స్నానం చేస్తుండగా చూశాడని.. | Girl sets self on fire after seeing Peeping Tom | Sakshi
Sakshi News home page

స్నానం చేస్తుండగా చూశాడని..

Published Fri, Jul 22 2016 5:40 PM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM

స్నానం చేస్తుండగా చూశాడని..

స్నానం చేస్తుండగా చూశాడని..

జైపూర్: స్నానం చేస్తుండా ఆకతాయి బాత్ రూమ్ లోకి తొంగిచూసిన ఘటనలో అవమానాన్ని భరించలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన రాజస్థాన్ లో సంచలనం రేపింది. భిల్వారా జిల్లా ఎస్పీ ప్రదీప్ మోహన్ శర్మ కథనం ప్రకారం..  దేలాన్ గ్రామానికి చెందిన యువతి(20) బుధవారం సాయంత్రం స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన యువకుడు(18) బాత్ రూమ్ లోకి తొంగిచూసే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన యువతి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు పరుగునవచ్చి ఆకతాయిని పట్టుకుని చితగొట్టి కట్టేశారు. కొద్ది సేపటికి యువకుడి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి యువతి బంధువులతో గొడవకు దిగారు. కట్లు ఊడదీసి యువకుణ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలకు మధ్య తోపులాట జరిగింది.

తన కారణంగానే ఇంత ఘర్షణ జరిగిందనే అవమానంతో బాధిత యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇదే అదనుగా ఆ ఆకతాయి అక్కణ్నుంచి పారిపోయాడు. 70 శాతం కాలిన గాయలతో ప్రస్తుతం యువతి ఉదయ్ పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి వాగ్మూలం మేరకు యువకుడితోపాటు అతని కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదుచేసినట్లు ఎస్పీ తెలిపారు. కాగా, ఆ యువతీయువకులు ప్రేమికులని, వాళ్లిద్దరూ బాత్ రూమ్ లో కలిసి ఉండటాన్ని యువతి మావయ్య చూశాడని, అమ్మాయి తప్పును కప్పి పుచ్చేందుకే బాత్ రూమ్ లోకి తొంగిచూసినట్లు చెబుతున్నరని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దోషులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నాడని, యువతి ఇంటికి వెళ్లి గొడవ చేసిన అతని బంధువులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement