అందరూ ఆడపిల్లలేనని..! | Husband drunked and killed his wife and kid | Sakshi
Sakshi News home page

అందరూ ఆడపిల్లలేనని..!

Published Wed, Jul 19 2017 1:01 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

అందరూ ఆడపిల్లలేనని..! - Sakshi

అందరూ ఆడపిల్లలేనని..!

- భార్య, ఇద్దరు బిడ్డలపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన కిరాతకుడు
భార్య సజీవదహనం.. ఆస్పత్రికి తరలిస్తుండగా పెద్దకూతురు మృతి
తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్న చిన్నకుమార్తె
 
బీబీనగర్‌: ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని.. మూడో కాన్పులోనూ ఆడపిల్లే అనే అనుమానంతో ఓ భర్త ఘాతుకానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో గర్భంతో ఉన్న భార్య, ఇద్దరు పిల్లలపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో భార్య మంటల్లో సజీవ దహనమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా పెద్దకుమార్తె ప్రాణాలొదిలింది. ఈ సంఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. బీబీనగర్‌ మండలం రావిపహాడ్‌కు చెందిన బానోతు శంకర్‌ నాయక్, సావిత్రి (30) దంపతులకు శ్రీదేవి, శ్రీనిజ సంతానం. జీవనోపాధికి శంకర్‌ నాయక్‌ బోర్‌వెల్‌ బండిపై పనిచేస్తున్నాడు. కొంతకాలంగా తాగుడుకు బానిసై ఆడపిల్లల విషయంలో తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఇదే విషయమై పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగినా అతడిలో మార్పు రాలేదు. 
 
ఆదమరచి నిద్రిస్తున్న వేళ..
శంకర్‌ సోమవారం ఇంటి వద్దే పూటుగా మద్యం సేవించాడు. ఆదమరచి నిద్రిస్తున్న భార్య, ఇద్దరు పిల్లలపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. తప్పించుకున్న చిన్న కుమార్తె శ్రీనిజ రోదిస్తూ ఇరుగు పొరుగువారికి సమాచారం అందించింది. వారొచ్చి చూసే సరికి సావిత్రి మంటల్లో మాడి మసైపోగా.. తీవ్రంగా గాయపడిన పెద్దకుమార్తె శ్రీదేవిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని సీఐ అర్జునయ్య పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ తెలిపారు. కాగా నిందితుడు శంకర్‌ నాయక్‌ పరారీలో ఉన్నాడు. 
 
నాన్నే నిప్పంటించాడు: శ్రీనిజ 
రాత్రి అమ్మా, నేను అక్క పడుకున్నాం. నాన్న వచ్చి కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. మంటలను చూసి నాకు భయమేసింది. తలుపు తీసి ఉండటంతో మంచం కింది నుంచి బయటికి వెళ్లిపోయా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement