![Small Trick To Bath In Cold Weather To Escape Cold - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/18/Cold.jpg.webp?itok=3gDF6uSo)
శీతాకాలంలో సాధారణంగా స్నానం చేయడానికే ఇష్టపడరు కొంతమంది! పైగా చన్నీటి స్నానం అంటే ఆమడ దూరం పరిగెడతారు. అలాంటి చలికాలంలో చలిని తప్పించకుంటూ చన్నీటి స్నానం చేసే ట్రిక్‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
అసలు విషయంలోకెళ్తే.. ఆ వీడియోలో ఒక వ్యక్తి నది లేదా చెరువులో స్నానం చేస్తున్నట్లు కనిపించింది. అయితే ఆ వ్యక్తి చలిని తప్పించుకునే నిమిత్తం ముందు ఒక పెద్దప్లేటులో చలిమంట ఏర్పాటు చేసుకున్నాడు. నదిలో ఒక మునక వేస్తూ గజగజ వణికిపోతున్నాడు. మళ్లీ తన ముందున్న చలిమంట వైపు చేతులు చాచి చలి కాచుకుంటూ మళ్లీ ఇంకో మునక.. ఇలా ఫన్నీ ఫన్నీగా స్నానం చేశాడు.
అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోకి ‘మై ఇండియా ఈజ్ గ్రేట్... ప్రామిసింగ్ ఇండియా’ అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ‘ఇది చన్నీటి ట్రిక్’ అని ఒకరు, మరోకరేమో ‘భారతీయులను ట్రిక్స్‌లో ఎవరూ ఓడించలేరు’ అంటూ రకరకాలుగా ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు.
Mera Bharat Mahaan.....☺️😊
— Rupin Sharma (@rupin1992) January 11, 2022
होनहार भारत.....☺️☺️😊😊😊😊 pic.twitter.com/Ixnq5H1YY3
(చదవండి: సెల్ఫీలతో మిలీనియర్ అయిన స్టూడెంట్.. ఎలా ఎదిగాడో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment