బాలిక ఆత్మహత్యాయత్నం
అబార్షన్ మాత్రలు కూల్‌డ్రింక్‌లో కలిపి తాగించిన యువకుడు
దుబ్బాక : ఓ యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసిం ది. సీఐ రామకృష్ణారెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక (15), అదే గ్రా మానికి చెందిన బాపురెడ్డి ఏడాదిన్నరగా ప్రే మించుకుంటున్నారు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని బాపురెడ్డిని వేడుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాపురెడ్డి సిద్దిపేటకు రావాలని బాలికకు చెప్పాడు. నిజమని నమ్మిన బాలిక సిద్దిపేటకు వెళ్లింది.
అక్కడి నుంచి బాల్‌రెడ్డి మరో ఇద్దరు స్నేహితులైన బాల్‌రాజు, సుమన్‌తో కలిసి బాలికను సిద్దిపేట పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లారు. అబార్షన్ మాత్రలను కూల్‌డ్రింక్‌లో కలిపి తాగిం చారు. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపిం ది. తాను మోసపోయానని తెలుసుకున్న బా లిక తన చేతులుకున్న గాజులను పగులకొట్టి ఈనెల 25న మింగి ఆత్మహత్యాయత్నం చే సింది. బాలికను సిద్దిపేట ఆస్పత్రిలో చేర్పిం చగా పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
పెళ్లి పేరుతో నయవంచన..
Published Fri, Aug 28 2015 11:57 PM | Last Updated on Sun, Sep 2 2018 3:43 PM
Advertisement
Advertisement