
జైపూర్ : రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా కేసార్‌పుర వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భిల్వారా నుంచి వేగంగా వస్తున్న ట్రాలర్ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. కాగా మృతి చెందినవారిలో ఉమేశ్(40), ముఖేశ్(23), జయమ్నా(45), అమర్ చంద్(32), రాజు(21),రాధేశ్యామ్(56) ,శివాల్(40) ఉన్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై గంటపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బిజౌలియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యానులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి : అస్సాంలో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి)
Comments
Please login to add a commentAdd a comment