
బొమ్మలరామారం : ఓ బాలుడికి చెందిన వాట్సాప్ స్టేటస్‌లో తన ఫొటో పెట్టాడని మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన సాభావత్ శిల్ప(14) మూడు చింతల పల్లి‡మండలం పోతారం గ్రామంలో ఉన్న కూరగాయల తోటలో కూలీగా జీవనం సాగిస్తోంది.
ఈ నేపథ్యంలో మండలంలోని బోటిమీది తండాకు చెందిన తేజావత్ మధుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య గల సన్నిహితంతో బాలుడు సదరు బాలిక ఫొటోను శుక్రవారం తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టాడు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిన్నారి తన పనిచేసే తోటలో గల పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మధు వేధింపులతోనే తన కూతురు శిల్ప ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి జయమ్మ షామీర్‌పేట్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చదవండి: శభాష్! క్రేన్‌తో వ్యక్తిని కాపాడిన పోలీసులు
చదవండి: నలుగురు ఆడపిల్లల జననం: అత్తామామ, భర్త కలిసి..
చదవండి: శభాష్! క్రేన్‌తో వ్యక్తిని కాపాడిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment