girl attempted suicide
-
తన ఫొటో వాట్సప్ స్టేటస్‌లో పెట్టాడని..
బొమ్మలరామారం : ఓ బాలుడికి చెందిన వాట్సాప్ స్టేటస్‌లో తన ఫొటో పెట్టాడని మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బోయిన్పల్లి గ్రామానికి చెందిన సాభావత్ శిల్ప(14) మూడు చింతల పల్లి‡మండలం పోతారం గ్రామంలో ఉన్న కూరగాయల తోటలో కూలీగా జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో మండలంలోని బోటిమీది తండాకు చెందిన తేజావత్ మధుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య గల సన్నిహితంతో బాలుడు సదరు బాలిక ఫొటోను శుక్రవారం తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టాడు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిన్నారి తన పనిచేసే తోటలో గల పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మధు వేధింపులతోనే తన కూతురు శిల్ప ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి జయమ్మ షామీర్‌పేట్‌లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: శభాష్! క్రేన్‌తో వ్యక్తిని కాపాడిన పోలీసులు చదవండి: నలుగురు ఆడపిల్లల జననం: అత్తామామ, భర్త కలిసి.. చదవండి: శభాష్! క్రేన్‌తో వ్యక్తిని కాపాడిన పోలీసులు -
స్నానం చేస్తుండగా చూశాడని..
జైపూర్: స్నానం చేస్తుండా ఆకతాయి బాత్ రూమ్ లోకి తొంగిచూసిన ఘటనలో అవమానాన్ని భరించలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన రాజస్థాన్ లో సంచలనం రేపింది. భిల్వారా జిల్లా ఎస్పీ ప్రదీప్ మోహన్ శర్మ కథనం ప్రకారం.. దేలాన్ గ్రామానికి చెందిన యువతి(20) బుధవారం సాయంత్రం స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన యువకుడు(18) బాత్ రూమ్ లోకి తొంగిచూసే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన యువతి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు పరుగునవచ్చి ఆకతాయిని పట్టుకుని చితగొట్టి కట్టేశారు. కొద్ది సేపటికి యువకుడి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి యువతి బంధువులతో గొడవకు దిగారు. కట్లు ఊడదీసి యువకుణ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలకు మధ్య తోపులాట జరిగింది. తన కారణంగానే ఇంత ఘర్షణ జరిగిందనే అవమానంతో బాధిత యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇదే అదనుగా ఆ ఆకతాయి అక్కణ్నుంచి పారిపోయాడు. 70 శాతం కాలిన గాయలతో ప్రస్తుతం యువతి ఉదయ్ పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి వాగ్మూలం మేరకు యువకుడితోపాటు అతని కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదుచేసినట్లు ఎస్పీ తెలిపారు. కాగా, ఆ యువతీయువకులు ప్రేమికులని, వాళ్లిద్దరూ బాత్ రూమ్ లో కలిసి ఉండటాన్ని యువతి మావయ్య చూశాడని, అమ్మాయి తప్పును కప్పి పుచ్చేందుకే బాత్ రూమ్ లోకి తొంగిచూసినట్లు చెబుతున్నరని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దోషులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నాడని, యువతి ఇంటికి వెళ్లి గొడవ చేసిన అతని బంధువులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. -
పెళ్లి పేరుతో నయవంచన..
బాలిక ఆత్మహత్యాయత్నం అబార్షన్ మాత్రలు కూల్‌డ్రింక్‌లో కలిపి తాగించిన యువకుడు దుబ్బాక : ఓ యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసిం ది. సీఐ రామకృష్ణారెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక (15), అదే గ్రా మానికి చెందిన బాపురెడ్డి ఏడాదిన్నరగా ప్రే మించుకుంటున్నారు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని బాపురెడ్డిని వేడుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాపురెడ్డి సిద్దిపేటకు రావాలని బాలికకు చెప్పాడు. నిజమని నమ్మిన బాలిక సిద్దిపేటకు వెళ్లింది. అక్కడి నుంచి బాల్‌రెడ్డి మరో ఇద్దరు స్నేహితులైన బాల్‌రాజు, సుమన్‌తో కలిసి బాలికను సిద్దిపేట పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లారు. అబార్షన్ మాత్రలను కూల్‌డ్రింక్‌లో కలిపి తాగిం చారు. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపిం ది. తాను మోసపోయానని తెలుసుకున్న బా లిక తన చేతులుకున్న గాజులను పగులకొట్టి ఈనెల 25న మింగి ఆత్మహత్యాయత్నం చే సింది. బాలికను సిద్దిపేట ఆస్పత్రిలో చేర్పిం చగా పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.