయన చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దాదాపు 23 ఏళ్లపాటు ఏకధాటిగా శ్రమించి, ఒక్కరే ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని ఆవిష్కరించారు. 1985లో ఈ భూగృహ నిర్మాణాన్ని ప్రారంభించారు. రోజులో ఆయన 18 గంటలు పనిచేసేవారు. కాసేపు విశ్రమించి వెంటనే ఇక్కడికి వచ్చేవారు’ అని తెలిపారు. అంతేకాక ఈ నిర్మాణానికి సంబంధించి ఆయన ఎటువంటి ప్లాన్ రూపొందించుకోలేదు. ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇంత అద్భుతంగా ఎలా చెక్కుతున్నారని అడగ్గా ‘దాని గురించి నాకు ఏం తెలీదు. కానీ తరువాత చేపట్టబోయే నిర్మాణాల గురించి, శిల్పాలు, కళాఖండాల గురించి నాకు కలలో కన్పిస్తుంటుంది. దాన్ని బట్టే వీటన్నింటిని చెక్కగల్గుతున్నాన’ని తెలిపారు. ‘నా భర్త పని ప్రారంభించిన కొత్తలో రాతిని చెక్కడం చాలా కష్టంగా ఉందని తెలిపారు. ఎందుకంటే అదంతా నల్ల బసాల్డ్ రాయి. కానీ లోతుకు వెళ్లిన కొద్ది మృదువైన టఫ్పా రాయి వచ్చింది. దాంతో రాయిని తొలచడం చాలా తేలికయ్యిందని, అప్పటి నుంచి పని చాలా వేగంగా నడుస్తుందని తెలిపే’వారన్నారు. ‘ఈ భూగృహ నిర్మాణంలో దాదాపు 600 రాళ్లను ఉపయోగించారు. వీటన్నింటిని లెవాన్ కేవలం బకెట్ల ద్వారానే భూమిలోకి తీసుకెళ్లేవారు. ఎవరి సాయం తీసుకోలేద’ని తెలిపారు. ‘ఆ విధంగా 280 చదరపు అడుగుల వైశాల్యం, 21 మీటర్ల లోతు వరకూ తవ్వుతూ వెళ్లాడ’న్నారు. లెవాన్ కుమార్తె అరకస్య ‘నా చిన్నతనంలో నేను మా నాన్నగారిని చూసింది చాలా తక్కువ సార్లు మాత్రమే. కానీ ఎప్పుడు రాతిని తొలిచే శబ్దం వినిపిస్తూనే ఉండేది. ఇప్పటికి మా నాన్న గారిని గుర్తుకు తెచ్చుకుంటే నాకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆ ఉలి శబ్దం మాత్రమే’ అన్నారు. ఈ సొరంగం నిర్మాణం పూర్తి కావొస్తున్న సమయంలో అనగా 2008లో తన 67 ఏట లెవాన్ మరణించారు. భర్త మరణించిన అనంతరం తొస్యా ఈ భూగృహంతో పాటు, మరో చిన్న మ్యూజియాన్ని కూడా నిర్వహిస్తోంది. దీనిలో తన భర్త భూగృహం నిర్మాణం కోసం వినియోగించిన వస్తువులను ప్రదర్శన కోసం ఉంచింది. ఇప్పుడు ఈ భూగృహాన్ని దర్శించడానికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. దీన్ని సందర్శించిన ప్రతి ఒక్కరు ‘అద్భుమైన ప్రదేశం.. భూమి మీద నెలకొన్న స్వర్గం’గా అభివర్ణిస్తున్నారు. భార్యకు ప్రేమతో... ఓ హైదరాబాదీ! -
కరెంటు ఫుల్...నీళ్లు నిల్
కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్న విధంగా తయారైంది అన్నదాతల పరిస్థితి. నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టును మినహాయిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతాంగానికి విద్యుతే ప్రాణాధారం. ప్రభుత్వం ఇప్పుడు 24గంటల ఉచిత నిరంతర విద్యుత్ ఇస్తున్నా ఆయకట్టేతర ప్రాంతాలకు చెందిన రైతులు ఏమాత్రం సంతోషంగా లేరు. విద్యుత్‌ను అవసరాల మేరకే సక్రమంగా ఎలా వినియోగించుకోవాలో రైతులను చైతన్య పరచడంలో విద్యుత్‌శాఖ పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతుల విద్యుత్ మోటార్లు ఆగకుండా నడుస్తుండడంతో భూగర్భ జలమట్టం అంతకంతకూ పడిపోతోంది. ఫలితంగా బోర్లు వట్టిపోయి, పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు బోరుమంటున్నారు. పైన ఫొటో చూడండి.. పశువులు మేస్తున్న ఎండిన పంట నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారంలోనిది. ఈ గ్రామంలో 350 ఎకరాల్లో ఈ సీజన్లో వరి సాగు చేశారు. సీజన్ ప్రారంభంలో డీ–40 కాల్వ ద్వారా నీరు విడుదల చేయడంతో రైతులు వరి పంటలను సాగు చేశారు. అయితే కాల్వ ద్వారా నీటి విడుదల నిలిచిపోవడంతో పరిస్థితి తారుమారు అయ్యింది. భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయి. బోర్లలో నీరు రాకపోవడంతో సాగు చేసిన వరి చేలు ఎండి పోతున్నాయి. మరో నెల రోజుల్లో పంటలు చేతికి వచ్చే సమయంలో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ గ్రామంలో 200 ఎకరాల వరకు వరి ప్రస్తుతం పూర్తిగా ఎండి పోయింది. దీంతో కొంతమంది రైతులు కొత్తగా బోర్లు వేసి ఫలితం లేక చేతులు కాల్చుకుంటున్నారు. చేసేది లేక పశువులను మేపుతున్నారు. సాక్షిప్రతినిధి, నల్లగొండ: వానాకాలం అంతగా కలిసి రాకపోవడంతో యాసంగి పంటపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయిలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండడంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. కరెంటు ఫుల్‌గా ఉన్నా, సరిపడా నీరందక కళ్లముందే పంటలు ఎండిపోతుంటే రైతులు బోరుమంటున్నారు. నల్లగొండ జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరిలో 10.91 మీటర్లపైనే నీరందగా, వినియోగం విచ్చలవిడిగా పెరగడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి భూగర్భజలమట్టం 11.30 మీటర్ల లోతుకు పడిపోయింది. నెల రోజుల్లో యాదాద్రి జిల్లా పరిధిలో రెండు మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. ఆటో స్టార్టర్లతో నడుస్తున్న మోటార్లు కాలిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో పంటను కాపాడుకోవాలనే తపనతో రైతులు విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు. పెరిగిన సాగు విస్తీర్ణం.. విద్యుత్ వినియోగం గత యాసంగి సీజన్ కంటే ఈ సీజన్లో సాగు విస్తీర్ణం, విద్యుత్ వినియోగం పెరిగిపోయాయి. సాగర్, మూసీ ఆయకట్టును మినహాయిస్తే ఉమ్మడి జిల్లాలో భూగర్భజలంపై ఆధారపడే రైతులే ఎక్కువ. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 3.87లక్షల పైచిలుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్క నల్లగొండ పరిధిలోనే గత ఏడాది ఫిబ్రవరిలో 297 మిలియన్ యూనిట్లు విద్యుత్‌ను వినియోగిస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 466 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అదేస్థాయిలో సాగు విస్తీర్ణం కూడా పెరిగిపోయింది. నల్లగొండలో గతేడాది యాసంగిలో 57వేల హెక్టార్లలో సాగు చేస్తే, ఈ సారి 74వేల హెక్టార్లకు పెరిగిపోయింది. సూర్యాపేట జిల్లాలో గతేడాది 74వేల హెక్టార్లలో సాగుచేయగా, ఈ సారి 80వేల హెక్టార్లకు పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ యాసంగిలో 25వేల హెక్టార్లలో వరి సాగైంది. దీంతో నిరంతరం విద్యుత్ వాడుతున్న ఫలితంగా బోర్లు వట్టిపోయి పంటలు ఎండిపోతున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, అర్వపల్లి, నూతనకల్, నాగారం, మద్దిరాల మండలాల పరిధిలో 7240 ఎకరాల్లో వరిపంట సాగు చేయగా ఇప్పటికే 50 శాతం పొలాలు ఎండిపోయాయి. తమ పంటలు ఎండిపోవడానికి కారణం 24గంటల విద్యుత్ అని రైతులు వాపోతున్నారు. 24 గంటల విద్యుత్ వద్దని రైతులు గ్రామాల్లో రాస్తారోకో, ధర్నాలు చేస్తున్న విషయం విదితమే. రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది మాకున్న రెండు ఎకరాల్లో యాసంగిలో వరి సాగు చేశాం. ఉన్న రెండు బోర్లు నెల రోజుల్లో వట్టిపోయాయి. 20 రోజుల క్రితం కొత్తగా రూ.50 వేలు ఖర్చు పెట్టి రెండు బోర్లు వేయించినా చుక్క నీరు రాలేదు. మొత్తం రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది. దీంతో పశువులను మేపుతున్నాం. పెట్టిన పెట్టుబడి పోగా మరో రూ.70 వేల వరకు అప్పు మిగిలింది. – మల్లేపల్లి సైదమ్మ, సర్వారం, తిప్పర్తి మండలం 12గంటలు ఇస్తే చాలు ప్రభుత్వం 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ ఇస్తుండడంతో బోర్లు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు తగ్గి బోర్లు సన్నని ధారగా పోస్తున్నాయి. నాటు పెట్టిన పొలాలు ఎండిపోతున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో 12 గంటల కరెంట్ విడుతల వారీగా ఇస్తేచాలు. వ్యవసాయం చేయగలం. నీటి వసతి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో 24 గంటలు ఇచ్చుకుంటే సరిపోతుంది. – గంగేశ్వర్, రైతు, అడ్డగూడూరు ఆటోస్టార్టర్లు తొలగించుకోమని చెప్పాం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న నాటి నుంచే రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించుకోమని చెబుతున్నాం. ఎవరికి వారు స్వచ్ఛందంగా తొలగించుకోవాలి. అవసరం మేరకు విద్యుత్ వాడుకుని ఆ తర్వాత రైతులు తమతంటతాముగానే స్టార్టర్లు బంద్ చేసుకుంటున్నారు. భూగర్భజలాలు అడుగంటుతున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. 24 గంటల విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిరోజుల నుంచి జిల్లాలో విద్యుత్ వాడకం పెరిగింది. ప్రతీ రోజూ నల్లగొండ జిల్లాలో 29.86 మిలియన్ యూనిట్లు వినియోగిస్తున్నారు. వాస్తవానికి జిల్లా కోటా 18.30 మిలియన్ యూనిట్లు మాత్రమే. – కృష్ణయ్య, విద్యుత్ శాఖ, ఎస్ఈ, నల్లగొండ -
11 రోజులు సమాధిలో..
సాక్షి, బళ్లారి(కర్ణాటక) : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 11 రోజుల పాటు ఎలాంటి అన్నపానీయాలు తీసుకోకుండా సమాధిలోనే ఉండిపోయారు ఓ స్వామీజీ. అనంతరం ధ్యానముద్ర నుంచి మేల్కొని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివచ్చారు. ఈ సంఘటన కర్ణాటకలోని యాదగిరి జిల్లా చింతనపల్లిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని సిద్ధలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ఈ నెల 11న రాచోటేశ్వర అనే స్వామీజీ ధ్యానముద్రలో కూర్చొన్నారు. తర్వాత గ్రామస్తులు, భక్తులు కలిసి స్వామీజీ చుట్టూ రాళ్లతో సమాధి నిర్మించారు. గాలి, వెలుతురు లేకుండా ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం సమాధిని తొలగించారు. ఉజ్జయిని జగద్గురు మరుళు సిద్ధ దేశీ కేంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో యోగముద్రలో ఉన్న రాచోటేశ్వర స్వామీజీని ధ్యాన విముక్తుణ్ని చేయించారు. ధ్యానముద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వామీజీ మాట్లాడుతూ జనం సంతోషంగా ఉండాలని, వర్షాలు సమద్ధిగా వచ్చి పంటలు బాగా పండాలనే ఉద్దేశంతో 11 రోజుల పాటు ధ్యానం చేశానన్నారు. కాగా.. రాచోటేశ్వర స్వామీజీ గతంలో కూడా 41 రోజులు ధ్యానంలో ఉన్నారని భక్తులు తెలిపారు. -
మరింత లోతుల్లోకి పాతాళ గంగ
* రాష్ట్రంలో 13.17 మీటర్లకు దిగజారిన భూగర్భ జలాలు * మెదక్ జిల్లాలో 22.59 మీటర్లు * నిజామాబాద్ జిల్లాలో 17.78 మీటర్లకు * రబీలో 76 శాతం లోటు వర్షపాతం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. గత ఖరీఫ్ మొదలు రబీ వరకు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. 2014 డిసెంబర్లో రాష్ట్రంలో 10.24 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు ఉండగా, 2015 డిసెంబర్లో 13.17 మీటర్ల లోతుల్లోకి అడుగంటాయి. ఏకంగా 2.93 మీటర్ల అదనపు లోతుల్లోకి దిగజారాయి. బోర్లు వట్టిపోయాయి. బావులు ఎండిపోయాయి. ఫలితంగా తాగునీటి సమస్య ఏర్పడింది. మెదక్ జిల్లాలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఆ జిల్లాలో 2014 డిసెంబర్లో 15.84 మీటర్ల లోతులో నీరు లభిస్తే, గత నెలలో ఏకంగా 22.59 మీటర్లకు అడుగంటింది. ఏకంగా 6.75 మీటర్ల అదనపు లోతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 2014 డిసెంబర్లో 11.06 మీటర్ల లోతులో నీరు ఉండగా, 2015 డిసెంబర్లో 17.78 మీటర్లకు పడిపోయింది. ఏకంగా 6.72 మీటర్ల అదనపు లోతుల్లోకి జలాలు దిగజారిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 3.89 మీటర్ల అదనపు లోతుల్లోకి అడుగంటాయి. రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలోనూ ఏడాది కాలంగా భూగర్భ జలం పైకి రాకపోగా, ఇంకా అదనపు లోతుల్లోకి పడిపోయాయి. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన అటు ప్రజలనూ, ఇటు అధికారులనూ పట్టిపీడిస్తోంది. అంతేకాదు 2015 నవంబర్‌లో రాష్ట్రంలో 12.39 మీటర్ల లోతుల్లో పాతాళ గంగ లభిస్తే, ఒక్క నెల రోజుల్లోనే 13.17 మీటర్ల లోతుల్లోకి పడిపోయింది. రబీ సీజన్లో సాధారణంగా ఇప్పటివరకు 133 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 32 మీటర్లే నమోదై 76 శాతం లోటు కనిపిస్తోంది. 9 శాతానికి మించని వరినాట్లు రబీలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పంటల సాగు 35 శాతానికి మించలేదు. అందులో వరి నాట్లు 9 శాతానికి మించలేదు. రబీలో సహజంగా 31.32 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 11.10 లక్షల ఎకరాల్లోనే (35%) సాగు జరిగింది. అందులో వరి సాధారణంగా 16.12 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు లక్షన్నర ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఒక్క పప్పుధాన్యాల సాగు మాత్రమే 95 శాతం జరిగింది. సాధారణంగా 3.45 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాల సాగు జరగాల్సి ఉండగా... ఇప్పటివరకు 3.27 లక్షల ఎకరాల్లో జరిగింది. వరి నాట్లు అత్యంత దారుణంగా పడిపోవడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని వ్యవసాయశాఖ చెబుతోంది. ఆరుతడి పంటలు వేయాలని సూచిస్తోంది. -
అజ్ఞాతంలో జిమ్మిబాబు
-
బెయిల్ దొరికేనా!
-
ముంబైలో భూగర్భ రింగ్‌రోడ్డు నిర్మాణం
ముంబై: ప్రతిపాదిత అహ్మదాబాద్-ముంబై జాతీయ రహదారికి కలిసేటట్లు నగరంలో భూగర్భ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం తెలిపారు. దీన్ని రూ.90 వేల కోట్ల అంచనావ్యయంతో నిర్మించనున్నట్లు వివరించారు. అలాగే సూరత్-ముంబై ఎలివేటెడ్ రోడ్డు ప్రతిపాదన కూడా ఉందన్నారు. దీనిపై ఇప్పటికే తగిన కార్యాచరణ చేపట్టామని, అయితే ఇప్పటివరకు ఎటివంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే అదేసమయంలో అహ్మదాబాద్-ముంబై హైవేకు టన్నెల్ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించామన్నారు. కాగా, తాను హాలెండ్ పర్యటనలో ఉన్నప్పుడు టన్నెల్ రోడ్ ఆలోచన వచ్చిందని వివరించారు. టన్నెల్ రోడ్డు ఒక సెక్షన్ మహీమ్ క్రీక్ వద్ద ప్రారంభమై బాంద్రా-వర్లి సీలింక్, నారిమన్ పాయింట్లను కలుపుతూ వెళుతుందన్నారు. అలాగే మరో సెక్షన్ పనులు సెవ్రే వద్ద ప్రారంభమై సముద్రం కింద నుంచి జేఎన్పీటీ, ముంబై పోర్టులను కలుపుతుందని వివరించారు. -
నల్లధనం గుట్టు... ఏనాటికి ఆటకట్టు
చట్టబద్ధంకాని మాదకద్రవ్యాల ఒప్పందం (ఈటఠజ ఛ్ఛ్చీజీజ), పైరసీలు బ్లాక్ మార్కెట్ వ్యవస్థలో భాగాలు. బ్లాక్ మార్కెట్‌ను అండర్ గ్రౌండ్ (Under Ground), లేదా బ్లాక్ ఎకానమీ (Black Economy) అని కూడా అంటారు. బ్లాక్ ఎకానమీలోని అంతర్భాగమే నల్లధనం (ఆౌఛిజు కౌ్ఛడ). ఆర్థిక వేత్తల మాటల్లో చెప్పాలంటే... 1950లలో భారత్‌లో నల్లధనం వద్ధి 3 శాతం. కాగా ప్రస్తుతం అది 50 శాతానికి పెరిగింది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ 2001-10 ప్రకారం 150 నల్లధనం దేశాల జాబితాలో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఇల్లిసిట్ నివేదిక-ముఖ్యాంశాలు illicit financial flows from Developing Countries 2002-11 నివేదిక ప్రకారం....2002-11 మధ్యలో భారత్ నుంచి బయటి దేశాలకు తరలిన మొత్తం నల్లధనం 343 బిలియన్ డాలర్లు అంటే రూ. 21 లక్షల కోట్లు. 2011లో 84.93 బిలియన్ డాలర్లు అంటే రూ. 5 లక్షల కోట్లని లెక్క తేల్చింది. చట్టబద్ధం కాని ద్రవ్యం ఎగుమతిలో భారత్‌ను ఐదో అతిపెద్ద ఎగుమతిదారుగా పేర్కొంది. నేరాలు, మితిమీరిన అవినీతి, పన్నుల ఎగవేత కారణంగా 2011లో అభివద్ధి చెందుతున్న దేశాల నుంచి 946.7 బిలియన్ డాలర్లు అంటే రూ. 57 లక్షల కోట్లు విదేశాలకు మళ్లిందని స్పష్టం చేసింది. 2011లో ఇల్లిసిట్ క్యాపిటల్ ఎగుమతికి సంబంధించి మొదటి 15 అతిపెద్ద ఎగుమతి దారుల్లో ఆసియా దేశాలే మొదటి ఆరు స్థానాల్లో నిలవడం ఆశ్చర్యకరం. వీటిలో చైనా, మలేసియా, భారత్, ఇండోనేసియా, థాయ్‌లాండ్, ఫిలిపై ్పన్స్ ఉన్నాయి. గత పదేళ్లలో అభివద్ధి చెందుతున్న దేశాల నుంచి చట్టబద్ధం కాని మూల ధన ప్రవాహ (illicit out flows) వద్ధి 10.2 శాతం. ఆయా దేశాల జీడీపీ వద్ధి సగటు కంటే చట్టబద్ధం కాని మూల ధన ప్రవాహమే అధికం. వివిధ రంగాల మధ్య సరిగా లేని వనరుల పంపిణీ, సమర్థత లోపించిన సర్కారు వ్యయం, ప్రభుత్వ విధానాల వైఫల్యంతో బ్లాక్ ఎకానమీ ఏర్పడిందని నివేదిక వివరించింది. భారత్‌లో నల్లధనం పుట్టుకకు మూలాలు 1.భారత్‌లో ఎఫ్ఎంసీజీ (F.M.C.G: Fast Moving Consumer Goods) రంగంలో ఏటా రూ. 7వేల కోట్ల చట్ట బద్ధం కాని దిగుమతులు జరుగుతున్నాయి. ఏటా ఎకై ్సజ్ పన్నుకు సంబంధించి రూ. 500 కోట్లు పన్ను ఎగవేత ఈ రంగంలో నమోదవుతోంది. 2.ఆటో మొబైల్ రంగంలో విడిభాగాల (ఞ్చట్ఛ ఞ్చట్టట) తయారీ సంస్థలు తమ మొత్తం ఉత్పత్తిలో 40 శాతాన్ని రికార్డులలో నమోదు చేయకుండా విక్రయిస్తున్నాయి. తద్వారా ఈ రంగంలో తయారీ ఉత్పత్తి విలువ ప్రతి సంవత్సరం రూ. 4,500 కోట్లు నమోదవడం లేదు. 3.సంగీత పరికరాల వార్షిక మార్కెట్ రూ. 700 కోట్లు కాగా ఈ రంగంలో పైరసీ ప్రధాన సమస్యగా మారింది. దీని వార్షిక టర్నోవర్ 2000లో రూ. 1200 కోట్లు. ప్రస్తుతం అది రూ. 600 కోట్లకు పడిపోయింది. 4.స్థిరాస్తి వ్యాపారం (రియల్ ఎస్టేట్) మార్కెట్ వార్షిక పరిమాణం 16 బిలియన్ డాలర్లు . ఈ మొత్తంలో 60 నుంచి 70 శాతం నగదు రూపంలో లావాదేవీలు జరగడం వల్ల నల్లధన పరిమాణం పెరుగుతోంది. 5.పన్నుల నిర్మాణాలు, ప్రోత్సాహకాల విషయంలో పలు దేశాల విధానాలు భారత్‌లో నల్లధనం పెరగడానికి కారణాలవుతున్నాయి. 6.ఎన్నికైన ప్రభుత్వాల ద్వారా అనేక ప్రయోజనాలను ఆశించే పారిశ్రామిక వేత్తలు రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో ఇచ్చే మొత్తంలో అధిక భాగానికి లెక్కలు చూపడం లేదు. దీంతో ప్రభు త్వానికి పన్ను రాబడి తగ్గుతోంది. 7.బంగారం కొనుగోలుకు వినియోగదారులు వెచ్చించే పెట్టుబడులు కూడా దేశంలో నల్లధన ప్రవాహం పెరగడానికి కారణం. బంగారంపై పెట్టుబడులు, పొదుపు కారణంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం 1990కి ముందు బంగారం ఎగుమతి, దిగుమతులపై నియంత్రణ విధించింది. ప్రై వేటు వ్యక్తుల దగ్గర ఉండే విదేశీ మారక ద్రవ్య నిల్వలు వ్యాపార చెల్లింపుల శేషం స్థితి మెరుగవడానికి దోహదపడవు. ఈ క్రమంలో బంగారం స్మగ్లింగ్ పెరిగింది. ప్రజలు పన్ను చెల్లించని ఆదాయాన్ని బంగారంపై పెట్టుబడులు పెట్టారు. దిగుమతిదారులు, స్మగ్లర్ల ద్వారా ఈ ద్రవ్యం బయటి దేశాలకు తరలివెళ్లింది. 8.సేవా రంగంలో అధిక వద్ధితో నల్లధనం విస్తరించింది. ఈ రంగానికి సంబంధించిన కార్య కలాపాలలో వాస్తవ విలువను లెక్కించడంలో చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో ప్రభుత్వానికి పన్ను చెల్లించని ఆదాయం పెరిగింది. మరోవైపు సేవా రంగంలో అసంఘటిత రంగ కార్యకలాపాలు అధికమయ్యాయి. ఉత్పత్తి పెరుగుదలతో పాటు ప్రత్యేకీకరణ, ప్రకటనలు, ప్రచారాలపై అధిక వ్యయాలతో పలు సేవా రంగ కార్యకలాపాలకు డిమాండ్ పెరుగుతోంది. నల్లధనం- అంచనాలు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (National Institute of Public Finance and Policy) డాక్టర్.ఎస్.ఆచార్య మార్గదర్శకంలో ‘ Black Economy in india‘పై అధ్యయనాన్ని నిర్వహించింది. దీనిప్రకారం 1975-76లో భారత్ లోని మొత్తం నల్లధనం సుమారు 11,870 కోట్లు. జీడీపీలో దీని వాటా 15 -18 శాతం. 1983-1984లో నల్లధనం రూ. 36, 784 కోట్లు. జీడీపీలో దీని వాటా 21 శాతానికి సమానమని నివేదిక తెలిపింది. పలు అధ్యయనాల ప్రకారం 1999-2000 లో నల్లధనం రూ. 4.1 లక్షల కోట్లు కాగా 2006-07 నాటికి 9.6 లక్షల కోట్లకు, ప్రస్తుతం 1.5 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఉన్న భారత్ నల్లధనం అంచనాలను ఈ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గత ఐదేళ్ల కాలంలో సుమారు రూ. 50 లక్షల కోట్లు దేశ సరిహద్దులు దాటిందని అంచనా. ఈ మొత్తంలో రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, ఇతర ప్రజా ప్రతినిధులదే అగ్రభాగం. గత రెండేళ్లలో దేశం నుంచి బయటికి వెళ్లిన నల్లధనం మనకున్న అప్పు కంటే 13 రెట్లు ఎక్కువని విశ్లేషకుల అభిప్రాయం. అరుణ్‌కుమార్ అనే పరిశీలకుని అభిప్రాయంలో జీడీపీలో నల్లధనం వాటా 40 శాతం. నల్లధనాన్ని చట్టబద్ధంగా ప్రకటించి ప్రభుత్వ రికార్డులలో నమోదు చేసి దానిపై 30 శాతం పన్ను విధిస్తే ఏటా సర్కారుకు రూ. 7,50,000 కోట్లు ఆదాయం సమకూరుతుంది. ఆర్థిక వ్యవస్థపై నల్లధనం ప్రభావం 1.ఆదాయానికి సంబంధించి ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోతే నల్లధనం ప్రవాహం పెరుగుతుంది. తద్వారా పన్నురాబడి తగ్గుతుంది. రెవెన్యూ రాబడికి పన్నుల ద్వారా సమకూరిన ఆదాయమే ప్రధాన వనరు. పన్ను రాబడి తగ్గితే పన్ను-జీడీపీ నిష్పత్తిలో క్షీణత ఏర్పడుతుంది. పన్ను-జీడీపీ నిష్పత్తి పెంచే క్రమంలో ప్రభుత్వం పరోక్ష పన్నులపై ఆధారపడితే లక్షిత వర్గాల జీవన ప్రమాణం కుంటుపడుతుంది. 2.నల్లధనం మితిమీరితే ఆదాయ పంపిణీలో అసమానతలు తలెత్తుతాయి. ప్రస్తుతం ఈ పరిస్థితికి నల్లధనమే ప్రధాన భూతం. దేశంలోని ఆదాయ అసమానతలను పేదరిక తీవ్రత ద్వారా తెలుసు కోవచ్చు. ఇటీవల పేదరికంపై అంచనా వేసేందుకు ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసిన రంగరాజన్ కమిటీ ప్రకారం దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న పేదల శాతం 21.9. 3.నల్లధనంతో చట్టబద్ధం కాని కార్యకలాపాలు పెచ్చరిల్లుతాయి. శాంతి భద్రతల సమస్య జటిలమవుతుంది. సాధారణ ఆదాయ స్థాయి కంటే తక్కువ ఆదాయ వర్గ ప్రజల శాతం ఎక్కువయితే జీడీపీ అల్ప అంచనాకు లోనవుతుంది. 4.అధిక ద్రవ్య చెలామణీలో ఉన్నప్పుడు ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకుంటే...అభివద్ధి, సంక్షేమ కార్యకలాపాల అమలుపై రుణాత్మక ప్రభావం ఏర్పడుతుంది. 5.ఉత్పాదక రంగాలపై పెట్టుబడులు తగ్గి, అనుత్పాదక రంగాలపై పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. తద్వారా ఉత్పాదక రంగాలలో ఉత్పత్తి, ఉత్పాదకత క్షీణిస్తుంది. 6.పన్ను చెల్లించని నల్లధనం మొత్తాన్ని ఖర్చు పెట్టనపుడు దేశంలో పొదుపు రేటు పెరిగి, ఆర్థిక వ్యవస్థలో చెలామణీలో ఉన్న ద్రవ్య పరిమాణం తగ్గుతుంది. ఈ స్థితి దేశంలో వద్ధి రేటు తగ్గుదలకు, నిరుద్యోగిత రేటు పెరుగుదలకు దారి తీస్తుంది. 7.ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది. శాసన, న్యాయ, పోలీస్, బ్యూరోక్రసీ, ప్రసార మాధ్యమాలు తమ విధులను సక్రమంగా నిర్వహించలేవు. ఇటీవల పరిణామాలు నల్లధనాన్ని అరికట్టే విషయంలో భారత్ 13 దేశాలతో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ (Tax informationExchange) ఒప్పందాలను కుదుర్చుకుంది. ఏప్రిల్ 1, 2011 నుంచి భారతీయులకు సంబంధించిన బ్యాంకింగ్ సమాచారాన్ని స్విట్జర్లాండ్ నుంచి పొందేందుకు వీలుగా ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే 82 దేశాలతో డబుల్ ట్యాక్స్ అవాయ్‌డెన్స్ (Double TaxAvoidance) ఒప్పందం చేసుకుంది. వీటిలో ప్రముఖ ట్యాక్స్ హేవెన్ (Tax haven) దేశాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి వేరే దేశంలో నల్లధనాన్ని దాచినట్లయితే ఒక దేశం తరపున మరో దేశం పన్ను వసూలు చేసే విధంగా భారత్ రెండు దేశాలతో ఒప్పందాలను విస్తరించుకొంది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన జి-20 సదస్సు ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (Automatic Exchange of Information)కు సంబంధించి ప్రోటోకాల్ రూపొందించింది. దీని ప్రకారం దేశాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. అలాగే భారతీయులకు సంబంధించిన బ్యాంక్ వివరాలను ఆయా దేశాలకు అందించాలి. ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తో పన్ను ఎగవేతను అరికట్టవచ్చు. 2018 చివరి నాటికి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభమైతే పన్ను ఎగవేతదారులకు సురక్షిత మార్గమైన మనీ లాండరింగ్‌ను పూర్తిగా అరికట్టవచ్చు. దేశంలో ఎలాంటి సంస్కరణలు చేపట్టకుండా నల్లధనాన్ని నిర్మూలించడం కష్టం. స్విస్ బ్యాంకులలో లెక్కచూపని నగదు కలిగిన భారతీయుల పేర్లు వెల్లడించాల్సిందిగా ఈ ఏడాది జూన్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్విస్ ప్రభుత్వాన్ని కోరారు. భారత రెవెన్యూ కార్యదర్శి శక్తి కాంత దాస్ , స్విస్ సెక్రటరీ ఫర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ జాక్వెస్ డి వాల్టా విల్లే మధ్య జరిగిన అత్యున్నత సమావేశంలో నల్లధనానికి సంబంధించి నిర్దేశిత కాల ప్రాతిపదికన భారత్‌కు సమాచారాన్ని ఇవ్వడానికి స్విస్ అంగీకరించింది. స్విస్ నేషనల్ బ్యాంక్ ఇటీవల గణాంకాల ప్రకారం స్విస్ బ్యాంకులలో భారతీయులు దాచిన మొత్తం డిసెంబర్ 2013 చివరి నాటికి రూ. 14వేల కోట్లు. గతేడాదితో పోల్చిచూస్తే ఇది 42 శాతం పెరిగిందని తెలిపింది. నిఘా సంస్థలు సేకరించిన భారతీయ విదేశీ ఖాతాలకు సంబంధించి సమాచారం నిజమైందో? కాదో? చెప్పేందుకు కూడా స్విస్ అంగీకరించింది. తెల్లధనంగా మార్చితే తేజోమయమే 1. 12వ ప్రణాళికలో 9 శాతం జీడీపీని సాధించవచ్చు. 2. విద్యుత్బోర్డులను సమర్థంగా తీర్చిదిద్ది శక్తి సంక్షోభం నివారించవచ్చు. 3. 10 కోట్ల ప్రజలకు పక్కా గహాలను నిర్మించవచ్చు. 4. వ్యవసాయరంగంలో మేలు రకపు వంగడాల కోసం పరిశోధనలకు అధిక నిధుల కేటాయింపు 5. నిరుపేదల జీవన ప్రమాణాల పెంపునకు సంక్షేమ కార్యక్రమాల అమలు 6. {పభుత్వం రుణ భారాన్ని తగ్గించుకోవచ్చు 7. వెనకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేయవచ్చు. 8. చిన్న, సన్న కారు రైతులకు సంబంధించి వ్యవసాయ రుణాల మాఫీ సాధ్యమవుతుంది. 9. నిరుద్యోగం, పేదరికాన్ని పూర్తిగా అరికట్టి, ప్రపంచ దేశాలకే దిక్సూచిగా మార్చవచ్చు. ఏదీ చిత్తశుద్ధి? ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు నల్లధనంపై ఘోషించిన పాలక పెద్దలు...అధికార పీఠమెక్కాక నోరుమెదపడం లేదు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ ఉదాసీన వైఖరినే అవలంబిస్తుండటం విచారకరం. నల్లధనం విషయంలో ఏదో పురోగతి సాధిస్తుందనుకున్న ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అదే బాటలో నడుస్తుంది. ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు రెండు సార్లు భారతీయుల ఖాతాల వివరాలను అందించినా బిహ ర్గతం చేయకపోవడం వెనుక అసలు రహస్యమేంటో మోదీ సర్కారుకే తెలియాలి. విదేశాల్లో మూలుగుతున్న మన వాళ్ల నల్లధనాన్ని రప్పించి తెల్లధనంగా మార్చితే అమెరికానే తలదన్నవచ్చన్నది అక్షర సత్యం. కానీ ఆ దిశగా అడుగులు వేసే వారెవరు? గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ 2001-10 ప్రకారం నల్లధనం జాబితాలో 10 అగ్ర దేశాలు. దేశం విలువ (బిలియన్ డాలర్లలో) 1. చైనా 2,740 2. మెక్సికో 476 3. మలేసియా 285 4. సౌదీ అరేబియా 210 5. రష్యా 152 6. ఫిలిప్పీన్స్ 138 7. నైజీరియా 129 8. ఇండియా 123 9. ఇండోనేసియా 109 10. యూఏఈ 107