వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో నీటికుంటలో స్నానానికి దిగి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పరకాల మండలం అక్కంపేటకు చెందిన రాజ్‌కుమార్ (11), గంగదేవిపల్లికి చెందిన శ్రీశాంత్ (12) పండగ సెలవుల్లో నాగాపురంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. బుధవారం మధ్యాహ్నం ఐనవోలు శివారులోని కుంటలో స్నానానికి దిగి మునిగిపోయారు. ఎంతకీ బయటకు రాకపోవడంతో స్థానికులు గాలింపు చేపట్టడంతో కుంటలో మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.